Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Fixed Deposit: సీనియర్‌ సిటిజన్లకు ఎస్‌బీఐ ప్రత్యేక ఆఫర్‌.. ఈ పథకం ద్వారా ఎన్నో ప్రయోజనాలు..!

SBI Fixed Deposit: పండగ సీజన్‌ వస్తుండటంతో వివిధ బ్యాంకులు కస్టమర్లకు ఎన్నో ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. హోమ్‌లోన్స్‌, వ్యక్తిగత లోన్స్‌,.

SBI Fixed Deposit: సీనియర్‌ సిటిజన్లకు ఎస్‌బీఐ ప్రత్యేక ఆఫర్‌.. ఈ పథకం ద్వారా ఎన్నో ప్రయోజనాలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 13, 2021 | 7:20 AM

SBI Fixed Deposit: పండగ సీజన్‌ వస్తుండటంతో వివిధ బ్యాంకులు కస్టమర్లకు ఎన్నో ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. హోమ్‌లోన్స్‌, వ్యక్తిగత లోన్స్‌, ఇతర లోన్స్‌పై వడ్డీ శాతాన్ని తగ్గిస్తున్నాయి. అలాగే ప్రాసెసింగ్‌ ఫీజుల్లోనూ రాయితీ కల్పిస్తున్నాయి. ఇక స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సీనియర్‌ సిటిజన్స్‌కు ప్రత్యేక స్కీమ్‌ ద్వారా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లను అందిస్తోంది. గత సంవత్సరం మే నెలలో సీనియర్‌ సిటిజన్ల కోసం ‘వీ కేర్‌’ సీనియర్‌ సిటిజన్స్‌ టర్మ్‌ డిపాజిట్‌ (SBI Wecare Deposit) పథకాన్ని ఎస్‌బీఐ ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్‌ గడువు సెప్టెంబర్‌ 2020లోనే గడువు ముగియగా, కానీ కరోనా మహమ్మారి కారణంగా దీనిని పదేపదే పొడిగిస్తూ వస్తోంది. తాజాగా ఈ పథకం గడువును 2022 మార్చి 31 వరకు కొనసాగిస్తామని ఎస్‌బీఐ ప్రకటించింది. ‘వీ కేర్‌’ పేరుతో సీనియర్‌ సిటిజన్లకు అందిస్తున్న టర్మ్‌ డిపాజిట్‌లో.. 5 నుంచి 10 సంవత్సరాల గరిష్ఠ వ్యవధికి 6.20 శాతం అత్యధిక వడ్డీని ఎస్‌బీఐ అందిస్తోంది. ఈ స్కీమ్‌లో భాగంగా 60 ఏళ్లు నిండిన ఎస్‌బీఐ పెన్షనర్లకు.. సీనియర్‌ సిటిజన్లకు చెల్లించే వడ్డీ రేటు కంటే మరో 6 శాతం అధికంగా చెల్లిస్తామని బ్యాంకు వెల్లడించింది. ఈ లెక్కన మిగిలిన పౌరులతో పోలిస్తే ఎస్‌బీఐ పెన్షనర్లకు 1 శాతం అదనపు వడ్డీ పొందే వెసులుబాటును ఈ పథకం కల్పిస్తోంది.

అదనపు వడ్డీ ప్రయోజనాలు:

సీనియర్‌ సిటిజన్ల ఆదాయాన్ని సంరక్షిస్తూ వారికి అదనపు వడ్డీ ప్రయోజనాలు అందించడం ఈ స్కీమ్‌ఈ పథకం ఉద్దేశం ఐదు సంవత్సరాల పాటు సాధారణ ప్రజలు ఎవరైనా ఎస్‌బీఐలో ఫిక్స్‌ డిపాజిట్‌ చేస్తే.. వారికి బ్యాంకు 5.4 శాతం వడ్డీ చెల్లిస్తోంది. అదే 60 ఏళ్లు పైబడిన వారు చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై దాదాపు 6.20 శాతం వడ్డీని బ్యాంకు చెల్లిస్తోంది. ఈ రేట్లు జనవరి 8, 2021 నుంచి అమల్లోకి వచ్చాయి. ఒకవేళ మీరు ముందుస్తుగా విత్‌డ్రా చేయాలనుకుంటే అదనపు వడ్డీ ప్రయోజనాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. అలాగే 0.50 శాతం వరకు పెనాల్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది.

టర్మ్ డిపాజిట్ వడ్డీ రేట్లు

► 7 రోజుల నుంచి 45 రోజులు 3.4 శాతం

► 46 రోజుల నుంచి 179 రోజులు 4.4 శాతం

► 180 రోజుల నుంచి 210 రోజులు 4.9 శాతం

► 211 రోజుల నుంచి 1 సంవత్సరం లోపు 4.9 శాతం

► 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపు 5.5 శాతం

► 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల లోపు 5.6 శాతం

► 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు 5.8 శాతం

► 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు 6.2 శాతం

సాధారణ కస్టమర్లకు ఎఫ్‌డీరేట్లు

► 7 రోజుల నుంచి 45 రోజులు 2.9 శాతం

► 46 రోజుల నుంచి 179 రోజులు 3.9 శాతం

► 180 రోజుల నుంచి 210 రోజులు 4.4 శాతం

► 211 రోజుల నుంచి 1 సంవత్సరం లోపు 4.4 శాతం

► 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపు 5 శాతం

► 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల లోపు 5.1 శాతం

► 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు 5.3 శాతం

► 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు 5.4 శాతం

► ఈ వడ్డీ రేట్లు అన్ని కూడా జనవరి 01, 2021 నుంచి అమల్లో ఉన్నాయి.

ఇవీ కూడా చదవండి:

SBI Tractor Loan: రైతులకు ఎస్‌బీఐ అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ట్రాక్టర్‌ కోసం వందశాతం రుణం.. పూర్తి వివరాలు..!

Small Finance Bank: పండగ సీజన్‌లో స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు ప్రత్యేక ఆఫర్లు.. వివిధ రుణాలపై బంపర్‌ ఆఫర్‌..!