Pensioner Loans: పెన్షనర్లకు ఎస్బీఐ గుడ్ న్యూస్.. అత్యవసర సమయాల్లో ఇక టెన్షన్ ఉండదు..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఇలాంటి వారికి ఓ ప్రత్యేకమైన పథకాన్ని తీసుకొచ్చింది. మీరు ఒకవేళ వయో వృద్ధులై ఉండి.. పెన్షన్ తీసుకుంటూ ఏదైనా లోన్ కావాలని కోరుకుంటే ఈ పథకం నుంచి లోన్ తీసుకోడానికి అర్హులే. ఇందుకు కావాల్సిందల్లా మీకు ఎస్బీఐలో ఖాతా ఉండటమే. ఇంకెందుకు ఆలస్యం ఎస్బీఐ పెన్షనర్ల కోసం ప్రవేశపెట్టిన ఆ ప్రత్యేక పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా బ్యాంకులో రుణం పొందాలంటే సవాలక్ష రూల్స్ ఉంటాయి. వ్యక్తుల వయసు, ఆదాయం, అతని సిబిల్ స్కోర్ అంటే అతని ఖర్చులు, నికర నిల్వ వంటి అనేక అంశాలను బ్యాంకర్లు పరిశీలిస్తారు. అందుకే ఏదైనా ఉద్యోగం లేదా వృత్తి నుంచి రిటైర్ అయిపోయిన వారికి ఎటువంటి రుణాలను బ్యాంకర్లు మంజూరు చేయరు. ఎందుకంటే వారికి తిరిగి చెల్లించే సామర్థ్యం ఉండదని బ్యాంకర్లు ప్రాథమికంగా అంచనా వేస్తాయి. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఇలాంటి వారికి ఓ ప్రత్యేకమైన పథకాన్ని తీసుకొచ్చింది. మీరు ఒకవేళ వయో వృద్ధులై ఉండి.. పెన్షన్ తీసుకుంటూ ఏదైనా లోన్ కావాలని కోరుకుంటే ఈ పథకం నుంచి లోన్ తీసుకోడానికి అర్హులే. ఇందుకు కావాల్సిందల్లా మీకు ఎస్బీఐలో ఖాతా ఉండటమే. ఇంకెందుకు ఆలస్యం ఎస్బీఐ పెన్షనర్ల కోసం ప్రవేశపెట్టిన ఆ ప్రత్యేక పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షన్ లోన్ స్కీమ్..
పెన్షనర్లకు భరోసా కల్పిస్తూ ఎస్బీఐ ఓ ప్రత్యేకమైన పథకాన్ని తీసుకొచ్చింది. దాని పేరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షన్ లోన్ స్కీమ్. ఈ పథకం కింద, పెన్షన్ హోల్డర్లు కష్ట సమయాల్లో బ్యాంకు నుంచి రుణం తీసుకోవచ్చు. అయితే, రుణం మొత్తం ఎంత అనేది వారి పెన్షన్ ఆదాయంపై ఆధారపడి ఉంటుంది.
పెన్షన్ లోన్ ఫీచర్స్..
- రుణ లబ్ధిదారులు పింఛనుదారులు అయినందున, రుణానికి సంబంధించిన ప్రాసెసింగ్ రుసుము చాలా తక్కువగా ఉంటుంది.
- లోన్ పొందే ప్రక్రియ కూడా వేగంగా ఉంటుంది. మీరు ఎక్కువ డాక్యుమెంట్‌లను కూడా సమర్పించాల్సిన అవసరం లేదు.
- పెన్షన్ రుణాలపై విధించే వడ్డీ రేట్లు కూడా సాధారణంగా వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్ల కంటే తక్కువగా ఉంటాయి.
- ఈ లోన్‌లో హిడెన్ చార్జీలు లేవు. పెన్షనర్లు రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఈఎంఐ ఎంపికను పొందుతారు. మీరు ఏదైనా ఎస్బీఐ శాఖలో పెన్షన్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
పెన్షన్ రుణం కోసం షరతులు..
- పెన్షనర్లకు ఇచ్చే ఈ రుణం వ్యక్తిగత రుణం లాంటిది. ఈ రుణాన్ని పొందడానికి, రుణగ్రహీత పెన్షన్ చెల్లింపు ఆర్డర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఉండటం అవసరం.
- ఎస్బీఐ నుంచి పెన్షన్ లోన్ కోసం దరఖాస్తు చేయడానికి, పెన్షనర్ వయస్సు 76 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి.
- పెన్షనర్ రుణం సమయంలో, ట్రెజరీకి ఇచ్చిన వారి ఆదేశాన్ని సవరించబోమని హామీ ఇవ్వాలి.
- ఎస్బీఐ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేసే వరకూ, పెన్షన్ చెల్లింపులను ఇతర బ్యాంకులకు బదిలీ చేయడానికి పెన్షనర్లు చేసిన అభ్యర్థనలను ట్రెజరీ స్వీకరించదని రుణగ్రహీత ట్రెజరీకి రాతపూర్వకంగా ఇవ్వాలి.
- జీవిత భాగస్వామి (కుటుంబ పెన్షన్‌కు అర్హులు) లేదా తగిన మూడవ పక్షం ద్వారా హామీతో సహా పథకం అన్ని ఇతర నిబంధనలు, షరతులు వర్తిస్తాయి.
- రుణం తిరిగి చెల్లించే వ్యవధి 72 నెలలు, 78 సంవత్సరాలు నిండే లోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..