SBI FD Interest Rates: మీరు ఎస్‌బీఐ ఖాతాదారులా..? ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను ప్రకటించిన బ్యాంక్.. వివరాలు..

SBI Fixed Deposit Interest Rates: బ్యాంకులు వడ్డీ రేట్లను సవరిస్తుంటాయన్న సంగతి తెలిసిందే. అయితే.. వడ్డీ రేట్లు తగ్గొచ్చు లేదా పెరగొచ్చు. ఒక్కోసారి పాత వడ్డీ రేట్లనే

SBI FD Interest Rates: మీరు ఎస్‌బీఐ ఖాతాదారులా..? ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను ప్రకటించిన బ్యాంక్.. వివరాలు..
SBI FD Interest Rates
Follow us

|

Updated on: Apr 22, 2021 | 4:02 PM

SBI Fixed Deposit Interest Rates: బ్యాంకులు వడ్డీ రేట్లను సవరిస్తుంటాయన్న సంగతి తెలిసిందే. అయితే.. వడ్డీ రేట్లు తగ్గొచ్చు లేదా పెరగొచ్చు. ఒక్కోసారి పాత వడ్డీ రేట్లనే బ్యాంకులు కొనసాగిస్తుంటాయి. దీనికోసం ఆయా బ్యాంకుల ఖాతాదారులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై తరచూ వడ్డీ రేట్లను చెక్ చేసుకుంటుంటారు. అయితే.. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పిక్స్‌డ్ డిపాజిట్లపై 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు వడ్డీ రేట్లు వేర్వేరు విధంగా ఉంటాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్ కోసం ఎంచుకున్న కాలాన్ని బట్టి వడ్డీ జమవుతుంటుంది. సీనియర్ సిటిజన్లకు అరశాతం వడ్డీ ఎక్కువ వస్తుంది. అయితే.. ఈ వడ్డీని నెలకు, మూడు నెలలకు, ఆరు నెలలకు, ఏడాదికి ఓసారి పొందవచ్చు. ఎప్పటికప్పుడు ఎస్‌బీఐ తన అధికారిక వెబ్‌సైట్ sbi.co.in లో తాజా వడ్డీ రేట్లను ప్రకటిస్తూ ఉంటుంది. దానిలో భాగంగా ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను ప్రకటించింది. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై ఉన్న తాజా వడ్డీ రేట్ల గురించి తెలుసుకోండి.

ఎస్‌బీఐలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు..

7 రోజుల నుంచి 45 రోజుల వరకు- 2.9 శాతం, 46 రోజుల నుంచి 179 రోజులు- 3.9 శాతం 180 రోజుల నుంచి 210 రోజులు- 4.4 శాతం 211 రోజుల నుంచి 1 ఏడాది లోపు- 4.4 శాతం ఏడాది నుంచి రెండేళ్లు- 5 శాతం రెండేళ్ల నుంచి మూడేళ్లు- 5.1 శాతం మూడేళ్ల నుంచి ఐదేళ్లు- 5.3 శాతం ఐదేళ్ల నుంచి పదేళ్లు- 5.4 శాతం వడ్డీ రేటుగా ప్రకటించింది.

కాగా.. ఎస్‌బీఐలో సీనియర్ సిటిజన్లకు అర శాతం వడ్డీ అదనంగా లభిస్తుంది. అంటే సాధారణ ఖాతాదారులకు లభించే వడ్డీ కన్నా 50 బేసిస్ పాయింట్స్ వడ్డీ అదనంగా పొందవచ్చు. సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేట్లు.. 7 రోజుల నుంచి 45 రోజులు- 3.4 శాతం, 46 రోజుల నుంచి 179 రోజులు- 4.4 శాతం, 180 రోజుల నుంచి 210 రోజులు- 4.9 శాతం, 211 రోజుల నుంచి 1 ఏడాది లోపు- 4.9 శాతం, ఏడాది నుంచి రెండేళ్లు- 5.5 శాతం రెండెళ్ల నుంచి మూడేళ్లు- 5.6 శాతం, మూడేళ్ల నుంచి ఐదేళ్లు- 5.8 శాతం, ఐదేళ్ల నుంచి పదేళ్లు- 6.2 శాతంగా ఎస్‌బీఐ ప్రకటించింది.

Also Read:

Covid-19: పరిస్థితి అల్లకల్లోలంగా మారింది.. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.. కేంద్రంపై ‘సుప్రీం’ ఆగ్రహం..

బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి