Vande Bharat Express: తెలుగు రాష్ట్రాలకు మరో వందేభారత్ రైలు.. వయా నల్గొండ, గుంటూరు మీదుగా.!
తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందేభారత్ రైలు పరుగులు పెట్టనుంది. శ్రీవారి భక్తులకు సౌలభ్యంగా కోసం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఈ ట్రైన్‌ను నడపనున్నారు..
తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందేభారత్ రైలు పరుగులు పెట్టనుంది. శ్రీవారి భక్తులకు సౌలభ్యంగా కోసం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఈ ట్రైన్‌ను నడపనున్నారు. ఏప్రిల్ 8వ తేదీన ఈ రైలును ప్రవేశపెట్టాలని సూత్రపాయంగా నిర్ణయం తీసుకుంది కేంద్ర రైల్వే శాఖ. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులకు సమాచారాన్ని అందించింది. ఇప్పటికే ఆయా నగరాల మధ్య ట్రయిల్ రన్ పూర్తి కాగా.. రూట్లు, ప్రయాణ సమయాలు, ఆగాల్సిన స్టేషన్లు, ఛార్జీలపై నివేదికను సమర్పించాలని కోరింది. ఇక వీటిపై సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కసరత్తులు చేస్తున్నారు.
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే వందేభారత్ రైలును వయా నల్గొండ, బీబీనగర్, గుంటూరు మీదుగా నడపనున్నారని తెలుస్తోంది. మొదటి వందేభారత్ ట్రైన్(సికింద్రాబాద్ టూ వైజాగ్) విజయవాడ మీదుగా వరంగల్, ఖమ్మంలను కలుపుతూ వెళ్తుండటంతో.. రెండో రైలును మిర్యాలగూడ, నల్గొండ, గుంటూరు ప్రయాణికులకు కనెక్టివిటీని అందించాలని రైల్వేశాఖ భావిస్తోంది. ప్రస్తుతం, సికింద్రాబాద్ – త్రివేండ్రం శబరి ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి – తిరుపతి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ గుంటూరు మీదుగా తిరుపతికి పరుగులు పెడుతున్నాయి. వీటి ప్రయాణ సమయంలో దాదాపు 12 గంటలు. ఇక వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణ సమయాన్ని 8 గంటల్లో గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్‌కు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టాప్‌లుగా ఉండే అవకాశం ఉంది. కాగా, వందేభారత్ రైలు రూట్‌పై క్లారిటీ వచ్చిన తర్వాతే.. దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..