AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covin App: ఇక నుంచి వ్యాక్సిన్ వేసుకొనేవారికి ఈజీ.. తెలుగులో కోవిన్‌ పోర్టల్‌

Covin App: భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ఓ యజ్ఞంలా కొనసాగుతోంది. ఐతే టీకా వేసుకోవాలంటే కోవిన్ పోర్టల్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయితే..

Covin App: ఇక నుంచి వ్యాక్సిన్ వేసుకొనేవారికి ఈజీ.. తెలుగులో కోవిన్‌ పోర్టల్‌
Cowin Portal
Surya Kala
|

Updated on: Jun 04, 2021 | 6:45 PM

Share

Covin App: భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ఓ యజ్ఞంలా కొనసాగుతోంది. ఐతే టీకా వేసుకోవాలంటే కోవిన్ పోర్టల్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయితే వ్యాక్సినేషన్‌లో ఎంతో కీలమైన కోవిన్‌ పోర్టల్‌ను కేంద్రం ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో టీకా పొందేందుకు కేంద్రం తీసుకువచ్చిన కోవిన్‌ పోర్టల్‌ ప్రజలకు మరింత చేరువకానుంది. ఇక నుంచి రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్‌లు మరింత ఈజీ కానున్నాయి. కోవిన్‌ పోర్టల్‌లో కొత్తగా తెలుగు,హిందీతో పాటు మొత్తం పది ప్రాంతీయ భాషలను అందుబాటులో ఉంచినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఇందులో తెలుగు సహా మరాఠీ, మలయాళం, పంజాబీ, గుజరాతీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ, ఒడియా, ఇంగీష్‌ భాషలు ఉన్నాయి.

ప్రస్తుతం 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేస్తున్నారు. ఇప్పటివరకు కోవిన్‌ పోర్టల్‌ కేవలం ఇంగ్లీష్‌ భాషలో ఉండడంతో.. ఆ భాష రాక చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్యమంత్రిత్వ శాఖ కోవిన్‌ పోర్టల్‌లో ఈ కీలక మార్పులు చేసింది. గత నెల 17న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ అధ్యక్షతన సమావేశమైన ఉన్నత మంత్రుల బృందం.. హిందీ సహా 14 భాషలను పోర్టల్‌లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పరీక్షించిన శాంపిల్స్ సంఖ్యను పెంచడానికి, మరింత ప్రాదేశిక విశ్లేషణకు అనుమతించడానికి 17 కొత్త ల్యాబరేటరీలను ఇన్సాకోగ్ నెట్‌వర్క్‌కు చేర్చబోతున్నామని హర్షవర్ధన్ తెలిపారు. ఈ నెట్‌వర్క్ ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 10 ల్యాబరేటరీల ద్వారా సేవలు అందిస్తోంది.

Also Read: రిలయన్స్‌ మరో సంచలన నిర్ణయం.. కరోనాపై పోరుకు సరికొత్త డ్రగ్, చౌక ధరలో టెస్టింగ్‌ కిట్స్‌..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!