Tata Play: కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఛానల్ ప్యాక్ ధరలను తగ్గించిన టాటా ప్లే..!
Tata Play: దేశంలోని అతిపెద్ద డైరెక్ట్ టూ హోమ్ (DTH) టీవీ కంపెనీ టాటా ప్లే (గతంలో టాటా స్కై) వినియోగదారులకు శుభవార్త వినిపించింది. తన సబ్‌స్క్రయిబర్లకు ఛానల్ ప్యాక్‌ల రేట్లను..
Tata Play: దేశంలోని అతిపెద్ద డైరెక్ట్ టూ హోమ్ (DTH) టీవీ కంపెనీ టాటా ప్లే (గతంలో టాటా స్కై) వినియోగదారులకు శుభవార్త వినిపించింది. తన సబ్‌స్క్రయిబర్లకు ఛానల్ ప్యాక్‌ల రేట్లను సగానికి మేర తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఓటీటీ (OTT) కంటెంట్ డామినేటెడ్‌గా ఉన్న ఈ కాలంలో.. ఛానల్ (Channel) ప్యాక్‌ల రేట్లను తగ్గించిన కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేలా ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ఇతర సర్వీసు ప్రొవైడర్లు రేట్లను పెంచుతూ తమ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (Average Revenue Per User)ను పెంచుకోవాలని భావిస్తున్నాయి. కాగా, టాటా స్కై సంస్థ పేరును ఇటీవలే టాటా ప్లేగా మార్చింది. జనవరి 27, 2022 నుంచి టాటా స్కై కొత్త పేరు టాటా ప్లే పేరు అందుబాటులోకి వచ్చింది. టీవీ చానెళ్లతో పాటు ఓటీటీ సర్వీసులను విస్తృతంగా అందిస్తోంది. ఇక బ్రాండ్‌బ్యాండ్ నెట్‌వర్క్ పేరును కూడా టాటా ప్లే ఫైబర్ (Tata Play Fiber)గా మార్చినట్టు కంపెనీ వెల్లడించింది.
అయితే ఛానల్ రేట్ల తగ్గింపు నిర్ణయాన్ని ఆ కంపెనీ యూసేజ్ హిస్టరీని బట్టి నిర్ణయిస్తుంది. వినియోగదారులకు కావాల్సిన ఛానల్స్‌ను మాత్రమే చూసుకునేలా ధరల తగ్గింపు చేపడుతోంది. టాటా ప్లే తీసుకున్న ఈ నిర్ణయంతో కస్టమర్లకు నెలవారీ రూ.30 నుంచి రూ.100 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం టాటా ప్లేకు 19 మిలియన్ల మంది యాక్టివ్ సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు. అయితే ఓటీటీ ఇండస్ట్రీ బలోపేతం కావడంతో చాలా మంది టీవీ ఇండస్ట్రీ నుంచి బయటికి వస్తున్నారు. ఈ సమయంలో టాటా ప్లే రేట్లను తగ్గించడం మంచి నిర్ణయమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి: