Employment: నిరుద్యోగులకు బంపరాఫర్.. భవిష్యత్తులో ఈ వ్యాపారానికి ఢోకా ఉండదు
ఈ క్రమంలోనే రోజురోజుకు ఎలక్ట్రిక్ వెహికల్స్ సంఖ్య పెరుగుతుంది. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని, పెరుగుతున్న పెట్రోల్ ధరలకు భయపడి జనం EV వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కి చార్జింగ్ ప్రధాన సమస్యగా మారుతోంది. ఇండిపెండెంట్ ఇల్లు ఉన్నవాళ్లయితే పరవాలేదు కానీ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి కార్లకు, బైక్‌లకు చార్జింగ్ పెట్టడం పెద్ద సమస్యగా మారుతోంది. దీంతోపాటు బయట పెద్దగా చార్జింగ్ పాయింట్స్ లేకపోవడం కూడా ఇబ్బందిగా తయారైంది...

భారీ పెరుగుతోన్న ఇంధన ధరల నుంచి ఉపశమనం పొందేందుకు వీలుగా అందుబాటులోకి ఎలక్ట్రికల్ వాహనాలు వచ్చాయి. వాతావరణాన్ని సైతం దృష్టిలో పెట్టుకొని ప్రపంచ దేశాలు విద్యుత్ ఆధారిత వాహనాలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి. మొన్నటి వరకు ఎలక్ట్రిక్ వెహికిల్స్‌పై సబ్సిడీ సైతం అందించిన విషయం తెలిసిందే. ఇక ప్రముఖ ఆటో మొబైల్ సంస్థలన్నీ ఈవీ రంగంలోకి అడుగుపెట్టాయి. దీంతో సంప్రదాయ ఇంధనంతో నడిచే వాహనాలతో పోల్చితే ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు డిమాండ్ పెరిగింది. స్మార్ట్ ఫీచర్స్‌తో కూడిన వెహికిల్స్ అందుబాటులోకి వస్తున్నాయి.
ఈ క్రమంలోనే రోజురోజుకు ఎలక్ట్రిక్ వెహికల్స్ సంఖ్య పెరుగుతుంది. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని, పెరుగుతున్న పెట్రోల్ ధరలకు భయపడి జనం EV వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కి చార్జింగ్ ప్రధాన సమస్యగా మారుతోంది. ఇండిపెండెంట్ ఇల్లు ఉన్నవాళ్లయితే పరవాలేదు కానీ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి కార్లకు, బైక్‌లకు చార్జింగ్ పెట్టడం పెద్ద సమస్యగా మారుతోంది. దీంతోపాటు బయట పెద్దగా చార్జింగ్ పాయింట్స్ లేకపోవడం కూడా ఇబ్బందిగా తయారైంది.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని దేశంలోనే మొదటిసారిగా ప్రభుత్వమే ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లను తెలంగాణలో ప్రవేశపెడుతున్నారు. రెడ్ కో చైర్మన్ సతీష్ రెడ్డి చొరవతో ఇప్పటికే హైదరాబాదులో 45 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం మూడు వేల ఎలక్ట్రిక్ చార్జింగ్ సెంటర్‌లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నగరంలో ఏ మూలకు వెళ్లిన కారు లేదా బైక్ ఛార్జింగ్ పెట్టుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. దీంతోపాటు అన్ని జిల్లా మండల కేంద్రాలు, హైవే లపై కూడా 615 ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్ల కోసం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు.




అయితే ఇది పూర్తిగా ప్రభుత్వమే కాకుండా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో నిర్వహణ ఉంటుంది. రెడ్కో సంస్థ ఈ ఛార్జింగ్ మిషన్ పెట్టే స్థలాలను చూపిస్తుంది. ఆసక్తి ఉన్న వారు ఇదే స్థలాల్లో ప్రభుత్వ సహాయంతో చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రతి యూనిట్‌కి ఒక ధర ఫిక్స్ చేసి వాహనదారుల నుంచి ఆదాయం పొందొచ్చు. భవిష్యత్తులో ఇలాంటి చార్జింగ్ సెంటర్లకు పెట్రోల్ బంకుల కంటే ఎక్కువ డిమాండ్ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య బాగా పెరిగింది. రిజిస్ట్రేషన్ చార్జీలు టాక్స్ మినహాయింపు ఇవ్వడంతో వాహనాల అమ్మకాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
నిరుద్యోగులు రెండు మూడు కార్లకు చార్జింగ్ పెట్టేంత మిషనరీని రెడ్కో సహాయంతో ఏర్పాటు చేసుకోగలిగితే కూర్చున్న చోటే ఆదాయం సంపాదించవచ్చు. పెద్దగా మ్యాన్ పవర్ అవసరం లేదు. అంతేకాదు అక్కడే ఉండి పనిచేయాల్సిన అవసరం కూడా లేదు. స్మార్ట్ కార్డ్ సహాయంతో వాహనదారులు సొంతంగా చార్జింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇస్తున్న ఒక మంచి అవకాశం అనే చెప్పొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..