Car Insurance: కారు ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గాలంటే ఇలా చేయండి

కారు ఇన్సూరెన్స్ ఉంది కదా అని చిన్న చిన్న రిపేర్ల కోసం ఇన్సూరెన్స్ క్లెయిమ్ కి వెళ్ళకండి. మీరు సంవత్సరంలో ఒక్కసారి కూడా క్లెయిమ్ చేయకపోతే కనుక మీకు నో క్లెయిమ్ బోనస్ (NCB)వస్తుంది. రెన్యువల్ సమయంలో దాదాపు 20% వరకూ ప్రీమియం తగ్గుతుంది. ఉదాహరణకు మీ కారు పాలసీ 10 వేలు అనుకుందాం. కారుకు చిన్న ప్రమాదంలో బంపర్ దెబ్బతింది..

Car Insurance: కారు ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గాలంటే ఇలా చేయండి
Car Insurance
Follow us
Subhash Goud

|

Updated on: Sep 06, 2023 | 4:28 PM

ఇప్పుడు చాలామంది కారు కొంటున్నారు. దాదాపుగా కారు అందరికీ ప్రాధమిక అవసరంగా మారిపోతోంది. కారు కోసం ఇన్సూరెన్స్ చేయించడం తప్పనిసరి. కారు ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే డబ్బు ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. కానీ, కారు ఇన్సూరెన్స్ పాలసీ రెన్యువల్ సమయంలో ప్రీమియం తగ్గించుకోగలిగే అవకాశం ఉంది. అదెలానో చూద్దాం.

కారు ఇన్సూరెన్స్ ఉంది కదా అని చిన్న చిన్న రిపేర్ల కోసం ఇన్సూరెన్స్ క్లెయిమ్ కి వెళ్ళకండి. మీరు సంవత్సరంలో ఒక్కసారి కూడా క్లెయిమ్ చేయకపోతే కనుక మీకు నో క్లెయిమ్ బోనస్ (NCB)వస్తుంది. రెన్యువల్ సమయంలో దాదాపు 20% వరకూ ప్రీమియం తగ్గుతుంది. ఉదాహరణకు మీ కారు పాలసీ 10 వేలు అనుకుందాం. కారుకు చిన్న ప్రమాదంలో బంపర్ దెబ్బతింది. దానిని రిపేర్ చేయించడానికి మీకు 1000 రూపాయలు ఖర్చు అయ్యాయి. అప్పుడు మీరు ఆ వెయ్యి రూపాయాలు క్లెయిమ్ చేస్తే మీకు నో క్లెయిమ్ బోనస్ రాదు. నిజానికి మీరు ఆ 1000 రూపాయలు క్లెయిమ్ చేయకపోతే మీకు 2 వేల రూపాయలు నో క్లెయిమ్ బోనస్ వచ్చి ఉండేది. అంటే మీరు వెయ్యి రూపాయలు నష్టపోతారు.

చిన్న చిన్న మరమ్మతుల కోసం అంటే డెంట్ రిపేర్, టెయిల్ లైట్ విరిగిపోవడం వంటివి కంపెనీ సర్వీస్ సెంటర్ కు బదులుగా మంచి మెకానిక్ దగ్గర చేయించండి. ఇక్కడ ఖర్చు కూడా తక్కువ అవుతుంది. అలాగే మీరు కొన్ని సంవత్సరాల పాటు కనుక ఎటువంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయకపోతే మీకు ప్రీమియంలో 50% నుంచి 60 శాతం వరకూ డిస్కౌంట్ వచ్చే అవకాశము ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కారులో యాంటీ థెఫ్ట్ గాడ్జెట్ ఇన్ స్టాల్ చేయండి. ఇటువంటిది ఉండడం వలన మీకు ఇన్సూరెన్స్ ప్రీమియం లో 5% తగ్గుదల ఉంటుంది. అలాగే కారులో సేఫ్టీ పరికరాలను ఉంచడం వలన ఇన్సూరెన్స్ కంపెనీలు మంచి డిస్కౌంట్స్ ఇస్తాయి. ఇక మీ కారులో ఖరీదైన ఫ్యాన్సీ గాడ్జెట్స్ పెట్టుకోకండి. అంటే మీరు అల్ట్రాసోనిక్ సెన్సార్‌లు, ఆటోమోటివ్ నైట్ విజన్ మొదలైన ఖరీదైన గాడ్జెట్‌లను కారులో పెట్టుకుంటే మీ ఇన్సూరెన్స్ ప్రీమియం పెరుగుతుంది. మీరు కారులో ఎక్కువ ఖరీదైన గాడ్జెట్స్ అమర్చుకోవడం.. లేదా ఖరీదైన మార్పులు ఉదాహరణకు ఇంటీరియర్ డెకరేషన్.. ఏసీ వెంట్స్ వంటివి అమర్చుకుంటే తప్పనిసరిగా ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియచేయాలి. లేకపోతె ఎపుడైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం వెళ్ళినపుడు రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది.

ఎటువంటి పరిస్థితిలోనూ పాలసీ లాప్స్ కాకుండా చూసుకోండి. ఎప్పుడైనా ఒక్క రోజు ఆలస్యంగా ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం చేసినా మీకు నో క్లెయిమ్ బోనస్ రాదు. అలాగే, ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు వివిధ కంపెనీలు ఇస్తున్న పాలసీల ధరలను పోల్చి చూసుకోండి. దానివలన మీరు తక్కువ ఖర్చు అయ్యే కంపెనీ నుంచి పాలసీ తీసుకోవచ్చు. డబ్బు ఆదా చేసుకోవచ్చు. అదేవిధంగా పాలసీ తీసుకునే టప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని జాగ్రత్తగా చదివి అర్ధం చేసుకోండి.

సురక్షితంగా డ్రైవ్ చేయండి.. అతి వేగం వద్దు.. మద్యం తాగి కారు నడపవద్దు.. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే పరిస్థితే రాదు కదా. అందుకే జాగ్రత్తగా డ్రైవ్ చేయండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?