Stock Market: పెరుగుతోన్న ముడి చమురు ధర.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ముడి చమురు ధర పెరుగుదలతో బుధవారం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. BSE సెన్సెక్స్ 304 పాయింట్లు పతనమై 57,685 వద్ద ముగిసింది. NSE నిఫ్టీ 70 పాయింట్లు నష్టపోయి 17,246 వద్ద స్థిరపడింది..

Stock Market: పెరుగుతోన్న ముడి చమురు ధర.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
Stock Market
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Mar 23, 2022 | 6:16 PM

ముడి చమురు ధర పెరుగుదలతో బుధవారం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. BSE సెన్సెక్స్ 304 పాయింట్లు పతనమై 57,685 వద్ద ముగిసింది. NSE నిఫ్టీ 70 పాయింట్లు నష్టపోయి 17,246 వద్ద స్థిరపడింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.55 శాతం పెరిగింది. స్మాల్ క్యాప్ 0.21 శాతం చొప్పున తగ్గింది. నిఫ్టీ ఆటో 1.04, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.88 శాతం వరకు పడిపోయాయి. అయితే నిఫ్టీ మెటల్ 1.21, నిఫ్టీ ఫార్మా 0.42 శాతం వరకు పెరిగాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ టాప్ నిఫ్టీ లూజర్‌గా నిలిచింది. ఆ స్టాక్ 2.61 శాతం తగ్గి రూ. 1,760.75కి చేరుకుంది. హెచ్‌డిఎఫ్‌సి, బ్రిటానియా, భారతీ ఎయిర్‌టెల్, సన్ ఫార్మా నష్టాల్లో ముగిశాయి.

కంపెనీ ప్రాంగణంలో ఆదాయపు పన్ను (ఐ-టి) విభాగం సోదాలు ప్రారంభించిన తర్వాత హీరో మోటోకార్ప్ షేర్లు 1.22 శాతం పడిపోయి రూ. 2,394కి చేరుకున్నాయి. పన్ను ఎగవేతపై హీరో మోటోకార్ప్ ఛైర్మన్ పవన్ ముంజాల్, కంపెనీకి చెందిన ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల ఆఫీస్‌ల్లో సోదాలు జరిగాయి. 1,467 కంపెనీల షేర్లు పెరగ్గా.. 1,927 కంపెనీల షేర్లు తగ్గాయి. టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్, ఐటీసీ, పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాల్లో ముగిశాయి. పేటీఎం షేరు ఈరోజు 4 శాతం మేర పడి రూ.521 వద్ద జీవితకాల కనిష్ఠానికి చేరింది.

రష్యా-ఉక్రెయిన్ వివాదం నేపథ్యంలో ముడి చమురు ధర పెరుగుతూ పోతోంది. బ్రెంట్ బ్యారెల్ చమురు ధర 117 డాలర్లకు చేరుకుంది. యూకేలో వార్షిక ద్రవ్యోల్బణం 6.2 శాతంగా నమోదవడం కూడా మార్కెట్‌పై ప్రభావం చూపింది. బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ ఈరోజు రూ.32.62 వేల కోట్లు తగ్గి రూ.2,59,95,316.89 కోట్లకు చేరింది.

Read Also.. Toothpaste: ఆ వ్యాపార ప్రకటనలపై నిషేధం.. తప్పుదారి పట్టించేలా ఉన్నాయంటూ జరిమానా

పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..