Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Haldiram: టాటా గ్రూప్‌ హల్దీరామ్‌ వాటాను కొనుగోలు చేస్తోందా..? క్లారిటీ ఇచ్చిన టాటా

1937లో భుజియా, నామ్‌కీన్‌, స్వీట్స్‌ తయారు చేసే హల్దీరామ్‌ సంస్థను ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రంగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం టాటా కన్స్యూమర్ హల్దీరామ్‌లో 51 శాతం మెజారిటీ వాటాను కొనుగోలు చేయవచ్చని, అయితే, ఈ డీల్‌పై ఇప్పటి వరకు టాటా గ్రూప్ లేదా హల్దీరామ్కం..

Haldiram: టాటా గ్రూప్‌ హల్దీరామ్‌ వాటాను కొనుగోలు చేస్తోందా..? క్లారిటీ ఇచ్చిన టాటా
Haldiram Tata
Follow us
Subhash Goud

|

Updated on: Sep 08, 2023 | 5:00 PM

స్నాక్స్ తయారీ సంస్థ హల్దీరామ్‌లో 51 శాతం మెజారిటీ వాటాను కొనుగోలు చేసేందుకు చర్చలు జరిపినట్లు వచ్చిన వార్తలను టాటా గ్రూప్ కొట్టిపారేసింది. బుధవారం గ్రూప్ కంపెనీ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ హల్దీరామ్‌లో ప్రధాన వాటాను కొనుగోలు చేయడానికి సిద్ధమవుతోందని, రెండు కంపెనీల మధ్య చర్చలు జరుగుతున్నాయని వార్తలు గుప్పుమన్నాయి. నివేదికల ప్రకారం.. హల్దీరామ్ విలువ సుమారు 10 బిలియన్ డాలర్లు. ఇప్పుడు ఈ విషయాన్ని టాటా గ్రూప్ క్లియర్ చేసింది.

ఒక వార్తా సంస్థ నివేదిక ప్రకారం.. భారతీయ స్నాక్స్ కంపెనీ హాల్దీరామ్‌ ఇప్పుడు విక్రయించడానికి సిద్ధంగా ఉందని, దీనిని టాటా కన్స్యూమర్ పోర్ట్‌ఫోలియోలో చేర్చవచ్చని వైరల్‌ అయ్యింది. ఈ నివేదికలను తోసిపుచ్చిన టాటా గ్రూప్.. అలాంటి చర్చలు ఏవీ లేవని స్పష్టం చేసింది. టాటా, హల్దీరామ్ కనీసం 51 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు గతంలో రాయిటర్స్ నివేదిక పేర్కొంది. టాటా తరపున, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ మార్కెట్లో జరుగుతున్న ఎలాంటి ఊహాగానాలపై వ్యాఖ్యానించదని చెప్పారు. మరోవైపు, హల్దీరామ్ కూడా ఈ విషయంలో ఇలాంటి వ్యాఖ్యను ఖండించారు.

85 ఏళ్లుగా చిరుతిళ్ల వ్యాపారంలో హల్దీరామ్:

1937లో భుజియా, నామ్‌కీన్‌, స్వీట్స్‌ తయారు చేసే హల్దీరామ్‌ సంస్థను ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రంగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం టాటా కన్స్యూమర్ హల్దీరామ్‌లో 51 శాతం మెజారిటీ వాటాను కొనుగోలు చేయవచ్చని, అయితే, ఈ డీల్‌పై ఇప్పటి వరకు టాటా గ్రూప్ లేదా హల్దీరామ్ కంపెనీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.పైగా తాజాగా వాస్తున్న పుకార్లపై టాటా కంపెనీ ఖండించింది. అలాంటిదేమి డీల్‌ జరగలేదని తెలిపింది.

ఇవి కూడా చదవండి

దేశంలో 150 కంటే ఎక్కువ రెస్టారెంట్లు

యూరోమానిటర్ ఇంటర్నేషనల్ ప్రకారం.. భారతదేశంలో స్నాక్స్ మార్కెట్ విలువ $6.2 బిలియన్లు. ఇది కాకుండా, ఈ మార్కెట్‌లో పెప్సికి కూడా ఆధిపత్యం కొనసాగిస్తోంది. హల్దీరామ్ ప్రొడక్ట్స్ దేశంలోనే కాకుండా ఇతర దేశాలైన అమెరికా, సింగపూర్ తో పాటు వివిధ దేశాల్లో తన ఆధిపత్యం కొనసాగిస్తోంది. కంపెనీకి స్థానిక ఆహారం, స్వీట్లు, పాశ్చాత్య ఆహారాలు విక్రయించే దాదాపు 150 రెస్టారెంట్లు ఉన్నాయి.

హల్దీరామ్ మనవడు శివ కిషన్ అగర్వాల్ 1985లో కంపెనీ విస్తరణను ప్రారంభించారు. ప్రస్తుతం హల్దీరామ్ 70 రకాల వివిధ సాల్టీ ఫుడ్స్, స్వీట్లు, రిఫ్రెష్‌మెంట్ డ్రింక్స్ విక్రయిస్తోంది. కంపెనీకి నాగ్‌పూర్, న్యూఢిల్లీ, కోల్‌కతా, బికనీర్‌లలో తయారీ యూనిట్లు ఉన్నాయి. కంపెనీకి నాగ్‌పూర్, ఢిల్లీలో రిటైల్ చైన్ స్టోర్‌లు, రెస్టారెంట్లు ఉన్నాయి.

బ్రాండ్ విదేశాలకు చేరుకుంది

హల్దీరామ్ ఉత్పత్తులు అమెరికా, ఇంగ్లండ్, కెనడా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, థాయిలాండ్, శ్రీలంక, అనేక ఇతర దేశాలలో అమ్ముడవుతున్నాయి. దేశంలోనే కాదు.. ప్రపంచంలోని 50కి పైగా దేశాల్లో హల్దీరామ్ ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. ఈ ఉత్పత్తులు విదేశీ సూపర్ మార్కెట్లలో సులభంగా లభిస్తాయి. 2019లో హల్దీరామ్ వార్షిక ఆదాయం రూ.7,130 కోట్లు. ఈ బ్రాండ్ 3 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి