Stock Market: 2024లో స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా?.. ఈ అంశాలపై అవగాహన మస్ట్..

స్థిర డిపాజిట్లు (ఎఫ్‌డీ), మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ వంటివి పెట్టుబడి పెట్టడానికి ఉత్సాహం చూపుతున్నారు. ముఖ్యంగా కొంచెం రిస్క్‌ అయినా పర్లేదు కానీ మంచి రాబడి కోసం స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. వీటిల్లో కూడా స్మాల్ క్యాప్ స్టాక్‌లకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. 2023లో నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ 46 శాతం అద్భుతమైన రాబడిని ఇచ్చింది. ఫలితంగా 2024లో కూడా ఇన్వెస్టర్లు భారీ రాబడిని ఆశిస్తున్నారు.

Stock Market: 2024లో స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా?.. ఈ అంశాలపై అవగాహన మస్ట్..
Business Idea
Follow us
Srinu

|

Updated on: Jan 12, 2024 | 4:03 PM

మారుతున్న కాలానికి అనుగుణంగా చాలా మంది ఆర్థికంగా అవగాహన పెంచుకుంటున్నారు. ఎక్కువగా తమ డబ్బును పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. స్థిర డిపాజిట్లు (ఎఫ్‌డీ), మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ వంటివి పెట్టుబడి పెట్టడానికి ఉత్సాహం చూపుతున్నారు. ముఖ్యంగా కొంచెం రిస్క్‌ అయినా పర్లేదు కానీ మంచి రాబడి కోసం స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. వీటిల్లో కూడా స్మాల్ క్యాప్ స్టాక్‌లకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. 2023లో నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ 46 శాతం అద్భుతమైన రాబడిని ఇచ్చింది. ఫలితంగా 2024లో కూడా ఇన్వెస్టర్లు భారీ రాబడిని ఆశిస్తున్నారు. స్మాల్-క్యాప్ స్టాక్‌లలో పెట్టుబడులు చాలా అస్థిరంగా ఉన్నందున సమగ్ర పరిశోధన తర్వాత ఇన్వెస్ట్‌ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మీరు కూడా 2024లో స్టార్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే..  స్మాల్ క్యాప్ స్టాక్‌లలో పెట్టుబడి పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన చర్యలను ఓ సారి తెలుసుకుందాం.

కొనుగోలు, అమ్మకం 

స్మాల్ క్యాప్స్‌లో పెట్టుబడి పెట్టడానికి స్టాక్ మార్కెట్ నిపుణులు మూడు గోల్డెన్ చిట్కాలను సూచిస్తున్నారు. మొదటగా సరైన సమయాన్ని ఎంచుకోవాలి. రెండోది స్టాక్ వృద్ధి చెందడానికి తగిన అవకాశాన్ని ఇవ్వాలి. మూడోదిగా కాలానుగుణ హెచ్చుతగ్గుల కోసం ప్రమాదాన్ని నిర్వహించాలి. స్మాల్-క్యాప్ స్టాక్‌ల పనితీరు కాలానుగుణంగా ఉంటుంది. ఫలితంగా పెట్టుబడిదారులు ఆ సీజన్‌లో తమ కంపెనీ పనితీరును బట్టి పెట్టుబడి పెట్టడానికి స్టాక్‌లను ఎంచుకోవాలి.

మూల్యాంకనం 

చాలా మంది పెట్టుబడిదారులు ధర మూల్యాంకనం (పీఈ) నిష్పత్తిని కంపెనీ వాల్యుయేషన్‌ను నిర్ణయించడానికి అత్యంత ఖచ్చితమైన సూత్రంగా భావిస్తారు. స్మాల్-క్యాప్ షేర్లకు దీన్ని అనుసరించడం కష్టం. చాలా సార్లు స్టాక్‌ను పోల్చడానికి చాలా కంపెనీలు లేవు. అటువంటి పరిస్థితిలో పీఈపై ఆధారపడటం కొన్నిసార్లు మోసపూరితంగా ఉంటుంది. పెట్టుబడిదారులు స్టాక్ దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలపై దృష్టి పెట్టాలని ఆర్థిక సలహాదారులు సూచించారు. అంతే కాకుండా వారు స్టాక్ మార్జిన్ పనితీరు, మూలధనంపై రాబడి వంటి పారామితులను కూడా పరిగణించాలి.

ఇవి కూడా చదవండి

పెద్ద ఇన్వెస్టర్ల సలహాలు

పెట్టుబడిదారులు పెద్ద పెట్టుబడిదారుల సలహాలను విస్మరించరాదని ఆర్థిక సలహాదారులు అంటున్నారు. ఎందుకంటే వారు కంపెనీ గురించి మరింత ఆర్థిక సమాచారాన్ని కలిగి ఉన్నారు. వారు నేరుగా మేనేజ్‌మెంట్‌ను కూడా సంప్రదించవచ్చు. అంతే కాకుండా ఒక పెద్ద పెట్టుబడిదారుడు స్మాల్ క్యాప్ స్టాక్‌లో పెట్టుబడి పెట్టకపోతే దాని వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. పెట్టుబడిదారులు అలాంటి షేర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించారు. 

పరిశోధన 

పెట్టుబడి పెట్టే ముందు ప్రజలు ఎల్లప్పుడూ సరైన పరిశోధన చేయాలని ఆర్థిక సలహాదారులు కూడా సూచించారు. కనీసం రెండేళ్లపాటు కంపెనీల వార్షిక నివేదికలను చదివి అవగాహనతో ఉండాలి. పెట్టుబడిదారులు కంపెనీ వ్యాపార నమూనా, ఆదాయ వనరులు, పోటీదారులు, నిర్వహణ గురించి కూడా సమాచారాన్ని సేకరించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..