MSME: చేతి వృత్తులు చేసుకునేవారికి పెద్దపీట.. చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఫోకస్..
చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి పై కేంద్ర ప్రభుత్వంతోపాటు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాయి. చేతి వృత్తులు చేసుకునే వారు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. దాని కోసం ఏం ఎస్ ఏం ఈ లాంటి..
చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి పై కేంద్ర ప్రభుత్వంతోపాటు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాయి. చేతి వృత్తులు చేసుకునే వారు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. దాని కోసం ఏం ఎస్ ఏం ఈ(MSME) లాంటి స్వచ్ఛంద సంస్థల ను ఏర్పాటు చేసి చిన్న తరహా పరిశ్రమలకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్నారు. దేశంలో కోట్ల సంఖ్యలో నిరుద్యోగులు ఉన్నారు. వారందరి జీవనోపాధికి ఉద్యోగాలు కల్పించాలంటే కష్టమైన పని. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆత్మనిర్బర్ భారత్ అభియాన్ పెరుతో వందకి పైగా పధకాలను కేంద్రం అమలు చేస్తుంది. కేంద్రం అమలు చేసే పథకాల ద్వారా యువత సబ్సిడీలతో చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని ఆర్ధికంగా వృద్ధి చెందేలా ఏర్పాట్లు చేసింది. అయితే కేంద్రం అమలు చేస్తున్న పథకాల పై ప్రజలకు అవగాహన లేకపోవడం తో అనుకున్నంతగా లబ్ది చేకూరడం లేదు.
ఫుడ్ ప్రాసెసింగ్,లెదర్ గార్మెంట్స్,ఆక్వా,ఆటో మొబైల్స్,లాంటి వందకు పైగా చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ లతో బ్యాంకుల ద్వారా ఆర్ధిక చేయూత నిస్తుంది. కేంద్ర ప్రభుత్వ పథకాల పై అవగాహనా లోపం తో వాటిని పొందేందుకు అవసరమైన సహకారం లేక చాలా మంది లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. ఈనేపథ్యంలో నే ఏం ఎస్ ఏం ఇ లాంటి స్వచ్ఛంద సంస్థలు లబ్ధిదారులకు అండగా నిలుస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తో ఏం ఎస్ ఏం ఇ సంస్థ కొత్తగా చిన్నతరహా పరిశ్రమ లు పెట్టుకునేందుకు అవసరమైన ట్రైనింగ్,ఎక్స్పోర్టింగ్,మార్కెటింగ్ లాంటి అంశాల పై శిక్షణ ఇస్తుంది.
పరిశ్రమలకు అవసరమైన ఆర్దిక పరమైన అంశాలలో కూడా సలహాలు సూచనలు ఇస్తుంది. కేంద్రం,రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలతో అమలు చేస్తున్న పథకాల పై అవగాహన కల్పించడమే కాకుండా బ్యాంక్ ల ద్వారా సబ్సిడీలతో లోన్ లు వచ్చేలా సహకారం అందిస్తారు. అంతే కాకుండా నేషనల్ బ్యాంక్ ల సహాకారం తో అన్ని జిల్లాలలో లోన్ మేళా లు నిర్వహించి చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకునే వారికి అండగా నిలుస్తున్నారు.
ఏం ఎస్ ఏం ఇ సంస్థ సహకారం తో ఇప్పటికె వందలమంది చిన్నతరహా పరిశ్రమల యజమానులు లబ్ది పొంది ఆర్ధికంగా ఎదిగారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పధకాలను పొందేందుకు అవసరం అయినా అన్నీ అర్హతలు ఉన్నా ఎలా అప్లై చేసుకోవాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడ్డామని ఏం ఎస్ ఏం ఇ ధ్వారా సబ్సిడీ లతో లోన్ లు పొంది ఆర్ధిక వృద్ధి సాధిస్తున్నామని లబ్దిదారులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి: Honey Bitter: ఇక్కడ తేనె చెదుగా ఉంటుంది.. అయినా అమృతమే.. ఈ ప్రదేశంలో అదే స్పెషల్.. ఎక్కడంటే..
Andhra Pradesh: జోలె పట్టి భిక్షాటన మొదలు పెట్టిన సర్పంచ్.. కదలివచ్చిన గ్రామం.. కారణం తెలిస్తే..