AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Loans: ఎస్‌బీఐ కీలక నిర్ణయం. వాటితో భాగస్వామ్యం.. గ్రామీణ ప్రాంతాల వారికి సులభమైన రుణాలు..!

SBI Loans: బ్యాంకింగ్‌ రంగలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. బ్యాంక కస్టమర్లకు సులభమైన సేవలు అందించేందుకు ఆర్బీఐ చర్యలు చేపడుతోంది. ఇక బ్యాంక్..

SBI Loans: ఎస్‌బీఐ కీలక నిర్ణయం. వాటితో భాగస్వామ్యం.. గ్రామీణ ప్రాంతాల వారికి సులభమైన రుణాలు..!
Subhash Goud
| Edited By: |

Updated on: Oct 01, 2021 | 8:59 AM

Share

SBI Loans: బ్యాంకింగ్‌ రంగలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. బ్యాంక కస్టమర్లకు సులభమైన సేవలు అందించేందుకు ఆర్బీఐ చర్యలు చేపడుతోంది. ఇక బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. పలు మైక్రోఫైనాన్స్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కో-లెండింగ్ కోసం బ్యాంక్ ఈ విధంగా మైక్రో ఫైనాన్స్ కంపెనీలతో జతకట్టింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి రుణాలు అందుబాటులోకి రానున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో రుణ సదుపాయం:

వేదిక క్రెడిట్ క్యాపిటల్, సేవ్ మైక్రోఫైనాన్స్, పైసాలో డిజిటల్ అనే మూడు మైక్రో ఫైనాన్స్ కంపెనీలతో ఎస్‌బీఐ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఎస్‌బీఐ సేవలు మరింత మందికి అందుబాటులోకి రానున్నాయి. చాలా మందికి చిన్న మొత్తంలో రుణాలు సులభంగా లభించనున్నాయి.

ఫామ్ మెకనైజేషన్, వేర్‌హౌస్ రిసిప్ట్ ఫైనాన్స్, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ వంటి వాటికి రుణాలు అందించేందుకు బ్యాంక్ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. మైక్రో ఫైనాన్స్, ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల భాగస్వామ్యంతో ఎస్‌బీఐ రుణాలు వీరికి అందుబాటులోకి రానున్నాయి. ఇలా కస్టమర్ల కోసం ఎస్‌బీఐ ఎన్నో సదుపాయాలు తీసుకువస్తోంది. వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు, సీనియర్‌ సిటిజన్స్‌ కోసం రుణాలు తదితర అంశాలలో ఎన్నో సదుపాయాలను అందిస్తోంది. ఇవే కాకుండా హోమ్‌ లోన్స్‌పై కూడా వడ్డీ శాతం కూడా తగ్గిస్తోంది. వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ఎస్‌బీఐ మార్పులు తీసుకువస్తోంది.

ఇవీ కూడా చదవండి:

Digital Payments: డిజిటల్‌ చెల్లింపుల్లో తెలంగాణ రాష్ట్రం టాప్‌.. ఫోన్‌పే సర్వేలో వెల్లడి..!

Bank New Rules: మీకు ఈ బ్యాంకుల్లో ఖాతా ఉందా..? అక్టోబర్‌ 1 నుంచి కొత్త నిబంధనలు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..!

Follow Us
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!
5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!