Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Scooter: లాంచింగ్‌కు రెడీ అయిన మరో ఈ-బైక్.. ఆకర్షణీయ డిజైన్‌తో పాటు 140 కిమీ రేంజ్..

దేశీయ టూ వీలర్ స్టార్టప్ కంపెనీ ఈ-స్ప్రింటో తన కొత్త స్కూటర్ కు సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది. ఈ-స్ప్రింటో అమెరీ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరుతో హై స్పీడ్ ఈ స్కూటర్ ను త్వరలో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది సింగిల్ చార్జ్ పై 140 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని వివరించింది.

Electric Scooter: లాంచింగ్‌కు రెడీ అయిన మరో ఈ-బైక్.. ఆకర్షణీయ డిజైన్‌తో పాటు 140 కిమీ రేంజ్..
E Sprinto Electric Scooter
Follow us
Madhu

|

Updated on: May 06, 2023 | 12:30 PM

భారతీయ మార్కెట్లో కూడా ఎలక్ట్రిక్ వాహనాలు తమదైన ముద్ర వేసుకుంటున్నాయి. రోజురోజుకీ వాటి డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా స్కూటర్ల కొనుగోళ్లు అధికమవుతున్నాయి. ఇంటి అవసరాలకు, సిటీలో ట్రాఫిక్ లో తిరగడానికి బాగా ఉపయుక్తంగా ఉంటుండటంతో ఇవి బాగా ఉపకరిస్తున్నాయి. దీంతో అనేక స్టార్టప్ కంపెనీలు కూడా అత్యాధునిక ఫీచర్లతో సరికొత్త లుక్ లో ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో దేశీయ టూ వీలర్ స్టార్టప్ కంపెనీ ఈ-స్ప్రింటో తన కొత్త స్కూటర్ కు సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది. ఈ-స్ప్రింటో అమెరీ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరుతో హై స్పీడ్ ఈ స్కూటర్ ను త్వరలో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది స్ట్రాంగ్ బ్యాటరీతో వస్తుందని పేర్కొంది. సింగిల్ చార్జ్ పై 140 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని వివరించింది. నెలలోపే ఈ స్కూటర్ అధికారిక లాంచింగ్ ఉంటుందని చెప్పింది. ఈ స్కూటర్ ముఖ్యంగా యంగ్ ఏజ్ గ్రూప్ల వారికి ఉద్దేశించిందని 20 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయస్సున్న వినియగదారులే లక్ష్యంగా దీనిని తయారు చేసినట్లు ఈ-స్ప్రింటో ప్రకటించింది.

వాటికి పోటీగానే..

ఈ-స్ప్రింటో అమెరీ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఒకినావ, ఒకాయా, యాంపియర్ వంటి కంపెనీలకు చెందిన స్కూటర్లకు పోటీగా దీనిని లాంచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది గరిష్టంగా గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 150 కేజీల బరువును సునాయాసంగా మోయగలుగుతుంది. అంతేకాక ఈ స్కూటర్ ను ప్రభుత్వ ఫేమ్ 2 పాలసీ అనుగుణంగా తయారు చేశారు. వచ్చే నెలలోపు ఈ స్కూటర్ ను దేశ వ్యాప్తంగా ఉన్న ఈ-స్ప్రింటో అధికారిక డీలర్ షిప్స్ వద్ద అమ్మకానికి ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. అయితే వీటిని ఆన్ లైన్ లో విక్రయాలు చేయమని కంపెనీ ప్రకటించింది. వాహనం లాంచ్ చేసిన రోజే ధరను కూడా వెల్లడిస్తామని ఈ-స్ప్రింటో వివరించింది.

అర్బన్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని..

ఈ-స్ప్రింటో అమెరీ స్కూటర్ లాంచింగ్ లాంచింగ్ కు సంబంధించి ఈ-స్ప్రింటో కో ఫౌండర్, డైరెక్టర్ అటుల్ గుప్తా మాట్లాడుతూ తమ నాణ్యత, సృజనాత్మకు ప్రతి రూపంగా ఈ స్కూటర్ ఉంటుందన్నారు. ఇది తమకు గర్వకారణంగా మారుగలదని పేర్కొన్నారు. దీనిని ముఖ్యంగా అర్బన్ అవసరాలను దృష్టిలో పెట్టుకొనిన తీసుకొచ్చినట్లు చెప్పారు. సిటీ రైడర్లకు ఇది బాగా నప్పుతుందని వివరించారు. దీనిలో అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు ఉంటాయన్నారు. ఆకర్షణీయ డిజైన్, మంచి పనితీరును కలిగి ఉంటుందని వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..