AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఈ ‘సూట్‌కేస్’ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. దేనితో తయారు చేశారో తెలిస్తే షాకవ్వాల్సిందే!

ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పించారు. బడ్జెట్‌ను సమర్పించేందుకు ఆయన స్పెషల్ 'బ్రీఫ్‌కేస్'తో వచ్చారు.

Viral: ఈ 'సూట్‌కేస్' నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. దేనితో తయారు చేశారో తెలిస్తే షాకవ్వాల్సిందే!
Briefcase
Venkata Chari
|

Updated on: Mar 09, 2022 | 6:00 PM

Share

నెట్టింట్లో వీడియోలతోపాటు ఫొటోలు కూడా తెగ సందడి చేస్తుంటాయి. ఇందులో కొన్ని ఫొటోలు మాత్రం నెటిజన్లను తెగ ఆకర్షిస్తుంటాయి. వాటిలో తాజాాగా నేడు మరొక స్పెషల్ సూట్‌కేస్ ఫొటో వచ్చి చేరింది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్(Chhattisgarh CM Bhupesh Baghel) బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌(State Budget)ను సమర్పించారు. బడ్జెట్‌ను సమర్పించేందుకు ఆయన ‘ఆవు పేడ'(Cow Dung)తో తయారు చేసిన ప్రత్యేక ‘బ్రీఫ్‌కేస్’తో వచ్చారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై నెటిజన్లు సరదాగా తమ కామెంట్లను షేర్ చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు కూడా సీఎం బఘేల్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. ఈ బ్రీఫ్‌కేస్‌ను ఆవు పేడ పొడితో మహిళా స్వయం సహాయక బృందం తయారు చేసింది. దానిపై ‘గోమాయ్ బసాతే లక్ష్మి’ అని రాసి ఉంది. బడ్జెట్‌లో లక్ష్మీ దేవి చిహ్నంగా ఆవుపేడతో దీనిని తయారు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆవుపేడ పొడితో తయారు చేసిన ఈ బ్రీఫ్‌కేస్‌ను ఆవిష్కరించిన తొలి రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్ అవతరించింది.

ఛత్తీస్‌గఢ్‌లో గత ఏడాది కాలంలో ఆవు పేడతో అనేక రకాల ఉత్పత్తులను తయారుచేస్తుంది. ఆ రాష్ట్ర మహిళలను స్వావలంబన దిశగా తీర్చిదిద్దే క్రమంలో తీసుకొచ్చిన భారీ మార్పుల్లో ఇది కూడా ఒకటని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం భారత ప్రభుత్వం కూడా ఈ పథకంపై కసరత్తు చేస్తోంది. ఈ ఫొటోను ANI తన సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. దీంతో ఈ సూట్‌కేస్‌పై నెట్టింట్లో చర్చ మొదలైంది. ఇప్పటికే 3 వేలకు పైగా ట్వీట్లు, 2 వేలకు పైగా రీట్వీట్‌లను పొందింది. వందలాది మంది వినియోగదారులు దీనిపై తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.

ఈ మేరకు కొంతమంది యూజర్లు ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడా లేక బీజేపీ నాయకుడా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది వినియోగదారులు మాత్రం 2022లో ఇలాంటి ఇంకెన్ని చూడాలో? అంటూ తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు.

Also Read: Telangana: పురాతన ఇంటిలో తవ్వకాలు.. కట్ చేస్తే ఊహించని సీన్.. ఒక్కసారిగా ఫ్యూజులు ఔట్.!

Viral: అన్నం తినే ప్లేట్‌లో సెల్‌ఫోన్‌కూ ప్లేస్.. నెట్టింట ఫోటో ట్రెండింగ్