Ola Electric: ఓలా కంపెనీకి షాక్.. కస్టమర్‌కు రూ. 1.9లక్షలు చెల్లించాలని ఆదేశం.. ఏం జరిగిందంటే..
అత్యాధునిక ఫీచర్లతో వినియోగదారులకు ఫస్ట్ ఆప్షన్ గా మారింది. అలాంటి బ్రాండ్ ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. హైదరాబాద్లో ఓ కస్టమర్ కు నాసిరకం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని విక్రయించినందుకు చీవాట్లు తినాల్సి వచ్చింది. అంతేకాక రూ. 1.9లక్షలను ఆ కస్టమర్ కు నష్టపరిహారంగా అందించాల్సి వచ్చింది. ఇంతకీ ఏమైంది? అసలు సంగతేంటంటే..
ఓలా ఎలక్ట్రిక్.. మన దేశంలో మంచి పేరున్న ఎలక్ట్రిక్ వాహన సంస్థ. స్కూటర్ల శ్రేణిలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. అత్యాధునిక ఫీచర్లతో వినియోగదారులకు ఫస్ట్ ఆప్షన్ గా మారింది. అలాంటి బ్రాండ్ ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. హైదరాబాద్లో ఓ కస్టమర్ కు నాసిరకం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని విక్రయించినందుకు చీవాట్లు తినాల్సి వచ్చింది. అంతేకాక రూ. 1.9లక్షలను ఆ కస్టమర్ కు నష్టపరిహారంగా అందించాల్సి వచ్చింది. ఇంతకీ ఏమైంది? అసలు సంగతేంటంటే..
రూ. 1.9లక్షలు ఫైన్..
ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కు షాక్ తగిలింది. లోపభూయిస్ట ఈ-స్కూటర్ను విక్రయించినందుకు గానూ ఆ కస్టమర్ కు రూ.1,92,205 చెల్లించాలని ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్‌ను సంగారెడ్డి జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (డీసీడీఆర్‌సీ) ఆదేశించింది. ఈ మొత్తంలో కొనుగోలు చేసిన తేదీ (జూలై 3, 2023) నుంచి రియలైజ్ అయ్యే వరకు తొమ్మిది శాతం వడ్డీ రేటుతో రూ. 1,67,205 రీఫండ్, రూ. 30,000 పరిహారం ఉంటుంది. అలాగే కస్టమర్లకు లోపభూయిష్ట ఉత్పత్తులను సరఫరా చేయడం ద్వారా మోసపూరిత పద్ధతులు పాటించినందుకు జరిమానాగా ఓలా తన బ్యాంక్ ఖాతా ‘కన్స్యూమర్ లీగల్ ఎయిడ్’లో రూ. 5,000 డిపాజిట్ చేయాలని ఆదేశించింది.
అసలు ఏం జరిగిందంటే..
జహీరాబాద్‌కు చెందిన మద్ది డేవిడ్ అనే ఫిర్యాదుదారు తెలిపిన వివరాల ప్రకారం.. డెలివరీ అయిన రెండు రోజులకే స్కూటర్ అకస్మాత్తుగా ఆగిపోవడంతో మార్గమధ్యలో నిలిచిపోయాడు. దీంతో కంపెనీని సంప్రదించగా.. కొన్ని రోజుల్లో సమస్యను పరిష్కరించి స్కూటర్‌ను తిరిగి ఇచ్చేస్తామని కంపెనీ ప్రతినిధులు హామీ ఇచ్చినప్పటికీ వారు ఏమీ చేయలేదని డేవిడ్ తెలిపారు.
డేవిక్ స్కూటర్ కొనుగోలు చేసేందుకు వినియోగదారుడు బ్యాంకు రుణం తీసుకున్నాడు. ఈ క్రమంలో అతను వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. ఫోరమ్ బెంగళూరుకు చెందిన ఓలా ఎలక్ట్రిక్ కార్యాలయానికి పలుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ, అది కమిషన్ ముందు హాజరుకాలేదు. ఆరోపణలను అంగీకరించిన దాని ప్రత్యుత్తరాన్ని దాఖలు చేయలేదు.
దీనిని విచారించిన సంగారెడ్డి వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (డీసీడీఆర్సీ) ఓలా కంపెనీ లోపభూయిష్ట వాహనాన్ని ఫిర్యాదుదారుడికి విక్రయించడాన్నినిర్ధారించి పై విధంగా తీర్పునిచ్చింది. జూలై 23 నుంచి 30 రోజుల్లోగా తమ ఆదేశాలను పాటించాలని తయారీదారుని ఆదేశించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..