MEIL Oxygen Plant: కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్‌కు “మేఘా” సాయం.. పెద్దాపురంలో ఆక్సిజన్ ప్లాంట్‌ పునరుద్ధరణ

ఆక్సిజన్ కొరత నివారణకు పటిష్ట చర్యలు చేపడుతోంది ఏపీ రాష్ట్ర సర్కార్. పురాతన ప్లాంట్‌ పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇందులో మేఘా సంస్థ కీలక భూమిక పోషిస్తోంది.

MEIL Oxygen Plant: కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్‌కు “మేఘా” సాయం.. పెద్దాపురంలో ఆక్సిజన్ ప్లాంట్‌ పునరుద్ధరణ
Meil Oxygen Plant At Peddapuram
Follow us

|

Updated on: Jun 04, 2021 | 6:06 PM

MEIL Oxygen Plant at Peddapuram: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణతో బాధితుల సంఖ్య గణనీయం నమోదవుతోంది. ఆసుపత్రుల్లో బెడ్స్‌కి తోడు ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దీంతో ఆక్సిజన్ కొరత నివారణకు పటిష్ట చర్యలు చేపడుతోంది ఏపీ రాష్ట్ర సర్కార్. పురాతన ప్లాంట్‌ పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇందులో మేఘా సంస్థ కీలక భూమిక పోషిస్తోంది.

కరోనా సెకండ్‌ వేవ్‌లో ఆక్సిజన్ కొరత ప్రజలను చాలా కష్ట పెట్టింది. ప్రాణ వాయువు అందక చాలా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ అనుభవం చాలా పాఠాలు నేర్పింది. అందుకే భవిష్యత్‌లో ఆక్సిజన్ కొరత అనే మాట లేకుండా చర్యలు తీసుకుంటున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. అలాంటి ముందస్తు చర్యల్లో పాత ప్లాంట్లను పునరుద్దరిస్తోంది ఆంధప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అలాంటి ప్రయత్నానికి సాయం చేసేందుకు ముందుకు వచ్చింది మేఘా సంస్థ.

ప్రస్తుతానికి ఆక్సిజన్ కొరత అంతగా లేకపోయినా మళ్లీ అలాంటి దుస్థితి రిపీట్ కాకుండా ఆంధ్రప్రదేశ్‌కు మేఘా సంస్థ సాయం చేస్తోంది. ఆక్సిజన్‌ కొరతను అధిగమించడానికి ఆక్సిజన్ ప్లాంట్లతోపాటు సరఫరా చేయడానికి అవసరమైన క్రయోజనిక్ ట్యాంకర్ల దిగుమతి చేసింది. అంతేనా… ప్రస్తుతం, భవిష్యత్‌లో ఆక్సిజన్ కొరత నివారణే లక్ష్యంకా కీ స్టెప్స్‌ వేసింది.

ఆంధ్రప్రదేశ్‌లోని పెద్దాపురంలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ను పునరుద్ధరణకు వేగంగా చర్యలు తీసుకుంటోంది. గంటకు 170 ఎం3…అంటే రోజుకు 5 మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి చేసే శక్తి ఈ ప్లాంట్‌కు ఉంది. అధికారుల అనుమతితో వెంటనే రంగంలోకి దిగిన మేఘా సిబ్బంది… ప్లాంట్‌కు కావాల్సిన ఎక్యూప్‌మెంట్‌ సిద్ధం చేసింది. ఎయిర్‌ కంప్రెషర్, పైపులు ఏర్పాటు చేసింది. ఎయిర్‌ సెపరేషన్ యూనిట్‌లో యూజ్‌ చేసే విడి భాగాల కోసం ఆర్డర్లు పెట్టింది.

పెద్దాపురం ప్లాంట్‌లో జూన్ 12 నుంచి ఆక్సిజన్ ఉత్పత్తి అయ్యేలా పనులను వేగవంతం చేసింది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన ప్రాంతాలకు సప్లై చేసేందుకు సింగపూర్‌ నుంచి క్రయోజనిక్‌ ట్యాంకులను కూడా తెప్పించింది మేఘా సంస్థ. మూడు ట్యాంకులను దిగుమతి చేసి ఏపీ ప్రభుత్వానికి ఉచితంగా అందజేసింది.

కాగా, దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో అయా రాష్ట్ర ప్రభుత్వాలకు చేయూతనందిస్తూ మానవత్వాన్ని చాటుకుంది మేఘా సంస్థ. ఇటు తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు రాష్ట్రానికి కూడా ఆక్సిజన్ సరఫరా చేసింది మేఘా సంస్థ.

Read Also…  Reliance Explores Drug: రిలయన్స్‌ మరో సంచలన నిర్ణయం.. కరోనాపై పోరుకు సరికొత్త డ్రగ్, చౌక ధరలో టెస్టింగ్‌ కిట్స్‌