Pension Scheme: ఈ స్కీమ్‌లో నెలకు రూ.55 డిపాజిట్ చేస్తే.. ప్రతి నెల రూ.3వేల పెన్షన్
Pension Scheme: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ప్రజల కోసం ప్రారంభించిన ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన పథకం ( (Pradhan Mantri Shram Yogi Maan Dhan scheme)..
Pension Scheme: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ప్రజల కోసం ప్రారంభించిన ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన పథకం ( (Pradhan Mantri Shram Yogi Maan Dhan scheme) మూడేళ్లు పూర్తి చేసుకుంది. అసంఘటిత రంగంలోని కార్మికుల వృద్ధాప్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని (Scheme) ప్రారంభించింది. వీధి వ్యాపారులు, హెడ్‌లోడర్లు, సాధారణ కార్మికులు, నెలవారీ ఆదాయం రూ. 15,000 లేదా అంతకంటే తక్కువ,18-40 సంవత్సరాల వయస్సు గల వారు ఈ పథకానికి సభ్యత్వాన్ని పొందవచ్చు. ఇందులో కేవలం రూ.55 పెట్టుబడి పెడితే ప్రతి నెలా రూ.3 వేల వరకు పెన్షన్ పొందవచ్చు. ఇప్పటివరకు 46 లక్షల మందికి పైగా ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ పథకంతో చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఎవరైనా ప్రధాన మంత్రి శ్రమ యోగి మంధన్ యోజన ప్రయోజనాన్ని పొందాలనుకుంటే , అతను ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ సెంటర్‌కి వెళ్లి తన PM-SYM ఖాతాను తెరవవచ్చు. దీని కోసం దరఖాస్తుదారు ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్ వంటి అవసరమైన పత్రాలను కలిగి ఉండాలి. ఖాతా తెరిచిన తర్వాత దరఖాస్తుదారు కోసం శ్రమ యోగి కార్డ్ కూడా జారీ చేయబడుతుంది. ఇందులో దరఖాస్తుదారు ప్రతి నెలా రూ. 55 నుండి రూ. 200 వరకు డిపాజిట్ చేయవచ్చు.
ఈ పథకాన్ని ఎవరు సద్వినియోగం చేసుకోవచ్చు
ఇళ్లల్లో పని మనిషిగా చేసేవాళ్లు, డ్రైవర్లు, ప్లంబర్లు, చెప్పులు కుట్టేవారు, టైలర్లు, రిక్షా డ్రైవర్లు, చాకలి, వ్యవసాయ కూలీలు దీనిని సద్వినియోగం చేసుకోవచ్చు. వయస్సును బట్టి ప్రీమియం రూ.55 నుంచి రూ.200 వరకు ఉంటుంది.
ఈ పథకం వల్ల ప్రయోజనం ఏమిటి?
ఒక అసంఘటిత కార్మికుడు ఈ పథకానికి సభ్యత్వం పొంది, 60 సంవత్సరాల వయస్సు వరకు రెగ్యులర్ కంట్రిబ్యూషన్ చెల్లించినట్లయితే అతనికి కనీసం నెలకు రూ. 3,000 పెన్షన్ లభిస్తుంది. అతని మరణానంతరం జీవిత భాగస్వామికి నెలవారీ కుటుంబ పెన్షన్ లభిస్తుంది.
ఈ పథకంలో చేరడానికి ఎవరు అర్హులు కాదు?
ఈ పథకం కింద నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS), ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC), ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), ఆదాయపు పన్ను చెల్లింపుదారులు వంటి ఏదైనా చట్టబద్ధమైన సామాజిక భద్రతా పథకం కింద కవర్ చేయబడిన ఏ వర్కర్ అయినా ఈ పథకంలో చేరడానికి అర్హులు కాదు.
ఈ పథకంలో చేరడానికి ఎలాంటి ప్రక్రియ ఉంటుంది?
ఈ పథకం కింద కస్టమర్‌లు సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ని సందర్శించి ఖాతా ఓపెన్ చేయవచ్చు. ఆధార్ నంబర్, సేవింగ్స్ బ్యాంక్ ఖాతా/జన్-ధన్ ఉపయోగించి స్వీయ-ధృవీకరణ ఆధారంగా PM-SYM కోసం నమోదు చేసుకోవచ్చు.
Pradhan Mantri Shram Yogi Maan-Dhan pension scheme completes 3⃣years
?Assured Pension of Rs. 3000/- month ?Voluntary and Contributory Pension Scheme ?Matching Contribution by the Government of India
?https://t.co/itO7ZBOkwC pic.twitter.com/Slksu5GDbj
— PIB India (@PIB_India) March 5, 2022
ఇవి కూడా చదవండి: