AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ITR Filing Rules: TDS రూ. 25,000 కంటే ఎక్కువ ఉందా.. అయితే, రిటర్న్ ఫైల్ చేయాల్సిందే.. లేదంటే ఇబ్బందులే..

TDS/TCS క్రెడిట్‌ని క్లెయిమ్ చేయడానికి ITR ఫైలింగ్ చేయాల్సి ఉన్నప్పటికీ, ITR ఫైలింగ్‌ని డిపార్ట్‌మెంట్ తప్పనిసరి చేయలేదు. దీని ద్వారా, అధిక-విలువ లావాదేవీలు చేసే, తక్కువ ఆదాయం ఉన్నందున రిటర్న్‌లను దాఖలు చేయని వ్యక్తులను ప్రభుత్వం కోరుతోంది.

ITR Filing Rules: TDS రూ. 25,000 కంటే ఎక్కువ ఉందా.. అయితే, రిటర్న్ ఫైల్ చేయాల్సిందే.. లేదంటే ఇబ్బందులే..
Itr Filing
Venkata Chari
|

Updated on: Apr 22, 2022 | 8:15 PM

Share

ఆర్థిక సంవత్సరంలో TDS/TCS రూ. 25,000 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ప్రతి వ్యక్తి ఆదాయపు పన్ను రిటర్న్‌(ITR Filing Rules)ను దాఖలు చేయడాన్ని ప్రభుత్వం ఇకనుంచి తప్పనిసరి చేసింది. సీనియర్ సిటిజన్ల విషయంలో, TDS/TCS రూ.50,000 దాటితే ఈ నియమం వర్తిస్తుంది. ఇది కాకుండా, ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో రూ. 50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్లు ఉన్న వ్యక్తులు కూడా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. TDS/TCS క్రెడిట్‌ని క్లెయిమ్ చేయడానికి ITR ఫైలింగ్ చేయాల్సి ఉన్నప్పటికీ, ITR ఫైలింగ్‌ని డిపార్ట్‌మెంట్ తప్పనిసరి చేయలేదు. దీని ద్వారా, అధిక-విలువ లావాదేవీలు చేసే, తక్కువ ఆదాయం ఉన్నందున రిటర్న్‌లను దాఖలు చేయని వ్యక్తులను ప్రభుత్వం కోరుతోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య దేశంలో ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు సంఖ్యను పెంచుతుంది. ఇది వ్యవస్థలో మరింత పారదర్శకతను తెస్తుందని ప్రభుత్వం అంటోంది.

60 లక్షల కంటే ఎక్కువ అమ్మకాలపై కూడా ITR ఫైల్ చేయాల్సిందే..

మీరు వ్యాపారాన్ని నడుపుతున్నట్లయితే.. ఆర్థిక సంవత్సరంలో మీ మొత్తం అమ్మకాలు, టర్నోవర్ లేదా స్థూల రశీదులు రూ. 60 లక్షల కంటే ఎక్కువగా ఉంటే, తప్పనిసరిగా రిటర్న్‌లను ఫైల్ చేయాల్సి ఉంటుంది. వ్యాపారంలో మీకు నష్టం లేదా లాభమా అనేది పట్టింపు లేదు. ఇది కాకుండా, మీరు వృత్తినిపుణులైతే.. వృత్తిలో మీ మొత్తం స్థూల రశీదులు మునుపటి సంవత్సరంలో రూ. 10 లక్షల కంటే ఎక్కువగా ఉంటే ITR ఫైల్ చేయడం తప్పనిసరి చేసింది. FY22 ITR ఫైలింగ్ కోసం ఈ నియమాలు వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది.

ఆదాయానికి సంబంధించిన సరైన సమాచారం ఇస్తేనే బెటర్..

మీ ఆదాయం గురించి ఎల్లప్పుడూ సరైన సమాచారాన్ని ఇవ్వండి. మీరు మీ ఆదాయానికి సంబంధించిన అన్ని వనరులను ఉద్దేశపూర్వకంగా లేదా పొరపాటున కూడా బహిర్గతం చేయకపోతే, మీరు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు అందుకునే ఛాన్స్ ఉంటుంది. దీంతో మీరు తప్పక ఇబ్బందుల్లో పడవచ్చు. పొదుపు ఖాతా వడ్డీ, ఇంటి అద్దె ఆదాయం వంటి సమాచారం కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఈ ఆదాయాలు కూడా పన్ను పరిధిలోకి వస్తాయి. అలాగే చివరి నిమిషంలో ఐటీఆర్ ఫైల్ చేసేందుకు ప్రయత్నించకూడదని గుర్తుంచుకోండి. సమయానికి మీ రిటర్న్ ఫైల్ చేయడం మంచింది.

మరిన్ని ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇకపై లైసెన్స్, ఆర్‌సీ అవసరమే లేదు.. ఈ ఒక్కటి మీ దగ్గరుంటే చాలు..

Take Home Salary: ఉద్యోగులకు భారీ షాక్.. తగ్గనున్న టేక్ హోమ్ శాలరీ.. కారణం ఏంటంటే?