EPFO Customers Alert: మీరు పీఎఫ్ ఖాతాదారులా.? అయితే ఈ విషయం మీరు తప్పక తెలుసుకోవాల్సిందే.!

మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.? ఇంకా ఆ ఖాతా నుంచి మీరు డబ్బులు ఉపసంహరించుకోలేదా.? అయితే ఒక్క నిమిషం ఆగండి. పీఎఫ్ అకౌంట్ ఇన్‌-యాక్టివ్‌లో..

EPFO Customers Alert: మీరు పీఎఫ్ ఖాతాదారులా.? అయితే ఈ విషయం మీరు తప్పక తెలుసుకోవాల్సిందే.!
Epfo
Follow us
Ravi Kiran

| Edited By: Team Veegam

Updated on: Mar 20, 2021 | 11:21 AM

మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.? ఇంకా ఆ ఖాతా నుంచి మీరు డబ్బులు ఉపసంహరించుకోలేదా.? అయితే ఒక్క నిమిషం ఆగండి. పీఎఫ్ అకౌంట్ ఇన్‌-యాక్టివ్‌లో ఉన్నా డబ్బులు పడతాయి.. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

ప్రైవేట్ రంగంలో పనిచేస్తూ కనీసం నెలవారీ జీతం రూ .15 వేలు సంపాదిస్తున్న ఏ ఉద్యోగి అయినా కూడా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాకు అర్హులు. ఉద్యోగి ఎవరైనా కూడా తన జాబ్ మారడం గానీ, కోల్పోవడం గానీ జరిగినప్పుడు.. పీఎఫ్ ఖాతాను పర్యవేక్షించడం తక్కువ. అటు పీఎఫ్ డబ్బు ఉపసంహరణకు సైతం పలు షరతులు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో పీఎఫ్ ఖాతా ఇన్‌-యాక్టివ్‌లో ఉన్న సమయంలో డబ్బులు క్రెడిట్ అవుతాయా.? అని అందరిలోనూ ఓ ప్రశ్న ఉంటుంది. అయితే ఆ పీఎఫ్ ఖాతాకు ఫండ్ కంట్రిబ్యుట్ కాకపోయినా 58 సంవత్సరాల వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఈపీఎఫ్ వడ్డీ ద్వారా అది నడుస్తుందని పన్ను, పెట్టుబడి నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఉద్యోగం మారడం లేదా పోయినప్పుడు.. సదరు ఉద్యోగి ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను క్లెయిమ్ చేసుకునే బదులు వేరే మార్గాలను అన్వేషిస్తే మంచిది. ఎందుకంటే ఫండ్ కంట్రిబ్యుట్ కాకపోయినా కూడా ఈపీఎఫ్ అకౌంట్ 58 సంవత్సరాల పాటు కొనసాగుతూనే ఉంటుందని సెబీ రిజిస్టర్డ్ టాక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుడు జితేంద్ర సోలంకి అంటున్నారు.

కొత్త ఉద్యోగంలోకి చేరినప్పుడు పాత పీఎఫ్‌ మొత్తాన్ని ఉపసంహరించుకుని.. ఆ ఖాతాను క్లోజ్ చేసే బదులు అదే అకౌంట్‌ను కొత్త రిక్రూటర్ వద్ద కూడా కొనసాగించాలని ట్రాన్సెండ్ కన్సల్టెంట్స్ సంపద నిర్వహణ డైరెక్టర్ కార్తీక్ జవేరి పీఎఫ్ ఖాతాదారులకు సలహా ఇస్తున్నారు. దీని వల్ల ఈపీఎస్ ప్రయోజనాలతో పాటు పెన్షన్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే వాటిని పొందటానికి సదరు ఎంప్లాయ్ తన ఈపీఎఫ్ ఖాతాను 20 సంవత్సరాల పాటు నిరంతరం కొనసాగించాలన్నారు.

“ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం, ఒక ఉద్యోగి తన జీతం నుంచి 12 శాతం వాటాను పీఎఫ్ ఖాతాకు కంట్రిబ్యుట్ చేస్తే.. అదే 12 పర్సెంట్ వాటాను రిక్రూటర్ కూడా కంట్రిబ్యుట్ చేస్తాడు. కానీ రిక్రూటర్ 12 శాతం వాటాలో 8.33 శాతం ఈపీఎస్ ఖాతాలోకి, మిగిలిన 3.67 శాతం ఈపీఎఫ్ ఖాతాలోకి చేరుతుంది. కాగా, ఈపీఎఫ్ ఖాతా యాక్టివ్‌లో ఉన్నప్పుడు పైన పేర్కొన్న రూల్స్ అన్ని కూడా వర్తిస్తాయని బిజినెస్ నిపుణులు అంటున్నారు. ఏదేమైనా, ఈపీఎఫ్ ఖాతా క్రియారహితంగా ఉన్నప్పుడు, ఉద్యోగి లేదా రిక్రూటర్ల డిపాజిట్ ఈపీఎఫ్ ఖాతాలో రాని సందర్భంలో, ఈపీఎఫ్ఓ ప్రకటించిన వార్షిక ఈపీఎఫ్ వడ్డీ రేటు ఈపీఎఫ్ బ్యాలెన్స్‌పై పడుతూ.. 58 ఏళ్లు వరకు కొనసాగుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి:

చుట్టూ భారీ అనకొండలు.. వాటితో ఆటలు.. ఇంతలోనే ఊహించని సంఘటన.. గగుర్పొడిచే వీడియో.!

భారీ పైథాన్‌తో ఫన్నీ గేమ్.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న స్నేక్ క్యాచర్.. వైరల్ వీడియో.!

తలపై కొమ్ముతో భయంకర ఆకారం.. బెంబేలెత్తించే దృశ్యం.. ఇంతకీ అది దెయ్యమేనా.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!