Amazon Scam: ఎక్స్‌చేంజ్ పేరిట భారీ స్కామ్.. సుప్రీం కోర్టు లాయర్ సంచలన ట్వీట్..

ఢిల్లీలో నివసించే సుప్రీం కోర్టు న్యాయవాది ముకుంద్ ఉన్ని తన పాత ఐఫోన్ 13ను ఎక్స్ చేంజ్ చేసి, ఐఫోన్ 15 తీసుకోవాలని భావించారు. దీంతో ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్లో జూలై 21న ఆర్డర్ చేశారు. ఆ తర్వాత రోజే కొత్త ఫోన్ తో ఇంటికి వచ్చిన అమెజాన్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ డెలివరీ ప్రక్రియను ప్రారంభించాడు.

Amazon Scam: ఎక్స్‌చేంజ్ పేరిట భారీ స్కామ్.. సుప్రీం కోర్టు లాయర్ సంచలన ట్వీట్..
Amazon
Follow us

|

Updated on: Aug 06, 2024 | 5:56 PM

సమాజంలో మోసగాళ్లు పెరిగిపోతున్నారు. ఎవరు ఏ రకంగా మోసం చేస్తారో తెలియని పరిస్థితుల్లో జీవించాల్సి వస్తోంది. గతంలో డెలివరీ బాయ్స్ మాదిరిగా మోసాలు చేసిన అనేక కేసులు మన చూశాం. ఇప్పుడు అదే తరహాలో ఓ సుప్రీం కోర్టు లాయర్ నే ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ డెలివరీ బాయ్ బోల్తా కొట్టించాడు. ఐఫోన్ ఎక్స్ చేంజ్ పేరుతో లాయర్ చేసిన ఆర్డర్ స్వీకరించే క్రమంలో రూ. 38,000లకు ఆ డెలివరీ బాయ్ టోకరా వేశాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

కేసు ఏంటంటే..

ఢిల్లీలో నివసించే సుప్రీం కోర్టు న్యాయవాది ముకుంద్ ఉన్ని తన పాత ఐఫోన్ 13ను ఎక్స్ చేంజ్ చేసి, ఐఫోన్ 15 తీసుకోవాలని భావించారు. దీంతో ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్లో జూలై 21న ఆర్డర్ చేశారు. ఆ తర్వాత రోజే కొత్త ఫోన్ తో ఇంటికి వచ్చిన అమెజాన్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ డెలివరీ ప్రక్రియను ప్రారంభించాడు. ఈ క్రమంలో తన మొబైల్ కి వచ్చిన ఓటీపీని లాయర్ ముకుంద్ డెలివరీ బాయ్ కి షేర్ చేశారు. తర్వాత మరో ఓటీపీ చెప్పాలని డెలివరీ ఏజెంట్ లాయర్ ని అడిగాడు. దానిని షాక్ అయిన లాయర్ ముకుంద్.. మరో ఓటీపీ రాలేదని చెప్పాడు. ఎక్స్ చేంజ్ కోసం మరో ఓటీపీ వస్తుందని అది చెక్ చేసుకోవాలని డెలివరీ ఏజెంట్ కోరాడు. కొంత సేపటి వరకూ వేచి ఉన్నా.. ఓటీపీ రాకపోవడంతో డెలివరీ ఏజెంట్ తన సూపర్ వైజర్ తో ఫోన్లో మాట్లాడాడు. ఆ తర్వాత ఎక్స్ఛేంజ్ ప్రక్రియ ఇంకా ఫైనల్ కాలేదని.. ప్రాడక్ట్ రిటర్న చేయమని ఏజెంట్ కోరాడు. ఈ మేరకు ఈ విషయాలన్ని లాయర్ ముకుంద్ తన ఎక్స్ ప్లాట్ ఫారంలో షేర్ చేశారు. తాను సూపర్ వైజర్ తో మాట్లాడానని.. వేరే టీం ద్వారా తనకు డెలివరీ అవుతుందని ఆ సూపర్ వైజర్ చెప్పడంతో దానిని తాను మొదట అంగీకరించలేదని.. అయితే సూపర్ వైజర్ బతిమలాడటంతో ఒప్పుకున్నట్లు చెప్పాడు. అయితే అమెజాన్ యాప్ లో ప్రొడక్ట్ డెలివరీ అయినట్లు చూపించిందని పేర్కొన్నారు.

కస్టమర్ కేర్.. డోన్ట్ కేర్..

ఈ విషయాన్ని ముకుంద్ జూలై 23న అమెజాన్ కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి కంప్లైంట్ చేశారు. ఫోన్ డెలివరీ కాకపోతే డబ్బులు రీఫండ్ చేస్తామని కస్టమర్ కేర్ చెప్పింది. అయితే ఎన్ని రోజులైన ఈ విషయంపై ఎలాంటి డెవలప్మెంట్ లేకపోవడంతో ముకుంద్ మరోసారి జూలై 26న కస్టమర్ కేర్ కు కాల్ చేశారు. అయితే దీనిపై మరింత సమయం పడుతుందని.. జూలై 31 వరకూ వేచి ఉండాలని కోరారు. ఆగస్టు ఒకటో తేదీన మరోసారి కాల్ చేసిన లాయర్ ముకుంద్ కు కస్టమర్ కేర్ షాక్ ఇచ్చింది మీ డబ్బులు రీఫండ్ చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. దీనిపై ముకుంద్ ట్వీట్ చేస్తూ.. అమెజాన్ తన ఫిర్యాదును అస్సలు విచారణ చేయలేదని.. తన ఎక్స్ చేంజ్ పూర్తి అయితే తన పాత ఫోన్ తీసుకెళ్లాలని.. అలా జరగలేదని చెప్పారు. అమెజాన్లో సూపర్ వైజర్, డెలివరీ ఎగ్జిక్యూటివ్ తదితరులో కూడిన పెద్ద స్కామ్ జరుగుతోందని వివరించారు. అదే రోజు సూపర్‌వైజర్ నుంచి ముకుందుకు కాల్ వచ్చింది. పాత ఐఫోన్‌ను ఇవ్వడానికి ఒక నిర్దిష్ట ప్రదేశంలో కలవమని చెప్పాడు. ఫోన్ తీసుకుంటామని, ప్రాసెస్‌కు 24 గంటల సమయం పడుతుందని, ఆ తర్వాత వారు కొత్త ఫోన్ అందిస్తామని చెప్పడంతో ఈ వ్యవహారం తనకు స్కామ్‌లా అనిపిస్తుందని ముకుంద్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రెండు ఓటీటీల్లోకి ప్రభాస్ కల్కి.. స్ట్రీమింగ్ డేట్ ఇదిగో
రెండు ఓటీటీల్లోకి ప్రభాస్ కల్కి.. స్ట్రీమింగ్ డేట్ ఇదిగో
భారత హాకీ ఆటగాళ్లకు జీతం ఇవ్వరు.. మరి ఆదాయం ఎలా వస్తుంది?
భారత హాకీ ఆటగాళ్లకు జీతం ఇవ్వరు.. మరి ఆదాయం ఎలా వస్తుంది?
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీముఖి.. ఫొటోస్ ఇవిగో
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీముఖి.. ఫొటోస్ ఇవిగో
ఫాంలో ఉన్నోడిని పక్కనపెట్టి.. సీనియర్‌కి చోటిచ్చారు.. కట్‌చేస్తే
ఫాంలో ఉన్నోడిని పక్కనపెట్టి.. సీనియర్‌కి చోటిచ్చారు.. కట్‌చేస్తే
రెగ్యులర్‌గా ఆరెంజ్ జ్యూస్ తాగితే కలిగే లాభాలు ఇవే!
రెగ్యులర్‌గా ఆరెంజ్ జ్యూస్ తాగితే కలిగే లాభాలు ఇవే!
'బిగ్ బాస్ నుంచి తప్పుకుంటున్నా'.. కమల్ సంచలన నిర్ణయం.. కారణమిదే
'బిగ్ బాస్ నుంచి తప్పుకుంటున్నా'.. కమల్ సంచలన నిర్ణయం.. కారణమిదే
రూ. 60 వేల ఫోన్‌ను రూ. 48 వేలకే సొంతం చేసుకోండి..
రూ. 60 వేల ఫోన్‌ను రూ. 48 వేలకే సొంతం చేసుకోండి..
15 నిమిషాల్లోనే వస్తువుల డెలవరీ.. అందుబాటులోకి కొత్త సేవలు..
15 నిమిషాల్లోనే వస్తువుల డెలవరీ.. అందుబాటులోకి కొత్త సేవలు..
కాఫీలో నెయ్యి కలుపుకొని తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?దివ్యౌషధం
కాఫీలో నెయ్యి కలుపుకొని తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?దివ్యౌషధం
ఇన్స్‌పెక్టర్లకు ప్రశంస పత్రాలు అందజేసిన డీజీపీ జితేందర్..
ఇన్స్‌పెక్టర్లకు ప్రశంస పత్రాలు అందజేసిన డీజీపీ జితేందర్..
సినిమాలో ఆ సీన్ ఎవరు కలిపారు.? అర్థంకాక తలపట్టుకున్న దర్శకుడు!
సినిమాలో ఆ సీన్ ఎవరు కలిపారు.? అర్థంకాక తలపట్టుకున్న దర్శకుడు!
బిగ్ మూవీ.. బిగ్ అప్డేట్స్.. టాలీవుడ్ లో ఇప్పుడిదే ట్రెండ్.!
బిగ్ మూవీ.. బిగ్ అప్డేట్స్.. టాలీవుడ్ లో ఇప్పుడిదే ట్రెండ్.!
గంట వ్యవధిలో 24 మందిపై వీధి కుక్కల దాడి. 2 వేల కుక్క కాటు బాధితలు
గంట వ్యవధిలో 24 మందిపై వీధి కుక్కల దాడి. 2 వేల కుక్క కాటు బాధితలు
కేదార్‌నాథ్ లో తెలుగు యాత్రికుల కష్టాలు.! 13చోట్ల మార్గం ధ్వంసం..
కేదార్‌నాథ్ లో తెలుగు యాత్రికుల కష్టాలు.! 13చోట్ల మార్గం ధ్వంసం..
నిండుకుండలా నాగార్జున సాగర్‌.! చూసేందుకు కనువింపుగా..
నిండుకుండలా నాగార్జున సాగర్‌.! చూసేందుకు కనువింపుగా..
బ్యాంకును కొట్టేయడానికి ట్రై చేసిన లేడీ.. చివరకు ఏమైందో చూడండి.!
బ్యాంకును కొట్టేయడానికి ట్రై చేసిన లేడీ.. చివరకు ఏమైందో చూడండి.!
వాయవ్య దిశగా వాయుగుండం.! తెలంగాణకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షలు
వాయవ్య దిశగా వాయుగుండం.! తెలంగాణకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షలు
NTR బామ్మర్ది కూడా పిఠాపురం తాలూకానే.!
NTR బామ్మర్ది కూడా పిఠాపురం తాలూకానే.!
దేవర రచయితకు NTR ఫ్యాన్ స్వీట్ వార్నింగ్ | ఆవేశం రీమేక్‌లో బాలయ్య
దేవర రచయితకు NTR ఫ్యాన్ స్వీట్ వార్నింగ్ | ఆవేశం రీమేక్‌లో బాలయ్య
తాటిచెట్టు పై ఉరేసుకున్న వృద్ధుడు.. మృ**తదేహాన్ని దించుతుండగా..
తాటిచెట్టు పై ఉరేసుకున్న వృద్ధుడు.. మృ**తదేహాన్ని దించుతుండగా..