IRCTC: హనీమూన్ ప్లాన్ చేసుకునేవారికి గుడ్ న్యూస్…ఏడు రాత్రులు..ఎనిమిది రోజుల స్పెషల్ ప్యాకేజీ..
హనీమూన్ ప్యాకేజీతో IRCTC తన టూర్ ప్యాకేజీ ద్వారా ప్రధాన హిమాలయ పర్యాటక ప్రాంతాలైన సిమ్లా, కులు-మనాలికి ఏడు రాత్రులు, ఎనిమిది రోజుల విహారయాత్రను మీ ముందుకు తెచ్చింది.
కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు హానీమూన్ ప్లాన్ చేసుకుంటుంటారు. అందుబాటు ధరలో సమీపంలో ఉండే బ్యూటీఫుల్ ప్లేస్ ఎంపికలో కేరళను ఎక్కువ మంది ఎంచుకుంటారు. కేవలం హానీమూన్ ఒక్కటే కాదు..పెళ్లికి ముందు ఫోటో షూట్లకు కూడా కేరళ ప్రసిద్ధి. ఎందుకంటే కేరళ..గాడ్స్ ఓన్ కంట్రీగా చెబుతారు. మరి మీరు కూడా హనీమూన్ ప్లాన్ చేసుకుంటున్నారా? ఐఆర్‌సీటీసీ హనీమూన్ ప్యాకేజీ ఆఫర్ చేస్తోంది. 7 రాత్రులు, 8 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.
IRCTC తిరువనంతపురం నుండి గొప్ప హనీమూన్ ప్యాకేజీతో IRCTC తన టూర్ ప్యాకేజీ ద్వారా ప్రధాన హిమాలయ పర్యాటక ప్రాంతాలైన సిమ్లా, కులు-మనాలికి ఏడు రాత్రులు, ఎనిమిది రోజుల విహారయాత్రను పరిచయం చేసింది. తిరువనంతపురం నుండి విమానంలో పర్యటన ప్రారంభమవుతుంది. IRCTC ఈ మూడు హిమాలయన్ టూరిజం డెస్టినేషన్‌ల ద్వారా ప్యాకేజీ టూర్ కోసం ఒక్కొక్కరికి రూ.66,350 వసూలు చేస్తుంది. ఈ ప్యాకేజీలో మొత్తం 30 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
టూర్ ప్యాకేజీ వివరాలు.. ఈ ప్రయాణం నవంబర్ 11, 2022న ప్రారంభమవుతుంది. IRCTC తిరువనంతపురం నుండి చండీగఢ్‌కు విమానంలో చేరుకోవడానికి, రెండు హిమాలయ పర్యాటక కేంద్రాలకు బస్సు, రైలు సేవలను ఏర్పాటు చేస్తుంది. ఒక్కో వ్యక్తికి రూ.66,650 ఖర్చవుతుంది. ఇందులో విమానం, వసతి, ఇతర ప్రయాణం, టూర్ ఎస్కార్ట్, అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం (మూడు భోజనాలు శాఖాహారం), ప్రయాణ బీమా ఉంటాయి.
టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఎలా..? అన్న సందేహం వద్దు.. ఎందుకంటే, దీనిని IRCTC యొక్క పర్యాటక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి