Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI: పదేళల్లో మీ డబ్బులు డబుల్‌.. ఎస్‌బీఐ నుంచి అదిరిపోయే స్కీమ్‌..

పదేళ్లపాటు ఇన్వెస్ట్‌ చేస్తే మీరు పెట్టిన పెట్టుబడికి డబుల్ పొందొచ్చు. ఉదాహరణకు మీరు ఒకవేళ రూ. 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే పదేళ్లకు రూ. 21 లక్షల మొత్తాన్ని రిటర్న్‌ పొందొచ్చు. ఎస్‌బీఐ అందిస్తోన్న ఈ డిపాజిట్‌ పథకం సీనియర్‌ సిటీజన్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. 7 రోజుల నుంచి 10 ఏళ్ల వ్యవధి..

SBI: పదేళల్లో మీ డబ్బులు డబుల్‌.. ఎస్‌బీఐ నుంచి అదిరిపోయే స్కీమ్‌..
Sbi Scheme
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 10, 2024 | 7:57 PM

రిస్క్‌ లేకుండా రిటర్న్స్‌ పొందడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. మరీ ముఖ్యంగా సీనియర్‌ సిటీజన్స్‌ ఇలాంటి స్కీమ్‌కు ఎక్కువగా మోగుచూపుతుంటారు. ఇలాంటి వారి కోసమే ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మంచి పథకాన్ని అందిస్తోంది. ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేస్తే ఎలాంటి రిస్క్‌ లేకుండా మంచి ఆదాయం పొందొచ్చు.

పదేళ్లపాటు ఇన్వెస్ట్‌ చేస్తే మీరు పెట్టిన పెట్టుబడికి డబుల్ పొందొచ్చు. ఉదాహరణకు మీరు ఒకవేళ రూ. 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే పదేళ్లకు రూ. 21 లక్షల మొత్తాన్ని రిటర్న్‌ పొందొచ్చు. ఎస్‌బీఐ అందిస్తోన్న ఈ డిపాజిట్‌ పథకం సీనియర్‌ సిటీజన్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. 7 రోజుల నుంచి 10 ఏళ్ల వ్యవధి వరకు డిపాజిట్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇతరులతో పోల్చితే సీనియర్ సిటీజన్లకు 0.50 శాతం అధికంగా వడ్డీ లభిస్తుంది. ఒకవేళ 5 నుంచి 10 ఏళ్ల కాలవ్యవధికి డిపాజిట్ చేస్తే ఇతరుల కంటే 1 శాతం అధికంగా వడ్డీ లభిస్తుంది.

ఎస్‌బీఐ వెబ్‌సైట్ ప్రకారం.. సాధారణ పౌరులు 5 నుంచి 10 ఏళ్ల కాల వ్యవధికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 6.5 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. అదే సీనియర్‌ సిటిజన్లకు మాత్రం ఇదే కాల వ్యవధికి 7.5 శాతం వడ్డీ అందుతుంది. ఉదాహరణకు ఒక సీనియర్‌ సిటిజన్‌ రూ. 10 లక్షలను ఫిక్స్‌డ్‌ డిపాజిట్ చేశారనుకుందాం. 10 ఏళ్ల కాల వ్యవధికి ఎస్బీఐలో డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ అనంతరం 7.5 శాతం వడ్డీ లెక్కిస్తే మొత్తం 21 లక్షల 2 వేల 349 రూపాయలు చేతికి అందుతుంది.

అంటే కేవలం వడ్డీ రూపంలో వచ్చే ఆదాయం 11 లక్షల 2 వేల 349 రూపాయలు. గత ఏడాది డిసెంబర్ 27 నుంచి ఎస్బీఐ 2 కోట్ల కంటే తక్కువ ఉన్న డిపాజిట్లపై 0.25 శాతం వడ్డీ పెంచింది. ఎలాంటి రిస్క్‌ లేకుండా ఆదాయం పొందాలనుకునే వారికి ఇదొక బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇన్‌కంటాక్స్ చట్టం సెక్షన్ 80సి ప్రకారం 5 ఏళ్ల ఎఫ్‌డి‌పై ట్యాక్స్ మినహాయింపు కూడా ఉంటుంది. అయితే మీ ఎఫ్‌డిపై వచ్చే వడ్డీని ఆదాయం కింద పరిగణించి దానిపై ట్యాక్స్ విధిస్తుంది ఇన్‌కంటాక్స్ శాఖ. ట్యాక్స్ మినహాయింపు కోసం ఫామ్ 15జి లేదా ఫామ్ 15హెచ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..