Petrol and Diesel Price Today: పంతొమ్మిదో రోజూ అదే పరిస్థితి.. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..

Petrol and Diesel Price Today: పెట్రోల్, డీజిల్ ధరల్లో వరుసగా పంతొమ్మిదో రోజూ ఎలాంటి మార్పు లేదు. చమురు కంపెనీల అధికారిక..

Petrol and Diesel Price Today: పంతొమ్మిదో రోజూ అదే పరిస్థితి.. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..
Fuel Price
Follow us
Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: Mar 22, 2021 | 1:19 PM

Petrol and Diesel Price Today: పెట్రోల్, డీజిల్ ధరల్లో వరుసగా పంతొమ్మిదో రోజూ ఎలాంటి మార్పు లేదు. చమురు కంపెనీల అధికారిక సమాచారం ప్రకారం.. దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.17 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 81.47గా ఉంది. ఇక ఆర్థిక రాజధాని ముంబైలోనూ అదే పరిస్థితి నెలకొంది. చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం అక్కడ లీటర్ పెట్రోల్ రూ. 95.57 కాగా, డీజిల్ రూ. 88.60 కి లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంధన ధరలు ఇలాగే ఉన్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 94. 79 కాగా, లీటర్ డీజిల్ ధర రూ. 88.86 గా ఉంది. ఇక నల్గొండ జిల్లాలో పెట్రోల్ ధర రూ. 95.18, డీజిల్ ధర రూ. 89.19 గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.37, డీజిల్ రూ. 88.45. కరీంనగర్‌లో పెట్రోల్ ధర రూ. 94.92, డీజిల్ ధర రూ. 88.97 గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.39 ఉండగా.. డీజిల్ ధర 91.01గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ రూ. 96.68 కాగా, డీజిల్ ధర రూ. 90.20 గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.95, డీజిల్ ధర రూ. 90.50 ‌లకు లభిస్తోంది. గుంటూరులో పెట్రోల్ ధర రూ. 97.50 కాగా డీజిల్ ధర రూ. 91.01 గా ఉంది. ఇక రాజస్థాన్, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే చమురు ధరలు రూ. 100 క్రాస్ చేశాయి. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో పెట్రోల్ రూ.101.84, డీజిల్ రూ.93.77, మధ్యప్రదేశ్‌లోని అనుపూర్‌లో పెట్రోల్ లీటర్ రూ.101.59, డీజిల్ రూ.91.97గా ఉంది.

ఇక అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం చమురు ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గతవారం రోజుల్లో ఒక బ్యారెల్ చమురు ధర 79 డాలర్లను క్రాస్ చేసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ.. దేశీయంగా మాత్రం ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే, ఈ రెండున్నర నెలల కాలంలో దేశీయ చమురు కంపెనీలు.. పెట్రోల్ పై రూ.7.46, డీజిల్ రూ.7.60 చొప్పున పెంచాయి. ఇక పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో భారత్‌లో చమురు డిమాండ్ పై ప్రభావం పడింది. చమురు వినియోగం గత ఏడాది సెప్టెంబర్ నుండి ఇప్పటి వరకు దాదాపు 5శాతం మేర తగ్గినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Also read:

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. హోళీ పండగకు ముందే కీలక ప్రకటన..!

Gold & Silver Price Today: సల్వంగా పెరిగిన బంగారం ధరలు.. పడిపోతున్న వెండి.. ఈరోజు మార్కెట్లో ఉన్న ధరలు..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో