Multibagger stock: లక్ష రూపాయలను.. రూ.61 లక్షలు చేసిన స్టాక్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట..

స్టాక్‌ మార్కెట్‌(Stock Market) పెట్టుబడి పెట్టడం రిస్క్‌తో కూడుకున్నది అంటుటారు. అయితే మార్కెట్‌పై పట్టు ఉన్నవారు మాత్రం పెట్టుబడి పెడుతూ లాభాలు ఆర్జిస్తున్నారు...

Multibagger stock: లక్ష రూపాయలను.. రూ.61 లక్షలు చేసిన స్టాక్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట..
stock market
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Mar 13, 2022 | 9:04 PM

స్టాక్‌ మార్కెట్‌(Stock Market) పెట్టుబడి పెట్టడం రిస్క్‌తో కూడుకున్నది అంటుటారు. అయితే మార్కెట్‌పై పట్టు ఉన్నవారు మాత్రం పెట్టుబడి పెడుతూ లాభాలు ఆర్జిస్తున్నారు. కొన్ని స్టాక్‌లను ఎంచుకుని అందులో పెట్టుబడి పెట్టి మల్టీ రిటర్న్స్(Multibagger stock) పొందుతున్నారు. అలాంటి స్టాక్‌ల్లో ఆల్కైల్ అమైన్(Alkyl Amines) షేర్ ఒకటి. ఈ కెమికల్ స్టాక్ 2021లో మల్టీబ్యాగర్ స్టాక్‌లలో ఒకటిగా నిలిచింది. పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని అందించింది. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ గత 8 సంవత్సరాలలో రూ.49 నుండి రూ.3010కి పెరిగింది. ఈ కాలంలో దాదాపు 6000 శాతం రాబడిని ఇచ్చింది.

ఆగస్ట్ 2021లో జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరిన తర్వాత ఈ మల్టీబ్యాగర్ స్టాక్ గత ఆరు నెలలుగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ సంవత్సరం (YTD) సమయానికి, Alkyl Amines షేరు ధర రూ.3800 నుంచి రూ.3010 స్థాయిలకు దిగజారింది. ఈ కాలంలో 20 శాతం నష్టం. గత 6 నెలల్లో, ఈ మల్టీబ్యాగర్ కెమికల్ స్టాక్ దాదాపు రూ.4125 నుంచి రూ.3010 స్థాయిలకు పడిపోయింది. ఈ కాలంలో దాదాపు 27 శాతం నష్టపోయింది. అయితే, కోవిడ్ అనంతర ర్యాలీ నేపథ్యంలో ఈ మల్టీబ్యాగర్ స్టాక్ గత ఏడాదిలో 46 శాతానికి పైగా రాబడిని అందిస్తోంది. గత 5 సంవత్సరాలలో, Alkyl Amines షేరు ధర రూ.48.64 నుండి రూ.3010 వరకు పెరిగింది, ఈ కాలంలో దాదాపు 1900 శాతం పెరిగింది.

Alkyl Amines షేరు ధర రూ. 49 (NSEలో 7 మార్చి 2014న ముగింపు ధర) నుండి రూ.3010 (NSEలో మార్చి 11, 2022న ముగింపు ధర) స్థాయిలకు పెరిగింది. దాదాపు 8 సంవత్సరాల కాలంలో దాదాపు 61 రెట్లు పెరిగింది. ఒక ఇన్వెస్టర్ 5 సంవత్సరాల క్రితం ఈ స్టాక్‌లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే దాని విలువ ఇప్పుడు రూ.20 లక్షలకు చేరి ఉండేది. ఒక ఇన్వెస్టర్ 8 సంవత్సరాల క్రితం ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి రూ. 49 స్థాయిలలో ఒక స్టాక్‌ను కొనుగోలు చేసి ఉంటే ప్రస్తుతం దాని విలువ 61 లక్షలకు చేరి ఉండేది.

Note: స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పూర్తిగా నష్టభయంతో కూడుకున్నది. మల్టీబ్యాగర్‌ స్టాక్స్‌ని గుర్తించడానికి చాలా నైపుణ్యం కావాలి. పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం.

Read Also.. Gold: అప్పుడు పెరిగిన బంగారం దిగుమతి.. ఇప్పుడు తగ్గింది.. ఎందుకంటే..