AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: పీఎం కిసాన్ డబ్బులు పోస్టాఫీసు నుంచి కూడా తీసుకోవచ్చు!

ఇటీవల విడుదలైన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఏడాదికి రూ.6000 చొప్పున మూడు విడతల్లో 2000లు విడదల చేస్తోంది కేంద్రం. అయితే కిసాన్ సమ్మాన్ నిధి గ్రహీతలకు మరో ఉపశమనం ఏమిటంటే, ఇప్పుడు వారు పోస్టల్ శాఖ ద్వారా కూడా డబ్బులు తీసుకోవచ్చు. ఆసక్తి ఉన్న రైతులు ఈ మొత్తాన్ని పోస్టల్‌ శాఖ ద్వారా పొందవచ్చు..

PM Kisan: పీఎం కిసాన్ డబ్బులు పోస్టాఫీసు నుంచి కూడా తీసుకోవచ్చు!
Pm Kisan
Subhash Goud
|

Updated on: Jun 26, 2024 | 3:39 PM

Share

ఇటీవల విడుదలైన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఏడాదికి రూ.6000 చొప్పున మూడు విడతల్లో 2000లు విడదల చేస్తోంది కేంద్రం. అయితే కిసాన్ సమ్మాన్ నిధి గ్రహీతలకు మరో ఉపశమనం ఏమిటంటే, ఇప్పుడు వారు పోస్టల్ శాఖ ద్వారా కూడా డబ్బులు తీసుకోవచ్చు. ఆసక్తి ఉన్న రైతులు ఈ మొత్తాన్ని పోస్టల్‌ శాఖ ద్వారా పొందవచ్చు.

ఇందుకోసం రైతులు ఏ బ్యాంకు బ్రాంచ్‌ లేదా ఎటిఎంను సందర్శించాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ఇంట్లో కూర్చొని ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా దేశంలోని ఏ బ్యాంకులోనైనా మొబైల్ ఫోన్, ఆధార్ లింక్ చేసిన ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకు పోస్టల్ శాఖ ఎలాంటి రుసుము వసూలు చేయదని వారణాసి ప్రయాగ్‌రాజ్‌ రీజియన్‌ పోస్ట్‌ మార్టర్‌ కెకె యాదవ్‌ తెలిపారు.

ఇది కూడా చదవండి: Budget 2024: రాబోయే బడ్జెట్‌లో మోడీ సర్కార్‌ శుభవార్త.. రైతుల ఖాతాల్లో రూ.8 వేలు?

సన్న, చిన్నకారు భూములున్న రైతుల సంఖ్య దేశంలోనే అత్యధికమని అధికారులు చెబుతున్నారు. పరిమిత ఆదాయం కారణంగా, అనేక సార్లు ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఈ రైతులు వ్యవసాయంలో అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. రైతులు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఈ సమస్యల దృష్ట్యా, భారత ప్రభుత్వం 2 ఫిబ్రవరి 2019న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రారంభించింది.

ఇది కూడా చదవండి: IRCTC: ఐఆర్‌సీటీసీ ఖాతా నుంచి ఇతరులకు టికెట్లు బుక్‌ చేస్తే మీకు జైలు శిక్ష పడుతుందా? ఇదిగో క్లారిటీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జూన్ 18, 2024న తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిని సందర్శించిన సందర్భంగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా ప్రధానమంత్రి-కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత రూ.20,000 కోట్లకు పైగా విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 92.6 మిలియన్ల లబ్ధిదారులకు ఈ సాయాన్ని పొందారు. ఈ పథకం కింద నమోదిత చిన్న భూమి కలిగిన రైతుల కుటుంబాలందరికీ ఇది సంవత్సరానికి రూ.6,000 లేదా మూడు సమాన వాయిదాలలో రూ.2,000 ఆదాయ మద్దతును అందిస్తుంది.

ఇది కూడా చదవండి: SBI: కస్టమర్లకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శుభవార్త.. అదేంటో తెలుసా..?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి