AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Realme: రియల్‌మీ నుంచి 15,000 mAh బ్యాటరీతో సూపర్ స్మార్ట్‌ఫోన్‌.. పూర్తి వివరాలు!

Realme: ఈ డివైజ్ ఆగస్టు 27న ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించనుంది. అలాగే ఇది ఒక కాన్సెప్ట్ ఫోన్ అని తెలుస్తోంది. వెనుక ప్యానెల్‌లోని '15000mAh' టెక్స్ట్ దీన్ని మరింత ప్రత్యేకంగా చేస్తుంది. రియల్‌మీ తన బ్యాటరీ 50 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందించగలదని,

Realme: రియల్‌మీ నుంచి 15,000 mAh బ్యాటరీతో సూపర్ స్మార్ట్‌ఫోన్‌.. పూర్తి వివరాలు!
Subhash Goud
|

Updated on: Aug 26, 2025 | 5:23 PM

Share

Realme: రియల్‌మీ ఇప్పుడు బ్యాటరీ శక్తిని కొత్త స్థాయికి తీసుకెళ్లడానికి సిద్ధమవుతోంది. ఇటీవల విడుదలైన ప్రమోషనల్ పోస్టర్‌లో కంపెనీ రాబోయే స్మార్ట్‌ఫోన్ భారీ 15,000mAh బ్యాటరీతో వస్తుందని వెల్లడించింది. ప్రత్యేకత ఏమిటంటే ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ, ఫోన్ మందంగా లేదా బరువుగా కనిపించదు. సాధారణ స్మార్ట్‌ఫోన్ లాగా సన్నగా కనిపిస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో కంపెనీ ప్రవేశపెట్టిన రియల్‌మీ సిలికాన్ యానోడ్ టెక్నాలజీని ఇందులో ఉపయోగించాలని భావిస్తోంది.

ఇది కూడా చదవండి: Indian Currency: 100, 200 రూపాయల నోట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. బ్యాంకులకు కీలక ఆదేశాలు!

రియల్‌మీ 15,000 ఎంఏహెచ్ బ్యాటరీతో కాన్సెప్ట్ ఫోన్‌

ఇవి కూడా చదవండి

ఈ డివైజ్ ఆగస్టు 27న ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించనుంది. అలాగే ఇది ఒక కాన్సెప్ట్ ఫోన్ అని తెలుస్తోంది. వెనుక ప్యానెల్‌లోని ‘15000mAh’ టెక్స్ట్ దీన్ని మరింత ప్రత్యేకంగా చేస్తుంది. రియల్‌మీ తన బ్యాటరీ 50 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందించగలదని, ఒకే ఛార్జ్‌పై ఐదు రోజులకు పైగా ఉంటుందని పేర్కొంది.

ఇది కూడా చదవండి: Washing Powder Nirma: ఒకప్పుడు దేశాన్ని ఏలిన ‘నిర్మా’ ఇప్పుడు ఏమైపోయింది..? ఒక తప్పు వల్ల కనుమరుగు

టీజర్‌ను విడుదల చేసిన రియల్‌మి:

రియల్‌మీ ఇటీవల విడుదల చేసిన టీజర్‌లో ‘1x000mAh’ బ్యాటరీ గురించి ప్రస్తావించింది. ఇది 10,000mAh కంటే ఎక్కువ సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఈ సంవత్సరం మేలో కంపెనీ 10,000mAh బ్యాటరీతో కూడిన కాన్సెప్ట్ ఫోన్‌ను కూడా ప్రవేశపెట్టింది. దీనికి ‘అల్ట్రా-హై సిలికాన్-కంటెంట్ యానోడ్ బ్యాటరీ’ ఉంది. దీని సిలికాన్ నిష్పత్తి 10 శాతం అని తెలిపింది. ఇది పరిశ్రమలో అత్యధికంగా బ్యాటరీగా ఉంది. ఆ సమయంలో దాని శక్తి సాంద్రత 887Wh/L, ఇది ప్రస్తుత స్మార్ట్‌ఫోన్‌ల కంటే మెరుగైన పనితీరును ఇస్తుంది.

10,000mAh బ్యాటరీ కలిగిన ఈ కాన్సెప్ట్ ఫోన్ ‘మినీ డైమండ్’ ఆర్కిటెక్చర్, 320W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. దీనికి సెమీ-ట్రాన్స్పరెంట్ బ్యాక్, 8.5mm మందం, 200 గ్రాముల కంటే కొంచెం ఎక్కువ బరువు ఉంది. Realme 320W సూపర్‌సోనిక్ ఛార్జ్ టెక్నాలజీ కేవలం 4 నిమిషాల 30 సెకన్లలో బ్యాటరీని జీరో నుండి 100 శాతం వరకు ఛార్జ్ చేస్తుందని పేర్కొంది. అదే సమయంలో బ్యాటరీ కేవలం 1 నిమిషం ఛార్జింగ్‌లో 26 శాతం వరకు, 2 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.

ఇది కూడా చదవండి: School Holiday: విద్యార్థులకు తీపి కబురు.. తెలుగు రాష్ట్రాల్లో బుధవారం పాఠశాలలు బంద్‌!

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి