KYC: డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు ఉన్న వారికి హెచ్చరిక.. కేవైసీ పెండింగ్‌లో ఉంటే అకౌంట్లు కట్..!
KYC: ప్రస్తుతం బ్యాంకు ఖాతాలతో పాటు అన్ని అకౌంట్లకు కేవైసీ అనేది తప్పనిసరి అయ్యింది. జూలై 31లోగా తమ కేవైసీ పూర్తి చేయని వారి డీమ్యాట్,ట్రేడింగ్ అకౌంట్లు నిలిపివేస్తామంటూ..
KYC: ప్రస్తుతం బ్యాంకు ఖాతాలతో పాటు అన్ని అకౌంట్లకు కేవైసీ అనేది తప్పనిసరి అయ్యింది. జూలై 31లోగా తమ కేవైసీ పూర్తి చేయని వారి డీమ్యాట్,ట్రేడింగ్ అకౌంట్లు నిలిపివేస్తామంటూ సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్, నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ సర్య్కులర్ జారీ చేశాయి. ఈ ఖాతాలు నిలిపివేయకుండా ఉండాలంటే వెంటనే కేవైసీకి అవసరమైన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. కేవైసీకి సంబంధించి పేరు, అడ్రస్,పాన్ కార్డు వివరాలు, ఉపయోగంలో ఉన్న ఫోన్‌నెంబర్, ఈమెయిల్ అడ్రస్ తదితర వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులో లింకైన పాన్‌కార్డునే కేవైసీ గుర్తిస్తుంది. కాబట్టి పాన్‌కార్డును ముందుగా ఆధార్‌లో లింక్ చేయాల్సి ఉంటుంది. ఆధార్‌తో లింకైన మొబైల్ నంబర్ వివరాలు ఇవ్వడం మంచిది.
వ్యక్తిగత వివరాలతో పాటు వార్షిక సంపాదన అంశాలను కేవైసీలో పొందు పరచాల్సి ఉంటుంది. వ్యక్తిగత ఆదాయానికి సంబంధించి ఐదు కేటగిరీలు, వ్యక్తిగతేతర ఆదాయానికి సంబంధించి నాలుగు కేటగిరీలు ఉన్నాయి. వీటిని అనుసరించి డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్ కస్టమర్లు .. తమ ఆదాయ వివరాల ఆధారంగా తగు కేటగిరీని ఎంచుకోవాల్సి ఉంటుంది.