AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు.. రూ. 10,00,000 కోట్ల ఇన్వెస్టర్ల సంపద హాంఫట్..!

Indian Stock Market: రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం స్టాక్ మార్కెట్లపై దారుణంగా పడింది. ఫలితంగా షేర్ మార్కెట్ కుప్పకూలింది.

Stock Market: రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు.. రూ. 10,00,000 కోట్ల ఇన్వెస్టర్ల సంపద హాంఫట్..!
Shiva Prajapati
|

Updated on: Feb 14, 2022 | 6:45 PM

Share

Indian Stock Market: రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం స్టాక్ మార్కెట్లపై దారుణంగా పడింది. ఫలితంగా షేర్ మార్కెట్ కుప్పకూలింది. లక్షల కోట్ల మదుపర్ల సంపద హాంఫట్ అయ్యింది. సోమవారం సెన్సెక్స్, నిఫ్టీ పాయింట్లు దారుణంగా పడిపోయాయి. సెన్సెక్స్ 1,747.08 పాయింట్లు(3 శాతం) పతనమై 56,405.82 వద్ద ముగియగా, నిఫ్టీ 531.95 (3.06 శాతం) పాయింట్లు డౌన్ అయి 16,842.80 పాయింట్ల వద్ద ముగిసింది. రష్యా ఏ క్షణమైనా ఉక్రెయిన్‌ను ఆక్రమించొచ్చన్న అమెరికా హెచ్చరికలతో ఇన్వెస్టర్లు బెదిరిపోయారు. యుద్ధ భయంతో ఇన్వెస్టర్లు తమ షేర్లను ఇబ్బడిముబ్బడిగా అమ్మేశారు. ఇక ఉదయం నుంచే భారీ నష్టాలతో మొదలైన స్టాక్ మార్కె్ట్ల ర్యాలీ మధ్యాహ్నం కాస్త పుంజుకున్నట్లు అనిపించినా సాయంత్రానికి దారుణమైన నష్టాలతో ముగిశాయి.

ఇక ఈక్విటీ ఇన్వెస్టర్లు దలాల్ స్ట్రీట్‌లో రెండు రోజుల అమ్మకాలలో రూ. 10 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు. 30 షేర్ల ఇండెక్స్ ఫిబ్రవరి 10న 58,926.03 వద్ద ఉండగా ఫిబ్రవరి 14న అంటే ఇవాళ 56,405.84 వద్ద ముగిసింది. రెండు సెషన్లలో పెట్టుబడిదారులు రూ. 12.43 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. బిఎస్ఈ మార్కెట్ క్యాప్ గత వారం గురువారం రూ. 267.81 లక్షల కోట్ల నుండి రూ. 255.38 లక్షల కోట్లకు పడిపోయింది.

స్టాక్ మార్కెట్ల పతనం గురించి హెమ్ సెక్యూరిటీస్ హెడ్ పిఎంఎస్ మోహిత్ నిగమ్ మాట్లాడుతూ.. ‘‘ఉక్రెయిన్-రష్యా ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు, యూఎస్ ఫెడ్ దూకుడు వంటి ప్రతికూల అంశాలు స్టాక్ మార్కెట్‌పై కనిపించింది. ప్రధానంగా ప్రస్తుత పతనానికి ఉక్రెయిన్-రష్యా సంక్షోభమే కారణం. ఈ సంక్షోభం ముగిసిన తరువాత మార్కెట్లు మరింత పుంజుకునే అవకాశం ఉంది’’ అని అభిప్రాయపడ్డారు.

ఇక నిఫ్టీ ఇండెక్స్‌లోని మొత్తం 50 స్టాక్‌లు కూడా గత రెండు సెషన్లలో వాటి షేర్ల ధరల్లో పతనాన్ని చవిచూశాయి. 8.04 శాతం పతనంతో హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఇన్సూరెన్స్ ఇండెక్స్‌లో టాప్ లూజర్‌గా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (7.50 శాతం క్షీణత), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (7.46 శాతం క్షీణత), టాటా మోటార్స్ (7.18 శాతం క్షీణత) ఉన్నాయి. యూపీఎల్, శ్రీ సిమెంట్, కోటక్ మహీంద్రా బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, టెక్ మహీంద్రా, లార్సెన్ అండ్ టూబ్రో, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, మారుతీ సుజుకీ షేర్లు కూడా 5 శాతానికి పైగా క్షీణించాయి.

Also read:

Vijayawada News: ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. డబ్బులు ఇవ్వలేదని పేషెంట్‌తో అమానుషంగా..

Jeep India: జీప్‌ ఇండియా నుంచి సరికొత్త కారు.. 7 సీట్ల ఎస్‌యూవీ మెరిడియన్‌..!

Andhra Pradesh: ఒక వ్యక్తినే 2 సార్లు కిడ్నాప్ చేసిన కిడ్నాపర్.. ఇదో విచిత్రమైన స్టోరీ