Samsung Galaxy S25 FE ధర ఎంతో తెలుసా? పవర్‌ఫుల్ ఫీచర్స్.. భారీ డిస్కౌంట్!
Samsung Galaxy S25 FE: ఈ నెల ప్రారంభంలో భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఈ Samsung ఫోన్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఫోన్ ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రారంభించిన Galaxy S25 ఫ్యాన్ వెర్షన్. గత సంవత్సరం ప్రారంభించిన Galaxy S24 FEతో పోలిస్తే..

Samsung Galaxy S25 FE: భారతదేశంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Samsung Galaxy S25 FE ధర వెల్లడైంది. దక్షిణ కొరియా కంపెనీ ఇప్పుడు ఈ ఫోన్ భారతదేశ ధరను ప్రకటించింది. ఈ నెల ప్రారంభంలో భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఈ Samsung ఫోన్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఫోన్ ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రారంభించిన Galaxy S25 ఫ్యాన్ వెర్షన్. గత సంవత్సరం ప్రారంభించిన Galaxy S24 FEతో పోలిస్తే దీనికి అనేక అప్‌గ్రేడ్‌లు అందించింది కంపెనీ. భారతదేశంలో ఇది 8GB RAM+512GB వరకు స్టోరేజీతో వస్తుంవది.
ఇది కూడా చదవండి: Auto News: గుడ్‌న్యూస్.. మారుతి బెస్ట్ సెల్లింగ్ కార్లు.. రూ.86,000 తగ్గింపు.. ఈ కార్లపై లక్షల రూపాయలు ఆదా!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎఫ్ఈ ధర:
గెలాక్సీ S25 FE మూడు స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది. 8GB RAM + 128GB, 8GB RAM + 256GB, 8GB RAM + 512GB. దీనిని ఐసీబ్లూ, జెట్‌బ్లాక్, నేవీ, వైట్ రంగులలో కొనుగోలు చేయవచ్చు. భారతదేశంలో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 59,999. అదే సమయంలో దీని టాప్ వేరియంట్ రూ. 77,999 కు లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.5,000 తక్షణ తగ్గింపును అందిస్తున్నారు. అదే సమయంలో 512GB వేరియంట్ కొనుగోలుపై రూ.12,000 అప్‌గ్రేడ్ బోనస్ అందిస్తోంది. ఈ విధంగా వినియోగదారులు 256GB వేరియంట్ ధరకే 512GB వేరియంట్‌ను కొనుగోలు చేయగలరు.
ఇది కూడా చదవండి: Pension Scheme New Rule: అక్టోబర్ 1 నుండి కొత్త పెన్షన్ స్కీమ్ నియమాలు.. భారీ ప్రయోజనాలు!
Galaxy S25 FE ఫీచర్లు:
ఈ ఫోన్ 6.7-అంగుళాల FHD+ డిస్‌ప్లేతో వస్తుంది. దీనిలో డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz హై రిఫ్రెష్ రేట్ ఫీచర్‌కు మద్దతు ఇస్తుంది. కంపెనీ ఫోన్ డిస్‌ప్లేలో విజన్ బూస్టర్‌ను అందించింది. ఈ ఫోన్ Exynos 2400 ప్రాసెసర్‌తో నడుస్తుంది.
ఇది శక్తివంతమైన 4,900mAh బ్యాటరీతో 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌ను పొందుతుంది. అంతేకాకుండా ఇది వేగవంతమైన వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. దీనికి వైర్‌లెస్ పవర్ షేర్ ఫీచర్ ఉంది. ఇది OneUI 8పై పనిచేసే Android 16తో లాంచ్ అయిన శామ్‌సంగ్ మొట్టమొదటి ఫోన్. దీనితో పాటు కంపెనీ Google Gemini AI Pro ప్లాన్‌ను 6 నెలల పాటు ఉచితంగా అందిస్తోంది.
ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. దీనికి 50MP ప్రధాన కెమెరా ఉంది. అదనంగా 12MP అల్ట్రా-వైడ్, 8MP టెలిఫోటో కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో 12MP కెమెరా ఉంది.
ఇది కూడా చదవండి: Viral Video: చూస్తుండగానే చిన్నారిపై కుక్క దాడి.. క్షణాల్లో కాపాడిన తల్లి.. వీడియో వైరల్
ఇది కూడా చదవండి: Gold Price Today: తగ్గుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎంత తగ్గిందంటే..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








