SBI కస్టమర్లకు బంపర్ ఆఫర్.. లోన్ ఈఎంఐ కట్టలేని వారి కోసం బ్యాంక్ కీలక నిర్ణయం..
దేశీయ అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఎస్బీఐ తన కస్టమర్లకు సరికొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తుంది.
దేశీయ అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఎస్బీఐ తన కస్టమర్లకు సరికొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తుంది. అలాగే ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తుండడంతో.. ఈ మహమ్మారి కట్టడికి ఆయా రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. దీంతో అన్ని రంగాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ లాక్ డౌన్ ప్రభావం సామాన్యుల పై పడింది. ఉద్యోగాలు లేక.. నెలవారీ జీతం లేకుండా.. ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే లోన్ ఈఎంఐ కట్టలేక సతమతమవుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో ఎస్బీఐ తన కస్టమర్లకు శుభవార్త అందించింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 25 కోట్ల వరకు రుణాలను రీస్ట్రక్చర్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. దీంతో సాధారణ ప్రజలు, వ్యాపారులకు, ఎంఎస్ఎంఈలకు ఊరట కల్పిస్తోంది. అలాగే లోన్ ఈఎంఐ కట్టలేని వారు బ్యాంక్ బ్రాంచ్ వరకు వెళ్లి లోన్ రీస్ట్రక్చరింగ్ గురించి తెలుసుకోవచ్చు.అయితే బ్యాంక్ ఈ లోన్ రీస్ట్రక్చరింగ్ గురించి ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. దీంతో రుణ గ్రహీతలు బ్యాంకు అధికారులతో మాట్లాడి.. వారి రుణాలను రీస్ట్రక్చర్ చేసుకోవచ్చని తెలిపింది. ఇలా ఎస్బీఐ మాత్రమే కాకుండా.. ఇతర బ్యాంకు కస్టమర్లు కూడా వారి బ్యాంక్ బ్రాంచులకు వెళ్లి ఈ బెనిఫిట్ పొందవచ్చు. ఇందుకు సెప్టెంబర్ 30 చివరి తేదీగా తెలిపింది. అందుకే ప్రస్తుతం ఈఎంఐ కట్టలేని వారు మీ బ్యాంకు వెళ్లి లోన్ రీస్ట్రక్చరింగ్ గురించి పూర్తిగా తెలుసుకొని దరఖాస్తు చేసుకోవాలి..