AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Off Road Cars: ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండే కార్లు! గుట్టల్లో కూడా దూసుకెళ్లొచ్చు!

మనదేశంలో రోడ్లు అంత సాఫీగా ఉండవు. అందుకే కారు కొనుగోలు చేసేటప్పుడు గ్రౌండ్ క్లియరెన్స్ అనే ఒక ముఖ్యమైన అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. గ్రౌండ్ క్లియరెన్స్  ఎక్కువగా ఉంటే బండి.. కఠినమైన రోడ్లు, గుంతలు, గుట్టల వంటి వాటిపై కూడా స్మూత్ గా వెళ్లగలుగుతుంది. అడ్వెంచర్ టూర్లు వేయడానికి , ఘాట్ రోడ్స్ పైన ఇవి అనుకూలంగా ఉంటాయి. మరి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బెస్ట్ గ్రౌండ క్లియరెన్స్ కార్లు ఏవో చూసేద్దామా?

Off Road Cars: ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండే కార్లు! గుట్టల్లో కూడా దూసుకెళ్లొచ్చు!
Offroad Cars
Nikhil
|

Updated on: Sep 19, 2025 | 1:08 PM

Share

కార్లలో రెండు రకాలు రెగ్యులర్, ఆఫ్ రోడ్.. రెగ్యులర్ అంటే రొడ్డు మీద స్మూత్ గా వెళ్లడానకి డిజైన్ చేసింది అని అర్థం. ఇక ఆఫ్ రోడ్ అంటే.. రాళ్లు రప్పల్లో కూడా దూసుకెళ్లే విధంగా డిజైన్ చేయబడినవి. ఇలా గతుకుల్లో కూడా వెళ్లాలంటే కారు ఛాసిస్ కింద స్పేస్ ఎక్కువ ఉండాలి. దీన్నే గ్రౌండ్  క్లియరెన్స్ అంటారు. మీకూ ఇలాంటి కార్లే నచ్చుతాయా? అయితే ఎక్కవ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న కార్ల లిస్ట్ ఓసారి చూద్దాం.

 మహింద్రా థార్..

మహీంద్రా థార్.. చాలా పాపులర్ ఆఫ్ రోడ్ వెహికల్. చూడ్డానికి స్టైలిష్ గా ఉండడమే కాకుండా ఎలాంటి రోడ్డులో స్మూత్ గా వెళ్లగలిగే వెహికల్ ఇది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 226 మి.మీ ఉంటుంది. ఈ వెహికల్ ధర రూ.11.25 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది 2.0-లీటర్ పెట్రోల్ లేదా 2.2-లీటర్ డీజిల్ ఇంజన్తో వస్తుంది.  6 -స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో పాటు ఆటోమేటిక్ వెర్షన్ కూడా ఉంది. ఇది 4×4 ,  4×2 ఆప్షన్స్ తో వస్తుంది. 4×4  అంటే.. ఇంజిన్ కు నాలుగు చక్రాలు లింక్ అయి ఉంటాయి. అంటే రేజ్ ఇచ్చినప్పుడు 4 చక్రాలు ఒకేసారి తిరుగుతాయి.

ఫోర్స్ గూర్ఖా

ఫోర్స్ కంపెనీ తయారుచేసిన ఆఫ్ రోడ్ వెహికల్ ఇది. దీని గురించి చాలామందికి తెలియదు. ఇది 233 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. మౌంటెన్స్, అటవీ ప్రాంతాల్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుస్తుంది.  దీని ధర రూ.15.10 లక్షల నుంచి మొదలవుతుంది. ఇది 2.6 -లీటర్ డీజిల్ ఇంజన్, 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 4×4 డ్రైవ్ ఆప్షన్ తో వస్తుంది. ఆఫ్ రోడ్ పర్ఫామెన్స్ విషయంలో ఇది థార్ కు గట్టి పోటీ ఇవ్వగలదు.

టయోటా ల్యాండ్ క్రూయిజర్ –

ప్రీమియం సెగ్మెంట్ లో బెస్ట్ ఆఫ్ రోడ్ వెహికల్ గా దీన్ని చెప్పుకోవచ్చు. ఇది 235 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన లగ్జరీ ఎస్ యూవీ. ఇది రోడ్డు, కొండ, గుట్ట అని లేదు.. ఎక్కడైనా సునాయాసంగా వెళ్లగలదు. పేరుకి తగ్గట్టే.. భూమి మీద ఎలాంటి ప్లేస్ కైనా దీన్ని తీసుకెళ్లొచ్చు. దీని ధర రూ. 2.10 కోట్ల నుంచి మొదలవుతుంది. ఇందులో 3.3-లీటర్ డీజిల్ లేదా 4.0-లీటర్ పెట్రోల్ ఇంజన్, 10 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో వస్తుంది.

టయోటా ఫార్చూనర్

ఇది చాలా పాపులర్ ఎస్ యూవీ. అయితే దీన్ని చాలామంది రెగ్యులర్ పర్పస్ కే వాడుతుంటారు. కానీ, నిజానికి ఇదొక బెస్ట్ ఆఫ్ రోడ్ వెహికల్.  దీని గ్రౌండ్ క్లియరెన్స్ 225 మి.మీ ఉంటుంది. ధర రూ.33.43 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది 2.8-లీటర్ డీజిల్ లేదా 2.7-లీటర్ పెట్రోల్ ఇంజన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో వస్తుంది.

మారుతి సుజుకి జిమ్నీ..

మారుతి సుజుకి జిమ్నీ.. చూడ్డానికి డిఫరెంట్ గా తక్కువ వెడల్పుతో ఉంటుంది. హిల్ రైడ్, ఆఫ్-రోడ్ డ్రైవింగ్‌కు కు ఇది బెస్ట్ ఛాయిస్. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 210 మి.మీ ఉంటుంది. ధర రూ.10.70 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. ఇది 1.5-లీటర్ పెట్రోల్, హైబ్రిడ్ ఇంజిన్‌, 5 స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తుంది. 4×4 డ్రైవ్ ఆప్షన్ కూడా ఉంది. మహింద్రా థార్ కు ఇది బెస్ట్ కాంపిటీటర్.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి