Monsoon Hits: దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు.. ఏపీలో 3రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం

Southwest Monsoon: నైరుతి రుతుపవనాలు రెండో రోజులు ఆలస్యంగా కేరళను తాకగా.. తాజాగా దేశంలోని మరికొన్ని రాష్ట్రాల్లో ప్రవేశించాయని భారత వాతావరణ విభాగం..

Monsoon Hits: దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు.. ఏపీలో 3రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
Moonsoon
Follow us
Surya Kala

|

Updated on: Jun 04, 2021 | 5:42 PM

Southwest Monsoon: నైరుతి రుతుపవనాలు రెండో రోజులు ఆలస్యంగా కేరళను తాకగా.. తాజాగా దేశంలోని మరికొన్ని రాష్ట్రాల్లో ప్రవేశించాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. కేరళలోని మిగిలిన అన్ని ప్రాంతాలతో పాటు.. లక్షద్వీప్, దక్షిణ కర్ణాటక, ఉత్తర కర్ణాటకలోని పలు ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు ప్రవేశించాయని ఐఎండీ వివరించింది.

కాగా రాగల 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మహారాష్ట్ర , గోవా రాష్ట్రాలతో పాటు ఈశాన్య బంగాళాఖాతము మరియు ఈశాన్య భారతదేశంల లోని కొన్ని ప్రాంతాలలో .. దక్షిణ అరేబియా సముద్రం, కర్ణాటక, తమిళనాడుల లోని మిగిలిన అన్ని ప్రాంతాలలో; మధ్య అరేబియా సముద్రం, మధ్య బంగాళాఖాతం, ఆంధ్ర ప్రదేశ్ లలోని మరికొన్ని ప్రాంతాలలోనికి విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెప్పారు. అయితే రేపటికి ఏపీలోని రాయలసీమ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరిస్తాయని పేర్కొంది.

రాగాల మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తా ఆంధ్ర , యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. రేపు ఎల్లుండి కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Also Read: ఏసీబీ వలలో పాకాల సబ్ రిజిస్ట్రార్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు