AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auto News: గుడ్‌న్యూస్‌.. మారుతి బెస్ట్‌ సెల్లింగ్‌ కార్లు.. రూ.లక్షపైనే తగ్గింపు

Autgo News: మహీంద్రా & మహీంద్రా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ మోటార్, కియా ఇండియా, JSW MG మోటార్ ఇండియా, హోండా కార్స్ ఇండియా, రెనాల్ట్ ఇండియా, స్కోడా ఆటో ఇండియా, వోక్స్వ్యాగన్ ఇండియా వంటి కంపెనీలు కూడా ధర తగ్గింపుల రూపంలో..

Auto News: గుడ్‌న్యూస్‌.. మారుతి బెస్ట్‌ సెల్లింగ్‌ కార్లు.. రూ.లక్షపైనే తగ్గింపు
Subhash Goud
|

Updated on: Sep 19, 2025 | 1:47 PM

Share

దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, వస్తు, సేవల పన్ను (GST) రేటు మార్పుల ప్రయోజనాలను తన వినియోగదారులకు అందించింది. ఫలితంగా కంపెనీ స్విఫ్ట్, డిజైర్, బాలెనో, ఫ్రాంచైజ్, బ్రెజ్జాతో సహా అనేక కార్ల ధరలను రూ.1.10 లక్షల వరకు తగ్గించింది. మారుతి ప్రస్తుతం అత్యధికంగా అమ్ముడవుతున్న కారు డిజైర్ కూడా దాదాపు రూ.86,000 చౌకగా మారింది.

ఇది కూడా చదవండి: Viral Video: చూస్తుండగానే చిన్నారిపై కుక్క దాడి.. క్షణాల్లో కాపాడిన తల్లి.. వీడియో వైరల్‌

సెప్టెంబర్‌ 22వ తేదీ నుంచి కొత్త జీఎస్టీ అమలు కానుంది. మారుతి అరీనా, నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా కార్లను విక్రయిస్తుంది.

ఇవి కూడా చదవండి
కారు మోడల్ ధర తగ్గింపు
మారుతి సుజుకి ఆల్టో K10 రూ. 52,910
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో రూ. 52,143
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ రూ. 63,911
మారుతి సుజుకి సెలెరియో రూ. 62,845
మారుతి సుజుకి ఈకో రూ. 67,929
మారుతి సుజుకి స్విఫ్ట్ రూ. 80,966
మారుతి సుజుకి డిజైర్ రూ. 86,892
మారుతి సుజుకి బ్రెజ్జా రూ. 48,207
మారుతి సుజుకి ఎర్టిగా రూ. 46,224

వాహనాలపై పన్ను తగ్గింపు:

GST రేటు మార్పుల తరువాత అన్నివాహనాలపై పన్ను తగ్గింపు ఉంటుంది. అలాగే ఇంధనం, హైబ్రిడ్ కార్లు ఇప్పుడు 18%, 40% స్లాబ్‌లలోకి వస్తాయి. హ్యాచ్‌బ్యాక్‌లు, కాంపాక్ట్ సెడాన్‌లు, కాంపాక్ట్ SUVలు వంటి చిన్న కార్లు 18% GST పరిధిలోకి వస్తాయి. పెద్ద కార్లు, లగ్జరీ వాహనాలు 40% GST స్లాబ్‌లోకి వస్తాయి. ఈసారి ఎటువంటి సెస్ విధించరు.

కారు మోడల్ ధర తగ్గింపు
మారుతి సుజుకి ఇగ్నిస్ రూ. 69,240
మారుతి సుజుకి బాలెనో రూ. 80,667
మారుతి సుజుకి ఫ్రాంక్స్ రూ.1,10,384
మారుతి సుజుకి జిమ్నీ రూ. 51,052
మారుతి సుజుకి గ్రాండ్ విటారా రూ. 67,724
మారుతి సుజుకి XL6 రూ. 51,155
మారుతి సుజుకి ఇన్విక్టో రూ. 61,301

GST 1.0 విధానం ప్రకారం, ICE, హైబ్రిడ్ కార్లు 28% GSTకి లోబడి ఉన్నాయి. అదనంగా 1% నుండి 22% వరకు సెస్సు విధింపు ఉంది.ఈ సెస్సు వాహనం పొడవు, ఇంజిన్ సామర్థ్యం, వాహనం డిజైన్‌ ఆధారంగా నిర్ణయించారు. చిన్న కార్లు తక్కువ సెస్సుకు లోబడి ఉంటాయి. పెద్ద వాహనాలు అధిక సెస్సుకు లోబడి ఉంటాయి. తత్ఫలితంగా మొత్తం పన్ను 29% నుండి 50% వరకు ఉంటుంది.

ఈ కంపెనీలు ధరను తగ్గించాయి

మహీంద్రా & మహీంద్రా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ మోటార్, కియా ఇండియా, JSW MG మోటార్ ఇండియా, హోండా కార్స్ ఇండియా, రెనాల్ట్ ఇండియా, స్కోడా ఆటో ఇండియా, వోక్స్వ్యాగన్ ఇండియా వంటి కంపెనీలు కూడా ధర తగ్గింపుల రూపంలో GST ప్రయోజనాలను వినియోగదారులకు అందించాయి. మెర్సిడెస్-బెంజ్ ఇండియా, BMW గ్రూప్ ఇండియా, జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) ఇండియా, ఆడి ఇండియా, వోల్వో కార్ ఇండియా వంటి లగ్జరీ కార్ల తయారీదారులు కూడా అదే చేశారు.

ఇది కూడా చదవండి: Gold Price Today: తగ్గుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎంత తగ్గిందంటే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి