SIM Card New Rule: సిమ్‌ కార్డు పోర్ట్‌ చేయాలంటే ఇక నుంచి అలా కుదరదు.. జూలై 1 నుంచి కొత్త నిబంధనలు

సిమ్ కార్డ్ కొత్త నిబంధనలకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్‌లు వస్తూనే ఉంటాయి. ఈ సిరీస్‌లో మొబైల్ వినియోగదారుల కోసం ముఖ్యమైన సమాచారం జారీ చేసింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP) నిబంధనలో మార్పులు చేయాలని నిర్ణయించింది. సిప్‌ స్వాప్ మోసాన్ని నివారించడానికి ట్రాయ్‌ ఈ నియమాన్ని అమలు చేస్తోంది..

SIM Card New Rule: సిమ్‌ కార్డు పోర్ట్‌ చేయాలంటే ఇక నుంచి అలా కుదరదు.. జూలై 1 నుంచి కొత్త నిబంధనలు
Sim Card
Follow us

|

Updated on: Jun 26, 2024 | 5:23 PM

సిమ్ కార్డ్ కొత్త నిబంధనలకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్‌లు వస్తూనే ఉంటాయి. ఈ సిరీస్‌లో మొబైల్ వినియోగదారుల కోసం ముఖ్యమైన సమాచారం జారీ చేసింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP) నిబంధనలో మార్పులు చేయాలని నిర్ణయించింది. సిప్‌ స్వాప్ మోసాన్ని నివారించడానికి ట్రాయ్‌ ఈ నియమాన్ని అమలు చేస్తోంది. ఈ నిబంధనలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ట్రాయ్‌ ముసాయిదా టెలికమ్యూనికేషన్ మొబైల్ నంబర్ పోర్టబిలిటీ రెగ్యులేషన్స్, 2023ని విడుదల చేసింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ సలహా మేరకు ఇది జారీ చేయబడింది.

ఇది కూడా చదవండి: Budget 2024: రాబోయే బడ్జెట్‌లో మోడీ సర్కార్‌ శుభవార్త.. రైతుల ఖాతాల్లో రూ.8 వేలు?

ఇవి కూడా చదవండి

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) 15 మార్చి 2024న కొత్త నిబంధనలను జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలు జూలై 1, 2024 నుండి దేశవ్యాప్తంగా అమలులోకి వస్తాయి. ట్రాయ్ ఈ నిబంధనలపై మోసపూరిత సంఘటనలను అరికట్టడంలో ఇది సహాయపడుతుందని పేర్కొంది.

సిమ్‌ కార్డ్ కోసం ఈ నియమాలు మార్పు:

మీ సిమ్ కార్డ్ దొంగిలించబడినా లేదా పాడైపోయినా, మీరు ఇప్పుడు కొత్త సిమ్‌ని పొందడానికి కొంత సమయం వేచి ఉండాలి. ఇంతకు ముందు సిమ్ కార్డ్ దొంగిలించబడినా లేదా పాడైపోయినా మీరు స్టోర్ నుండి వెంటనే సిమ్ కార్డ్‌ని పొందేవారు. కానీ ఇప్పుడు ఈ సందర్భంలో దాని లాకింగ్ వ్యవధిని పొడిగించారు. ఇప్పుడు వినియోగదారులు 7 రోజులు వేచి ఉండాల్సి ఉంటుంది. దీని తర్వాత మాత్రమే వినియోగదారులు కొత్త సిమ్ కార్డును పొందుతారు. కొత్త రూల్ ప్రకారం, ఇటీవలి కాలంలో తమ సిమ్ కార్డులను మార్చుకున్న వ్యక్తులు తమ మొబైల్ నంబర్‌ను పోర్ట్ చేయలేరు. కస్టమర్‌లు 7 రోజుల తర్వాత ఈ పనిని చేయగలుగుతారు. అంటే MNP నియమాలలో మార్పు చేసిన తర్వాత మీరు తదుపరి ఏడు రోజుల తర్వాత మాత్రమే కొత్త సిమ్‌ కార్డ్‌ని పొందుతారు.

ఇది కూడా చదవండి: Union Budget 2024: బడ్జెట్‌ ప్రసంగంలో ఈ పదాల అర్థం మీకు తెలుసా? ఆసక్తికర విషయాలు

ఎందుకు నిర్ణయం తీసుకున్నారు?

ఒక్కోసారి సిమ్‌కార్డు చోరీకి గురైతే, ఆ నంబర్‌ను మరో సిమ్‌ కార్డులో యాక్టివేట్‌ చేసినట్లు పలు సందర్భాల్లో వెల్లడైంది. ఆ తర్వాత మరో సంఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు ఆన్‌లైన్ మోసాల వంటి సంఘటనలను నిరోధించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి మార్చిలో ట్రాయ్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పుడు Airtel, Vodafone Idea, Reliance Jio లాంటి యూజర్లు అప్రమత్తంగా ఉండాలి.

ఇది కూడా చదవండిIRCTC: ఐఆర్‌సీటీసీ ఖాతా నుంచి ఇతరులకు టికెట్లు బుక్‌ చేస్తే మీకు జైలు శిక్ష పడుతుందా? ఇదిగో క్లారిటీ

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి