SBI UPI service: ఎస్‌బీఐ కొత్త సర్వీస్ ప్రారంభం.. వినియోగదారుగా లేకపోయినా ప్రయోజనాలు
పేటీఎం, ఫోన్‌పే లేదా గూగుల్ పేలకు పోటీగా దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ మార్కెట్‌లోకి ప్రవేశించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. వారు నిరంతరం ఆన్‌లైన్‌లో లావాదేవీలు జరుపుతున్నారు. ఇప్పుడు ఆ బ్యాంకుకు కొత్త సర్వీస్..
పేటీఎం, ఫోన్‌పే లేదా గూగుల్ పేలకు పోటీగా దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ మార్కెట్‌లోకి ప్రవేశించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. వారు నిరంతరం ఆన్‌లైన్‌లో లావాదేవీలు జరుపుతున్నారు. ఇప్పుడు ఆ బ్యాంకుకు కొత్త సర్వీస్ తీసుకురాబోతోంది. ఈ సేవ బ్యాంక్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ యోనో నుంచి వస్తుంది. దీని ద్వారా ఆన్‌లైన్ చెల్లింపులు చేయవచ్చు. దేశంలోని అతిపెద్ద బ్యాంక్ ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్‌గా ప్రవేశించింది.
అయితే యోనో యాప్ ద్వారా సేవను పొందేందుకు ఎస్‌బీఐ కస్టమర్ కానవసరం లేదు. ఏదైనా పబ్లిక్ లేదా ప్రైవేట్ బ్యాంక్ కస్టమర్ అయి ఉండాలి. మీరు ఆ యాప్ యూపీఐ చెల్లింపు కోసం మాత్రమే పేరు, ఫోన్ నంబర్‌తో నమోదు చేసుకోవాలి. ఇతర యాప్‌ల మాదిరిగానే Yono యాప్ కూడా క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా చెల్లింపు, ఫోన్‌లోని ఏదైనా నంబర్‌కు చెల్లింపు వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
ఈ నెల ప్రారంభంలో యోనో యాప్‌లో కొన్ని మార్పులు జరిగాయి. ఈ యాప్‌ని ఐఫోన్‌లోని గూగుల్ పే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత రిజిస్టర్ నౌ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మీరు తదుపరి పేజీని తెరిచినప్పుడు అనేక ఆప్షన్లు కనిపిస్తాయి. మీరు యూపీఐ చెల్లింపు ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆపై మీ బ్యాంక్ ఖాతాతో రిజిస్ట్రర్ అయిన నంబర్‌ను నమోదు చేయండి. అప్పుడు మీ ఫోన్‌కి SMS వస్తుంది. నంబర్ ధృవీకరించబడిన తర్వాత యూపీఐ ఐడీని రూపొందించాలి. తర్వాత యూపీఐ ఐడీని బ్యాంక్ ఖాతాతో లింక్ చేయండి. అప్పుడు యథావిధిగా చెల్లింపు చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి