Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax: ఈ దేశాల్లోని ప్రజలు ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.. ఆ దేశాల జాబితా తెలుసుకోండి

కొన్ని దేశాల్లో మాత్రం ఆదాయపు పన్ను వసూళ్లు అసలు ఉండనే ఉండవు. చాలా దేశాలు ఆదాయపు పన్ను వ్యవస్థను కలిగి ఉన్నప్పటికీ కొన్ని ఆదేశాలు ఆ విధానం అమలు చేయడం లేదు. ఆదాయపు పన్ను ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరులలో ఒకటిగా చెప్పవచ్చు. నిర్దిష్ట మొత్తం కంటే ఎక్కువ ఆదాయం ఉన్న చాలా మంది వ్యక్తులు ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎంత ఎక్కువ ఆదాయం ఉంటే అంత ఎక్కువ పన్ను చెల్లించాలి. పన్నులు కట్టే మనం కూడా రోడ్డుపన్ను, ఆ పన్ను, ఈ పన్ను అంటూ అన్ని చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని ..

Income Tax: ఈ దేశాల్లోని ప్రజలు ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.. ఆ దేశాల జాబితా తెలుసుకోండి
No Income Tax Countries
Follow us
Subhash Goud

|

Updated on: Sep 07, 2023 | 7:27 PM

మన దేశంలో ఆదాయపు పన్ను అనేది రాష్ట్రాలకు, దేశానికి ప్రధాన వనరుగా ఉంది. మన దేశంలో ఆదాయపు పన్ను వసూళ్లు ప్రతి నెలనెల పెరుగుతూనే ఉంటుంది. అయితే ఈ ఆదాయపు పన్ను వల్ల ప్రభుత్వాలకు భారీ ఆదాయం వచ్చి చేరుతుంది. అయితే కొన్ని దేశాల్లో మాత్రం ఆదాయపు పన్ను వసూళ్లు అసలు ఉండనే ఉండవు. చాలా దేశాలు ఆదాయపు పన్ను వ్యవస్థను కలిగి ఉన్నప్పటికీ కొన్ని ఆదేశాలు ఆ విధానం అమలు చేయడం లేదు. ఇన్ కమ్ ట్యాక్స్ వసూళ్లు అనేది ప్రభుత్వాలకు ముఖ్యమైన ఆదాయ వనరుగా చెప్పవచ్చు. నిర్దిష్ట మొత్తం కంటే ఎక్కువ ఆదాయం ఉన్న చాలా మంది వ్యక్తులు ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎంత ఎక్కువ ఆదాయం ఉంటే అంత ఎక్కువ పన్ను చెల్లించాలి. పన్నులు కట్టే మనం కూడా రోడ్డుపన్ను, ఆ పన్ను, ఈ పన్ను అంటూ అన్ని చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని దేశాల్లో ఆదాయపు పన్ను ఉండదు. మీరు ఆ దేశంలో మీకు కావలసినంత ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఆ ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, ఈ దేశాలు ఇతర మార్గాల్లో ఆదాయాన్ని పొందుతాయి. అటువంటి కొన్ని దేశాలు ఏమిటో తెలుసుకుందాం.

  1. బహామాస్: అమెరికాకు ఆనుకుని ఉన్న కరేబియన్ దీవుల సమూహం బహమాస్‌కు ఆదాయపు పన్ను లేదు. అయితే, కొన్ని షరతులు ఉన్నాయి. మీరు ఈ దేశంలో 90 రోజుల కంటే ఎక్కువ కాలం ఉంటే మీకు శాశ్వత నివాస హక్కు లభిస్తుంది. శాశ్వత నివాసితులు ఆదాయపు పన్ను చెల్లించలేరు.
  2. మొనాకో: ఐరోపాలోని మొనాకో ధనవంతులకు విలాసవంతమైన ప్రదేశం. ఇది భూమిపై అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, చాలా ఖరీదైన ప్రదేశం. నివాసి మూడు నెలల్లో 5 లక్షల యూరోలు చెల్లించి అనుమతి పొందాలి. ఈ దేశానికి ఆదాయపు పన్ను కంటే పర్యాటకుల ఖర్చు ప్రధాన ఆదాయ వనరు.
  3. యూఏఈ: దుబాయ్, షార్జా, అబుదాబిలను కలిగి ఉన్న UAEలో ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను ఉండదు. యూఏఈ మాత్రమే కాదు, చాలా గల్ఫ్ దేశాల్లో కూడా ఈ పన్నులు లేవు.
  4. బెర్ముడా: బెర్ముడా అత్యంత ఖరీదైన కరేబియన్ దేశాలలో ఒకటి. బీచ్‌లకు ప్రసిద్ధి చెందిన బెర్ముడాలో చాలా లగ్జరీ రెస్టారెంట్లు ఉన్నాయి. ఇక్కడ ఆదాయపు పన్ను లేదు. అయితే, ఇది కంపెనీలపై పేరోల్ పన్ను విధిస్తుంది. ఆస్తి యజమానులు, అద్దెదారులపై భూమి పన్ను విధిస్తారు.
  5. ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి