AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. వారి కోసం ప్రత్యేక ఫుడ్‌ కౌంటర్ల ఏర్పాటు!

ఇండియన్‌ రైల్వే ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను కల్పిస్తోంది. ప్రయాణికులు ఇబ్బందులకు గురవకుండా మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తోంది రైల్వే. అయితే ప్రయాణికుల కోసం కీలక నిర్ణయం తీసుకుందని ఇండియన్‌ రైల్వే. తక్కువ ధరల్లోనే ప్రయాణికులకు..

Indian Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. వారి కోసం ప్రత్యేక ఫుడ్‌ కౌంటర్ల ఏర్పాటు!
Indian Railways
Subhash Goud
|

Updated on: Jul 19, 2023 | 10:53 PM

Share

ఇండియన్‌ రైల్వే ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను కల్పిస్తోంది. ప్రయాణికులు ఇబ్బందులకు గురవకుండా మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తోంది రైల్వే. అయితే ప్రయాణికుల కోసం కీలక నిర్ణయం తీసుకుందని ఇండియన్‌ రైల్వే. తక్కువ ధరల్లోనే ప్రయాణికులకు ఫుడ్‌, నీటి సదుపాయం కల్పించే దిశగా నిర్ణయం తీసుకుంది. జనరల్‌ కోచ్‌ల్లో ప్రయాణించే వారి కోసం ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. రైలు ఆయా స్టేషన్‌లలో నిలిపే చోట ప్లాట్‌ఫామ్‌పై ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచనున్నట్లు భారత రైల్వే తెలిపింది.

అయితే జనరల్‌ కోచ్‌ ఆహార పదార్థాలను రెండు కేటగిరిలుగా విభజించింది. 7 పూరీలు, ఆలూ ఫ్రై, అవకాయ పికిల్‌తో కూడిన ప్యాక్‌ను కేవలం 20 రూపాయలకే అందించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇక రెండో కేటగిరి విషయానికొస్తే ఫుడ్‌ను 50 రూపాయలకు అందించనుంది. ఈ ఫుడ్‌ ప్యాక్‌లో అన్నం, కిచిడీ, రాజ్మా, పావ్‌ బాజీ, దోశ వంటివి ఉంటాయి. అయితే ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్‌ చేసుకోవచ్చు. ఇందులో వాటర్‌ బాటిల్‌ కూడా ఉంటుంది. అయితే తక్కువ ధరల్లోనే ప్రయాణికులకు ఆహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన కౌంటర్లను ఏర్పాటు చేయనుంది. జనరల్‌ కోచ్‌లు ఉన్న రైళ్లలో రిజర్వేషన్‌ చేసుకోలేని వారు ప్రయాణిస్తుంటారు. అలాంటి వారి కోసం ఈ సదుపాయాన్ని అందించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అయితే ముందుగా ఈ సేవలను ఆరు నెలల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం ఈ సేవలు 51 రైల్వే స్టేషన్‌లలో ఏర్పాటు చేసింది రైల్వే. రానున్న రోజుల్లో మరిన్ని స్టేషన్‌లలో ఈ సేవలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది రైల్వే.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్