బుల్ మార్కెట్ దూకుడు.. సెన్సెక్స్ కి కలిసొచ్చిన కార్తీక సోమవారం
ఆసియా మార్కెట్ల జోరు.. ప్రపంచ దేశాల ఆశావహ ఆర్ధిక వృద్ది రేటు సెన్సెక్స్ పై మంచి ప్రభావాన్ని చూపాయి. ఆసియా మార్కెట్ల తోడ్పాటుతో బాటు రెండో త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా ఉండడం వల్ల కూడా స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్ ఓ దశలో 40,434 పాయింట్ల సరికొత్త గరిష్ట స్థాయికి చేరింది. నిఫ్టీ 89.95 పాయింట్లకు పెరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 150 పాయింట్ల లాభంతో 483. 21 పాయింట్ల […]
ఆసియా మార్కెట్ల జోరు.. ప్రపంచ దేశాల ఆశావహ ఆర్ధిక వృద్ది రేటు సెన్సెక్స్ పై మంచి ప్రభావాన్ని చూపాయి. ఆసియా మార్కెట్ల తోడ్పాటుతో బాటు రెండో త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా ఉండడం వల్ల కూడా స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్ ఓ దశలో 40,434 పాయింట్ల సరికొత్త గరిష్ట స్థాయికి చేరింది. నిఫ్టీ 89.95 పాయింట్లకు పెరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 150 పాయింట్ల లాభంతో 483. 21 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా.. 54 పాయింట్లు పెరిగిన ఎన్ ఎస్ టీ నిఫ్టీ 11,900 పాయింట్ల వద్ద ట్రేడయింది. జె.ఎస్.డబ్ల్యు స్టీల్, ఇన్ ఫోసిస్, భారతీ ఇన్ ఫ్రాటెల్, టాటా స్టీల్, వేదాంత 4.8 శాతానికి, 5.3 శాతానికి మధ్య ట్రేడవుతున్నాయి. ఇన్ ఫో సిస్ షేర్లు 6.47 శాతం పెరిగాయి. ఇన్ ఫో సిస్ తో బాటు ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్ సెన్సెక్స్ లో టాప్ కంట్రిబ్యూటర్లు అయ్యాయి. వాల్డ్ ఎకనామిక్ గ్రోత్ ఆశావహంగా ఉండడమే కాక, కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా పుంజుకోవడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పెరిగిందని ఎనలిస్టులు భావిస్తున్నారు.