Indian Railways: దక్షిణ మధ్య రైల్వే సరికొత్త రికార్డు.. జరిమానాలతోనే ఎన్ని కోట్ల ఆదాయం వచ్చిందో తెలుసా?

దక్షిణ మధ్య రైల్వే అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. టిక్కెట్ తనిఖీల్లో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించించింది. ఇప్పటికే అన్ని విభాగాల్లో అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తు వస్తోన్న దక్షిణ మధ్య రైల్వే తాజాగా జరిమానాలతోనే ఏకంగా..

Indian Railways: దక్షిణ మధ్య రైల్వే సరికొత్త రికార్డు.. జరిమానాలతోనే ఎన్ని కోట్ల ఆదాయం వచ్చిందో తెలుసా?
Indian Railways
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 11, 2023 | 9:27 PM

దక్షిణ మధ్య రైల్వే అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. టిక్కెట్ తనిఖీల్లో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించించింది. ఇప్పటికే అన్ని విభాగాల్లో అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తు వస్తోన్న దక్షిణ మధ్య రైల్వే తాజాగా జరిమానాలతోనే ఏకంగా రూ. 200.17 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి మరో మైలురాయిని సాధించింది. టికెట్ లేని ప్రయాణం, ముందుగా బుక్ చేయని లగేజి మొదలైన వంటి వాటి మీద విధించిన జరిమాన ఈ ఆదాయాన్ని ఆర్జించింది. మొత్తం 28.27 లక్షల కేసుల ద్వారా ఈ మొత్తం సమకూరింది. ఇదిలా ఉంటే అంతకుముందు 2019-20లో టిక్కెట్ తనిఖీల ద్వారా అత్యధికంగా రూ. 154.29 కోట్లు ఆర్జించింది.

టికెట్​ ఆవశ్యకత గురించి సాధారణ ప్రజలకు అవగాహన కల్పించడానికి తనిఖీలు చేపడుతుంటారు. యూటీఎస్ మొబైల్ యాప్, బుకింగ్ కౌంటర్ల దగ్గర ఏవీటీఎం మెషీన్లు, కౌంటర్ల దగ్గర క్యూ ఆర్ కోడ్​ ప్రదర్శించడం మొదలైన వాటి ద్వారా కూడా టిక్కెట్లను కొనుగోలు చేయడానికి అధికారులు కృషి చేస్తున్నారు. తద్వారా రైల్వేల బుకింగ్ విండో విక్రయాలను పెంచడానికి మార్గం సుగమం చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ ఆర్థిక ఏడాది ఇప్పటి వరకు ప్రయాణీకులను చేరవేయడం ద్వారా రూ. 4825.72 కోట్లను ఆర్జించింది.

ఈ విషయమై దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ శ్రీ అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ… టికెట్ల తనిఖీల ద్వారా రూ. 200 కోట్ల ఆదాయాన్ని దాటినందుకు అధికారులు, సిబ్బందిని అభినందించారు. టికెట్ తనిఖీ అనేది ఒక పటిష్టమైన యంత్రాంగమని, ఇది క్రమరహిత ప్రయాణాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని, అన్ని రకాల (టికెట్) ఆధారాలతో రైలు ప్రయాణీకులలో విశ్వాసాన్ని పెంపొందించడంలో సహాయపడుతుందని, అలాగే రైల్వే పట్ల సానుకూల దృక్పథాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని జైన్‌ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..