SBI Home Loans: ఖాతాదారులకు ఎస్‌బీఐ పండగ ఆఫర్.. హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లు తగ్గింపు.. ఎంతంటే..
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. పండుగల నేపథ్యంలో ఖాతాదారులకు శుభ వార్త తెలిపింది. హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్న వారికి...
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. పండుగల నేపథ్యంలో ఖాతాదారులకు శుభ వార్త తెలిపింది. హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్న వారికి వడ్డీ రేట్లపై రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. 2023 జనవరి 31 వరకు హౌజ్ లోన్స్ తీసుకునే వారికి వడ్డీ రేటుపై 1.15 నుంచి 1.05 శాతం రాయితీ ఇవ్వనున్నారు. ఖాతాదారుల సిబిల్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. ప్రస్తుతం ఎస్‌బీఐలో హౌజ్ లోన్స్‌పై వడ్డీ రేట్లు 8.55 నుంచి 9.05 వరకు ఉండగా, ఆఫర్‌లో భాగంగా 8.40 నుంచి 9.05 శాతానికి తగ్గనుంది.
* సిబిల్ స్కోర్ 800 అంతకంటే ఎక్కువ ఉన్న వారికి ప్రస్తుతం 8.55 శాతం వడ్డీ రేటుకు రుణాలు అందిస్తున్నారు. అయితే ఆఫర్‌లో భాగంగా 8.40కే లభిస్తుంది. ఇది సాధారణ రేటుతో పోల్చితే 15 బేసిస్ పాయింట్లు తక్కువగా ఉంటుంది.
* ఇక సిబిల్ 750 నుంచి 799 వరకు ఉన్న వారికి సాధారణంగా 8.68 శాతం వడ్డీ రేటు ఉండగా, ఆఫర్‌లో భాగంగా 8.4 శాతిని తగ్గించారు.
* సిబిల్ స్కోర్ 700 నుంచి 749 మధ్య ఉన్న ఖాతాదారులకు వడ్డీ రేటు సాధారణంగా 8.75 శాతంగా ఉండగా ఆఫర్‌లో 8.55 శాతానికే పొందొచ్చు.
* ఇక తనాఖా పెట్టి లోన్ తీసుకున్న వారికి వడ్డీ రేటులో గరిష్టంగా 0.3 శాతం రాయితీ ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఈ రుణాలపై 10.3 శాతం వడ్డీ రేటు ఉండగా, ఆఫర్‌లో భాగంగా 10 శాతానికి పొందొచ్చు.
* వీటితో పాటు రెగ్యులర్, టాప్‌అప్ గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును కూడా ఎస్‌బీఐ మినహాయించింది. అయితే తనాఖా రుణాలపై మాత్రం రూ. 10 వేలలతో పాటు జీఎస్‌టీనీ వసూలు చేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..