AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: స్టాక్ మార్కెట్‌లో ప్రభుత్వ ఉద్యోగి వ్యాపారం చేయవచ్చా? ఎలాంటి నియమాలు ఉన్నాయి?

2019 సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగులు చేసే స్టాక్ పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల ప్రకటనపై పరిమితిని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (HRD మంత్రిత్వ శాఖ) ప్రకటించిన ఆర్డర్ ప్రకారం.. సవరించిన పరిమితి ఇప్పుడు ఉద్యోగి ఆరు నెలల ప్రాథమిక వేతనానికి సమానం. సరళంగా చెప్పాలంటే ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక ఉద్యోగి పెట్టుబడి అతని 6 నెలల బేసిక్ జీతం కంటే ఎక్కువగా..

Stock Market: స్టాక్ మార్కెట్‌లో ప్రభుత్వ ఉద్యోగి వ్యాపారం చేయవచ్చా? ఎలాంటి నియమాలు ఉన్నాయి?
Stock Market
Subhash Goud
|

Updated on: Sep 07, 2023 | 4:54 PM

Share

సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్, 1964లోని 35(1) ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లేదా మరేదైనా వ్యాపారంలో పాల్గొనకూడదు. కానీ ప్రభుత్వ ఉద్యోగులు స్టాక్ బ్రోకర్లు, రిజిస్టర్డ్ ఏజెన్సీలు, లైసెన్స్ లేదా సర్టిఫికేట్ హోల్డర్ వ్యక్తులు/ఏజెన్సీల ద్వారా ఎప్పటికప్పుడు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టవచ్చు . అంటే ప్రభుత్వ ఉద్యోగులు స్టాక్ మార్కెట్‌లో మాత్రమే పెట్టుబడి పెట్టగలరు తప్ప వ్యాపారం చేయరు.

ఇటీవలి సర్క్యులర్ ప్రకారం.. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి తన ప్రాథమిక వేతనానికి 6 రెట్లు ఎక్కువ స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే దానిని తన శాఖకు నివేదించాలి. రూల్ 35(1) గురించి వివరంగా తెలుసుకుందాం. మీరు ప్రభుత్వ ఉద్యోగి అయితే మీరు షేర్లు లేదా సెక్యూరిటీలను (లేదా ఏదైనా ఇతర పెట్టుబడిని) పదే పదే కొనలేరు. అలాగే విక్రయించలేరు. ఎందుకంటే ఇది ఊహాజనిత వ్యాపారంగా పరిగణించడం జరుగుతుంది.

ప్రభుత్వ ఉద్యోగి ఎక్కడ పెట్టుబడి పెట్టకుండా ఉండాలి?

సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (కండక్ట్) రూల్స్, 1964లోని రూల్ నెం. 40(2)లోని పార్ట్ (i) ప్రకారం.. ప్రభుత్వోద్యోగులు తమకు ఇబ్బంది కలిగించే లేదా సర్వీస్ నుంచి తొలగించబడేలా ఎలాంటి పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉండదని గుర్తించుకోవాలి. ఒక ఉద్యోగి కుటుంబ సభ్యులకు, అతని తరపున పని చేసే ఇతర వ్యక్తికి అదే నియమాలు వర్తిస్తాయని నిబంధనలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి ఎలాంటి నియమాలు ఉన్నాయి?

2019 సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగులు చేసే స్టాక్ పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల ప్రకటనపై పరిమితిని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (HRD మంత్రిత్వ శాఖ) ప్రకటించిన ఆర్డర్ ప్రకారం.. సవరించిన పరిమితి ఇప్పుడు ఉద్యోగి ఆరు నెలల ప్రాథమిక వేతనానికి సమానం. సరళంగా చెప్పాలంటే ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక ఉద్యోగి పెట్టుబడి అతని 6 నెలల బేసిక్ జీతం కంటే ఎక్కువ గా ఉంటే, అతను అటువంటి షేర్లు, సెక్యూరిటీలు, డిబెంచర్లు, మ్యూచువల్ ఫండ్ పథకాలలో చేసిన మొత్తం పెట్టుబడి గురించి పూర్తి వివరాలను ఇవ్వాల్సి ఉంటుందని గుర్తించుకోండి.

ప్రభుత్వ ఉద్యోగులకు పెట్టుబడి ఎంపికలు ఏమిటి?

ప్రభుత్వ ఉద్యోగులు వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాల ఆధారంగా కింది పెట్టుబడి ఎంపికలలో కొన్నింటిలో పెట్టుబడి పెట్టవచ్చు.

1. మ్యూచువల్ ఫండ్స్

2. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)

3. జాతీయ పెన్షన్ పథకం

4. షేర్లలో దీర్ఘకాలిక పెట్టుబడి

5. బ్యాంకు డిపాజిట్లు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి