Tata Motors: కార్లు కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. భారీగా ఆఫర్లు ప్రకటించిన టాటామోటార్స్‌

Tata Motors: దేశీయ కార్ల తయారీ సంస్థ టాటామోటర్స్‌ వినియోగదారులను మరింతగా ఆకర్షించేందుకు వివిధ రకాల మోడళ్ల కార్లపై భారీగా డిస్కౌంట్‌ అందిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. అత్యధికంగా రూ.65వేల వరకు ఉన్న..

Tata Motors: కార్లు కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. భారీగా ఆఫర్లు ప్రకటించిన టాటామోటార్స్‌
Tata Motors
Follow us
Subhash Goud

|

Updated on: Mar 18, 2021 | 2:14 PM

Tata Motors: దేశీయ కార్ల తయారీ సంస్థ టాటామోటర్స్‌ వినియోగదారులను మరింతగా ఆకర్షించేందుకు వివిధ రకాల మోడళ్ల కార్లపై భారీగా డిస్కౌంట్‌ అందిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. అత్యధికంగా రూ.65వేల వరకు ఉన్న ఈ డిస్కౌంట్‌ మార్చి 31 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. టియాగో, టిగోర్‌, నెక్సన్‌, హ్యారియర్‌లకు ఈ ఆఫర్‌వ వర్తించనుంది. అల్టురజ్‌, సఫారీ ఎస్‌యూవీలపై మాత్రం ఎటువంటి ఆఫర్లు లేవని ప్రకటించింది. కన్జూమర్‌ స్కీమ్‌, ఎక్సేఛేంజి ఆఫర్‌ కార్పొరేట్‌ స్కీమ్‌ల రూపంలో వీటిని అందించనున్నట్లు టాటా మోటర్స్‌ వెల్లడించింది.

టాటా టియాగో మోడల్‌పై రూ.25వేల వరకు తగ్గింపు ఇస్తోంది. వీటిల్లో కన్జూమర్‌ స్కీమ్‌ రూ.15వేలు, ఎక్స్‌ఛేంజి ఆఫర్‌ రూ.10వేలు ఉన్నాయి. ఇక టిగారో సెడాన్‌ పై రూ.15వేలు, ఎక్స్‌ఛేంజి ఆఫర్‌లో రూ.15వేలు డిస్కౌంట్‌ ఇస్తోంది. నెక్సబ్‌ సబ్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీపై రూ.15 వేల వరకు అందిస్తోంది. ఇదే కారు డీజిల్‌ వెర్షణ్‌పై ఎక్స్‌ఛేంజి ఆఫర్‌ మాత్రమే లభించనుంది. హారియర్‌ ఐదు సీట్ల మోడల్‌ క్యామో వేరియంట్‌పై మాత్రం రూ.40 వేల వరకు డిస్కౌంట్‌ లభిస్తోంది. సాధారణ హారియర్‌పై రూ.65 వేల వరకు తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపింది. అయితే కొన్నింటిలో ఆఫర్లు ఉన్నాయి.. మరికొన్నింటిలో ఎలాంటి ఆఫర్లు లేవు. కాగా కరోనా కాలంలో వాహనాల కొనుగోలు దాదాపు చాలా వరకు తగ్గిపోయాయి. కోవిడ్‌ కారణంగా ఆయా వాహనాల ఉత్పత్తి కంపెనీలు పెద్ద మొత్తంలో నష్టపోయాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టి వ్యాపారాలు నెమ్మదిగా పుంజుకోవడంతో వినియోగదారులను ఆకర్షించేందుకు పలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.

పలు వాహనాల కంపెనీలు వ్యాపారంలో పుంజుకోవడంతో ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. నష్టాల్లో ఉన్న కంపెనీలు లాభాల బాటలో పయనించేందుకు వినియోగదారుల కోసం మరిన్ని ఆఫర్లను ప్రకటిస్తున్నామని వాహనతయారీ కంపెనీలు చెబుతున్నాయి.

ఇవీ చదవండి: kawasaki Ninja ZX 10r: కవాసాకి నుంచి కొత్త బైక్‌… ధర ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.

వాహన యజమానులకు బ్యాడ్ న్యూస్.. రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెంచనున్న కేంద్రం.. ఒక్కో వాహనానికి ఎంత పెంచిందంటే..