AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్లు.. ఆయిల్, మెటల్, బ్యాంక్‌ స్టాక్‌ల్లో క్షీణత..

స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో కొనసాగుతోంది. ఉదయం 9:40 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 129 పాయింట్లు నష్టపోయి 51,192 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 71 పాయింట్లు పతనమై 15,219 వద్ద కొనసాగుతోంది...

Stock Market: నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్లు.. ఆయిల్, మెటల్, బ్యాంక్‌ స్టాక్‌ల్లో క్షీణత..
Stock Market
Srinivas Chekkilla
|

Updated on: Jun 20, 2022 | 12:41 PM

Share

స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో కొనసాగుతోంది. ఉదయం 9:40 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 129 పాయింట్లు నష్టపోయి 51,192 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 71 పాయింట్లు పతనమై 15,219 వద్ద కొనసాగుతోంది. మిడ్‌ క్యాప్‌ 1.62, స్మాల్‌ క్యాప్‌ 1.86 శాతం పోడిపోయాయి. సబ్‌ ఇండెక్స్‌ల్లో నిఫ్టీ బ్యాంక్ 0.54, నిఫ్టీ ఐటీ 0.54 శాతం తగ్గాయి. ముఖ్యంగా ఆయిల్‌, మెటల్‌ స్టాక్‌ల్లో పతనం కొనసాగుతోంది. వేదాంత షేరు 6 శాతం పడిపోయింది. శుక్రవారం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. నేడు ఆసియా పసిఫిక్‌ సూచీలు తొలి సెషన్‌ లాభాలను కోల్పోయాయి. మరోవైపు అమెరికా ఫ్యూచర్స్‌ నష్టాల్లో ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.77.92 వద్ద కొనసాగుతోంది.

సన్‌ ఫార్మా నిఫ్టీ టాప్‌ గెయినర్‌గా ఉంది. ఈ స్టాక్‌ 1.53 శాతం పెరిగి రూ.805.50 వద్ద కొనసాగుతోంది. బీఎస్‌ఈ-30లో హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్‌, సన్‌ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఏసియన్‌ పెయింట్స్‌, డా. రెడ్డీస్, విప్రో, అల్ట్రా టెక్‌ సిమెంట్ లాభాల్లో ఉన్నాయి. టాటా స్టీల్‌, పవర్‌ గ్రిడ్‌, ఎం&ఎం, L&T, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. శుక్రవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 135 పాయింట్లు పతనమై 51,360.42 వద్ద ముగియగా.. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 67 పాయింట్లు కోల్పోయి 15,293.50 వద్ద స్థిరపడింది. ఇటీవల స్టాక్‌ మార్కెట్‌లలో నమోదైన ఈ-ముద్ర మార్చి 2022తో ముగిసిన త్రైమాసికపు లాభాల్లో 62.2 శాతం వృద్ధిని నమోదు చేసింది.

పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్