Mutual Funds: ప్రతిరోజూ రూ. 100 పెట్టుబడితో మిలియనీర్ అయ్యే ఛాన్స్.. ఎలానో తెలుసా?
సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు. సిప్ ద్వారా, పెట్టుబడి పెట్టడానికి పెద్ద మొత్తం లేనివారు కూడా పెద్ద ఫండ్‌ను సృష్టించే ఛాన్స్ ఉంది.
Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ కీలకమైన పెట్టుబడికి తొలి ఎంపికగా మారుతున్నాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్కువగా పెట్టుబడి పెట్టడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. సిప్ ద్వారా, పెట్టుబడి పెట్టడానికి పెద్ద మొత్తం లేని వ్యక్తులు కూడా భారీ ఫండ్‌ను సృష్టించే అవకాశం ఉంది. గొప్ప రాబడిని ఇచ్చే కొన్ని మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ల గురించి ఈ రోజు తెలుసుకుందాం. అయితే దానికంటే ముందు, అసలు సిప్ అంటే ఏమిటో తెలుసుకుందాం.
సిప్ అంటే ప్రతీ నెలా కొంత మోతాదులో డబ్బును పెట్టుబడిగా పెట్టడం లాంటింది. అయితే ఇందులో పెట్టుబడిని ఎప్పుడైనా ఆపేయవచ్చు. తగ్గించవచ్చు. లేదా పెంచుకునే ఛాన్స్ ఉంది. సిప్‌ని నిలిపివేసిన తర్వాత కూడా మీరు అదే పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.
రోజుకు రూ. 100 ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు మిలియనీర్‌గా మారగల మార్గం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం మీరు ఈక్విటీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్‌లో సిప్ ద్వారా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈక్విటీ మార్కెట్‌లో ప్రతి నెలా రూ. 3 వేల పెట్టుబడిపై 10 నుంచి 15 శాతం రాబడిని పొందే అవకాశం ఉంది.
మీరు పూర్తి 30 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ. 3 వేలు పెట్టుబడి పెట్టాలి. అప్పుడు మీ మొత్తం పెట్టుబడి 10 లక్షల 95 వేల రూపాయలు అవుతుంది. మీరు పెట్టుబడి పెట్టిన డబ్బుపై సగటున 12 శాతం రాబడిని పొందారని అనుకుందాం. అప్పుడు మీకు మొత్తం రూ. 97.29 లక్షల రాబడి వస్తుంది. అంటే, మీరు ఏకమొత్తంగా 1.08 కోట్లు పొందుతారు.
చాలా సంవత్సరాలుగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ట్రాక్ రికార్డ్ చాలా ఆకట్టుకుంది. కొన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లు గత ఏడాది కాలంలో పెట్టుబడిదారులకు 100 శాతం కంటే ఎక్కువ రాబడిని ఇచ్చాయి.
Also Read: Hyderabad Home Prices: హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు అత్యధికంగా పెరిగాయి: నైట్ ఫ్రాంక్ నివేదిక
Bank Holidays January 2022: జనవరిలో బ్యాంకులకు సెలవులు.. ఎన్ని రోజులు అంటే..!
Year Ender 2021: ఈ ఏడాదిలో ఎక్కువ మంది గూగుల్‌లో సెర్చ్ చేసిన టాప్-9 బైక్‌లు ఇవే..!