DCGI: కోవోవాక్స్ అత్యవసర వినియోగానికి అనుమతిచ్చిన డీసీజీఐ.. ఈ టీకా పిల్లల కోసమేనట.!
12 నుంచి 17 సంవత్సరాల వయస్సు గల వారికి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ కోవోవాక్స్‌ను భారత డ్రగ్ రెగ్యులేటర్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చినట్లు అధికారిక వర్గాలు బుధవారం తెలిపాయి...
12 నుంచి 17 సంవత్సరాల వయస్సు గల వారికి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ కోవోవాక్స్ అత్యవసర వినియోగానికి భారత డ్రగ్ రెగ్యులేటర్ అనుమతి ఇచ్చినట్లు అధికారిక వర్గాలు బుధవారం తెలిపాయి. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారి దీన్ని ఇవ్వడానికి రెగ్యులేటర్ ఆమోదం తెలిపింది. CDSCO COVID-19పై సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ గత వారం 12 నుండి 17 సంవత్సరాల వయస్సు గల వారికి Covovax కు అత్యవసర వినియోగానికి (EUA) సిఫార్సు చేసిన తర్వాత డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఆమోదం లభించింది. 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి టీకాలు వేయడంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
DCGIకి EUA దరఖాస్తులో SIIలో డైరెక్టర్ (ప్రభుత్వం మరియు నియంత్రణ వ్యవహారాలు) ప్రకాష్ కుమార్ సింగ్.. 12 నుండి 17 సంవత్సరాల వయస్సు గల 2707 మంది పిల్లలపై Covovax అత్యంత ప్రభావవంతంగా పని చేసిందని అధ్యయనాలు వెల్లడించాయని చెప్పారు. రోగనిరోధక శక్తి, సురక్షితమైనదని తేలిందన్నారు. DCGI ఇప్పటికే డిసెంబరు 28న పెద్దవారికి వ్యాక్సిన్ ఇవ్వడానికి Covovaxకు అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి 21న DCGI కొన్ని షరతులకు లోబడి 12 నుండి 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల వారికి బయోలాజికల్ E COVID-19 వ్యాక్సిన్ Corbevax అత్యవసర వినియోగానికి అనుమతి మంజూరు చేసింది. భారతదేశం 15-18 సంవత్సరాల మధ్య యుక్తవయస్సులో ఉన్నవారికి టీకాలు వేయడానికి భారత్ బయోటెక్‌కు చెందిన కోవాక్సిన్‌ను ఉపయోగిస్తోంది.
Read Also.. Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో భారత్ ఆటో పరిశ్రమకు మంచి అవకాశం ఎందుకంటే..