Simple One Electric Scooter: మార్కెట్‌లోకి సింపుల్ వన్ ఈవీ స్కూటర్.. సూపర్ స్పీడ్ సపోర్ట్‌తో అదిరిపోయే ఫీచర్లు
ఇటీవల తమిళనాడులోని శూలగిరిలో ఉన్న తన అత్యాధునిక తయారీ కేంద్రం (సింపుల్ విజన్ 1.0) నుంచి సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. సింపుల్ ఎనర్జీ నుంచి రాబోయే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మే 23న అధికారికంగా ప్రారంభిస్తారు.
ఎలక్ట్రిక్ వెహికల్, క్లీన్ ఎనర్జీ స్టార్టప్ కంపెనీ సింపుల్ ఎనర్జీ కంపెనీ త్వరలో ఓ కొత్త ఈవీ స్కూటర్‌ను లాంచ్ చేయబోతుంది. ముఖ్యంగా బ్యాటరీ, మైలేజ్‌పైనే దృష్టి పెడుతూ ఈ స్కూటర్‌ను రూపొందించారు. ఇటీవల తమిళనాడులోని శూలగిరిలో ఉన్న తన అత్యాధునిక తయారీ కేంద్రం (సింపుల్ విజన్ 1.0) నుంచి సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. సింపుల్ ఎనర్జీ నుంచి రాబోయే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మే 23న అధికారికంగా ప్రారంభిస్తారు. ముఖ్యంగా సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ అత్యధిక భద్రతా ప్రమాణాలను కలిగి ఉంది. సింపుల్ ఎనర్జీ భారతదేశంలోని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో మైలేజ్ పరంగా మెరుగ్గా ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
ఈ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ చేశాక 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణించగలదని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. అదనంగా ఈ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ శక్తివంతమైన 8.5 కేడబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటార్‌తో 72 ఎన్ఎం పీక్ టార్క్, పెద్ద 4.8కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. అలాగే ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 105 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. అలాగే కేవలం 2.77 సెకన్లలో 40 కిలో మీటర్ల వేగం అందుకుంటుంది. అలాగే ఈ స్కూటర్ ధర రూ.1.20 లక్షలుగా ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ స్టార్ట్-అప్ కంపెనీ శూలగిరిలోని తన సదుపాయంలో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తిని పెంచడానికి గతంలో రూ. 165 కోట్లు సేకరించింది.
ప్రస్తుతం షూలగిరిలో 2,00,000 చదరపు అడుగుల తయారీ సౌకర్యంతో, జనరల్ అసెంబ్లీ లైన్‌తో, భారతదేశపు మొట్టమొదటి పేటెంట్ పొందిన అంతర్గత మోటార్ తయారీ లైన్, బ్యాటరీ తయారీ లైన్, సెల్ స్టోరేజ్‌తో సింపుల్ ఎనర్జీ మార్కెట్‌లోకి దూసుకువస్తుంది. అయితే ఈ స్కూటర్ ధర కాస్త ఎక్కువగా ఉన్నా దీనిలోని ఫీచర్లను బట్టి భారతదేశంలో సత్తా చూపుతుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..