AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దూసుకెళ్తున్న వెండి ధర.. కొన్ని రోజుల్లోనే డబుల్‌ అయ్యే ఛాన్స్‌..! 2026 నాటికి కిలో వెండి కొనాలంటే..

వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కిలో రూ.1,14,000లు ఉండగా, 2026 నాటికి రూ.2 లక్షలు దాటే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. డిమాండ్‌ పెరుగుదలతో సరఫరా తగ్గుతుండటం దీనికి కారణం. వెండి ఆభరణాలపై డిమాండ్‌ ఎక్కువగా ఉంది.

దూసుకెళ్తున్న వెండి ధర.. కొన్ని రోజుల్లోనే డబుల్‌ అయ్యే ఛాన్స్‌..! 2026 నాటికి కిలో వెండి కొనాలంటే..
Silver
SN Pasha
|

Updated on: Jul 17, 2025 | 1:50 PM

Share

భారతీయులు బంగారం తర్వాత అంతగా ఇష్టపడేది, కొనుగోలు చేసేది ఏదైనా ఉందంటే అంది వెండి. నిజానికి బంగారం కంటే ఎక్కువ మోతాదులోనే వెండి ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. ఆభరణాలు, వస్తువుల కోసం వెండికి విపరీతమైన డిమాండ్‌ ఉంది. అలాగే ఈ లోహాన్ని పలు పరిశ్రమల్లో, పలు రకాల వస్తువుల తయారీలో కూడా ఉపయోగిస్తుంటారు. అలా వెండి వాడకం బాగా పెరిగి.. మెల్లమెల్లగా దాని డిమాండ్‌కు సప్లయ్‌కి మధ్య తేడా వచ్చేస్తోంది.

డిమాండ్‌ తగ్గ సప్లయ్‌ ఉండటం లేదు. దీంతో ఆటోమేటిక్‌గా వెండి ధర పెరుగుతోంది. అది కూడా చాలా వేగంగా పెరుగుతోంది. మొన్నీమధ్యే రూ.లక్ష దాటిన కిలో వెండి ధర ఇప్పుడు రూ.1,14,000లకు చేరింది. ఇలాగే చూస్తుంటే.. 2026 నాటికి కిలో వెండి రూ.2 లక్షలు కావడం ఖాయమంటున్నారు ఆర్థిక నిపుణులు. ప్రస్తుతం వెండి ధర ఒక లక్షా 14 వేలకు చేరడంతో.. ఇదే వేగంతో స్వల్పంలోనే ఒక లక్షా 40 వేలకు చేరుతుందని నిపుణులు అంటున్నారు. ఇది కేవలం స్వల్పకాలిక లక్ష్యం మాత్రమే. అంత కంటే ఎక్కువ కూడా పెరగొచ్చు.

అలాగే 2026 నాటికి సులభంగా కిలో వెండి రూ.2 లక్షలు అందుకుంటుందని అంచనా. పైగా 2026 ఏడాదికి మరో 5 నెలల సమయం మాత్రమే ఉంది. ఈ ఐదు నెలల్లో వెండి ధర డబుల్‌ అవ్వడం ఖాయం అంటున్నారు ఆర్థిక నిపుణులు. అదే జరిగితే.. వెండి కూడా బంగారం అంత ప్రియం అయినట్లే. వెండే బంగారమాయేనే.. పరిస్థితి మారొచ్చు. వెండి కొనాలి అనుకునే వాళ్లు ఇప్పుడు కొనడం మంచిది. అలాగే వెండిలో పెట్టుబడి పెట్టాలి అనుకునేవాళ్లకు కూడా ఇదే మంచి సమయంగా నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్