Anand Mahindra: భవిష్యత్తులో యుద్ధాలు భిన్నంగా ఉంటాయి.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు
Anand Mahindra Tweet: రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలు హెచ్చరించినా.. రష్యా ఏమాత్రం వినకుండా ఉక్రెయిన్‌పై దాడులను ముమ్మరం చేసింది. దాదాపు రెండు వారాల నుంచి
Anand Mahindra Tweet: రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలు హెచ్చరించినా.. రష్యా ఏమాత్రం వినకుండా ఉక్రెయిన్‌పై దాడులను ముమ్మరం చేసింది. దాదాపు రెండు వారాల నుంచి రష్యా ఉక్రెయిన్‌పై దురాక్రమణను కొనసాగిస్తోంది. అయితే.. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం (Russia Ukraine Crisis) మధ్యలో చైనా రక్షణ రంగ బడ్జెట్‌ను గణనీయంగా పెంచిన విషయం తెలిసిందే. అయితే.. భారత్ – చైనా మధ్య ఇప్పటికే సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొని ఉన్న సమయంలో ఈ కేటాయింపులు చేపట్టడం కలవరానికి గురిచేస్తోంది. అయితే.. దీనిపై భారత ప్రముఖ వ్యాపారవేత్త, మహింద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ పలు విధాలుగా స్పందిస్తూ.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహింద్రా.. చైనా రక్షణ రంగ కేటాయింపులపై స్పందించారు. బడ్జెట్ పరిమాణంతో పట్టింపు లేదని, ఆ కేటాయింపుల్ని ఎంత తెలివిగా ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యమంటూ ఆయన వ్యాఖ్యానించారు.
బడ్జెట్ ఎంత భారీ స్థాయిలో ఉందన్నది ముఖ్యం కాదు. మున్ముందు యుద్ధ పరిణామాలు భిన్నంగా ఉంటాయి. ఉక్రెయిన్‌లో డ్రోన్లు, యుద్ధ ట్యాంకుల్ని ధ్వంసం చేస్తున్నాయి. మనం ఎంత ఖర్చు చేస్తున్నామనేదాని కంటే ఎంత తెలివిగా ఖర్చు చేస్తున్నామన్నదే ఇక్కడ ముఖ్యం అంటూ మహీంద్రా ట్వీట్ చేశారు. రష్యా సైనికి శక్తి ముందు ఉక్రెయిన్ నిలవలేదని ప్రపంచమంతా భావించగా.. అందుకు భిన్నమైన రీతిలో అక్కడ పోరు సాగుతోందంటూ ఆయన పరోక్షంగా చెప్పారు. విమాన విధ్వంసక, ట్యాంక్ విధ్వంసక ఆయుధాలను ఉపయోగిస్తూ ఉక్రెయిన్ తీవ్రంగా ప్రతిఘటిస్తున్న విషయం తెలిసిందే.
‘Size doesn’t matter.’ The future of warfare will be different. In the Ukraine, armed drones are playing havoc with convoys of tanks. It’s not how much we spend but how smartly we spend that will matter… https://t.co/K5VoFkZ6wd
— anand mahindra (@anandmahindra) March 9, 2022
ఇదిలాఉంటే.. కొద్ది రోజుల క్రితం వార్షిక రక్షణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన చైనా.. రక్షణ రంగం కేటాయింపుల్ని గణనీయంగా పెంచింది. గతేడాదితో పోలిస్తే 7.1 శాతం నిధుల్ని పెంచి 230 బిలియన్ డాలర్లు కేటాయించింది. భారత రక్షణ బడ్జెట్‌తో పోలిస్తే ఇది దాదాపు మూడింతలని పేర్కొంటున్నారు. ఇండో – పసిఫిక్ ప్రాంతంలో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న చైనా.. ఈ స్థాయిలో కేటాయింపుల్ని పెంచడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: