New Rules: కస్టమర్లకు భారీ షాక్‌.. ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు.. పూర్తి వివరాలు తెలుసుకోండి

New Rules from August 1: మీరు ఎక్కువగా బ్యాంకుకు సంబంధిత లావాదేవీలు చేస్తుంటారా..? అయితే ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. ఆగస్టు 1 నుంచి నిబంధనలు..

New Rules: కస్టమర్లకు భారీ షాక్‌.. ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు.. పూర్తి వివరాలు తెలుసుకోండి
Follow us
Subhash Goud

|

Updated on: Aug 01, 2021 | 5:59 AM

New Rules from August 1: మీరు ఎక్కువగా బ్యాంకుకు సంబంధిత లావాదేవీలు చేస్తుంటారా..? అయితే ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. ఆగస్టు 1 నుంచి నిబంధనలు మారబోతున్నాయి. ఈ కొత్త నిబంధనల వల్ల సామాన్యుల మీద ఎక్కవగా భారం పడనుంది. ఏటీఎం లావాదేవీలు, ఎల్‌పీజీ ధరలు, వేతనాలు, పెన్షన్లు ఇలా చాలా అంశాలకు సంబంధించి కొత్త మార్పులు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే సాధారణంగా ప్రతీ నెల ప్రారంభంలో కొత్త నిబందనలు అమల్లోకి వస్తుంటాయి. మరి ఆగస్టు 1 నుంచి అమలులోకి రానున్న కొత్త రూల్స్ ఏమిటో తెలుసుకుందాం.

వేతనం, ఈఎంఐ చెల్లింపులు:

నేషనల్‌ ఆటోమేటెడ్‌ క్లియరింగ్‌ హౌస్‌ (ఎన్ఏసీహెచ్) నిబంధనలలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) ఆర్‌బీఐ మార్పు చేయడం వల్ల సెలవు రోజుల్లో కూడా విద్యుత్, గ్యాస్, టెలిఫోన్, నీరు, జీతం, మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ సంబంధిత లావాదేవీలు జరుగుతాయి. ఈ కొత్త మార్పులు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 2021 నుంచి అమల్లోకి వస్తాయి. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్ మెంట్(ఆర్ టీజిఎస్), ఎన్ఏసిహెచ్ సేవలు 24ఎక్స్7 అందుబాటులో ఉంటాయని ఆర్‌బీఐ పేర్కొంది. ఎన్ఏసీహెచ్ అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ పీసీఐ) చేత నిర్వహించబడుతుంది.

డోర్‌ స్టెప్‌ బ్యాంకింగ్‌ సర్వీసు చార్జీలు:

ఇక ఇండియన్‌ పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ కొత్త నిబంధన తీసుకువచ్చింది. ఆగస్ట్ 1 నుంచి డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసులకు చార్జీలు వడ్డించనుంది. ప్రస్తుతం ఈ సేవలు ఉచితంగానే లభిస్తుండగా, ఈ రోజు నుంచి రూ.20 చార్జీ పడనుంది.

ఏటీఎం చార్జీలు:

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఏటీఎం క్యాష్‌ విత్‌ డ్రాయెల్స్‌కు సంబంధించి కొన్ని మార్పులు చేసింది. వచ్చే నెల నుంచి బ్యాంకులు ఇంటర్‌ఛేంజ్ ఫీజును రూ.15 నుంచి రూ.17కు పెంచుకోవచ్చని అనుమతి ఇచ్చింది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు ఇది వర్తిస్తుంది. అదే నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు చార్జీలు రూ.5 నుంచి రూ.6కు పెరగనున్నాయి.

ఐసీఐసీఐ బ్యాంకు చార్జీల సవరణ:

ఇక ప్రైవేటు రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) చార్జీలను సవరించింది. హోమ్ బ్రాంచులో నెలకు రూ.లక్ష వరకు చార్జీలు లేకుండా తీసుకోవచ్చు. రూ.లక్ష దాటితే రూ.1000కి రూ.5 చార్జీ పడుతుంది. గరిష్టంగా రూ.150 చార్జీ చెల్లించాలి. అదే నాన్ హోమ్ బ్రాంచులో అయితే రోజుకు రూ.25 వేల వరకు క్యాష్ ట్రాన్సాక్షన్లకుచార్జీలు ఉండవు. రూ25 వేలు పైన అయితే రూ.1000కి రూ.5 చార్జీ పడుతుంది. గరిష్టంగా రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. సంవత్సరంలో 25 చెక్కుల వరకు ఎలాంటి చార్జీలు ఉండవు. అదే లిమిట్ దాటితే 10 చెక్కులు కలిగిన ప్రతి చెక్ బుక్‌కు రూ.20 కట్టాల్సి ఉంటుంది.

గ్యాస్‌ ధరలు:

ఇకపోతే ప్రతి నెలా ఆరంభంలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్(LPG Cylinder) ధరలు మారే అవకాశం ఉంటుంది. ఈ నెలలో కూడా ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదంటే తగ్గే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో స్థిరంగా కూడా కొనసాగవచ్చు. జూలై నెల 1 తేదీన ఎల్‌పీజీ ధరలను రూ. 26 పెంచాయి. మరి ఈ నెల పెరగనున్నాయా? తగ్గనున్నాయా? అనేది ఆగస్టు 1 తేదీన తేలిపోనుంది.

ఇవీ కూడా చదవండి

KYC: డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు ఉన్న వారికి హెచ్చరిక.. కేవైసీ పెండింగ్‌లో ఉంటే అకౌంట్లు కట్‌..!

RBI: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సంచలన నిర్ణయం.. ఆ బ్యాంకుకు రూ.5 కోట్ల జరిమానా విధింపు..!

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ